
తిరుపతి క్రైం : పిల్లలు లేరని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం చిత్తూరు జిల్లా తిరుపతి నగరంలో చోటు చేసుకుంది. అలిపిరి ఎస్‌ఐ పరమేశ్వర్ కథనం మేరకు.. నగరంలోని ఆటో నగరంలో నివాసముంటున్న లక్ష్మీపతి (35) వివాహమై ఆరేడు సంవత్సరాలు గడుస్తున్నా పిల్లలు పుట్టలేదు. అంతేకాకుండా చిన్న చిన్న అప్పులు ఉండడంతో కూడా ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులు.. సంసార బాధలతో శుక్రవారం రాత్రి ఇంట్లోకి వెళ్లారు.
ఆదివారం రోజంతా కూడా బయటకు రాకపోవడంతో స్థానికులు గమనించి ఇంటిలోకి వెళ్లి పరిశీలించగా లక్ష్మీపతి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. వెంటనే విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఎస్వీ వైద్య కళాశాలకు తరలించారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.