
చెవిరెడ్డిని వాహనంతో ఢీ కొట్టించిన పోలీసులు
తిరుపతి : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలపై తిరుపతి పోలీసులు దౌర్జన్యం చేశారు. పల్లిపట్టులో బుధవారం ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పోలీసులు తమ వాహనంతో ఢీకొట్టించారు. ఈ ఘటనలో చెవిరెడ్డి గాయపడగా, ఆయనను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీనిపై తిరుపతి పోలీసులుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.