డిప్యూటీ సీఎం, సనాతనవాదిగా లేబుల్ వేసుకున్న పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మళ్ళీ తన చిత్తశుద్ధిని చాటుకుని తన ఆపాదించుకున్న సనాతనవాది టైటిల్‌ను నిరూపించుకోవాల్సిన తరుణం వచ్చింది. సందర్భాన్ని బట్టి కమ్యునిష్టుగా.. కులం లేనివానిగా.. ఒక్కోసారి.. దళితుడిగా.. ఇంకోసారి ఇంకోలా మారిపోయే నయా సనాతన వాది పవన్ కళ్యాణ్ ఇప్పుడు తక్షణమే గెటప్ మార్చాల్సిన తరుణం వచ్చింది.
తిరుపతిలో లడ్డుల్లో కల్తీ, జంతువుల కొవ్వు ఉందని ఎవరో ఎక్కడో చెప్పారని .. రూఢీ కానీ ఆరోపణలను పట్టుకుని ఉన్న ఫలంగా కాషాయం బట్టలు ధరించి ప్రాయశ్చిత్తం అనే కిరీటం పెట్టేసుకుని దుర్గమ్మ ఆలయం మెట్లు కడిగేసిన పవన్ కళ్యాణ్ మళ్ళీ ఇప్పుడు సనాతనవాది గెటప్ వేయాలి. దేశంలో దుష్టశిక్షణ జరగాల్సిన ప్రతి సందర్భంలోనూ నేను అవతరిస్తాను అని విష్ణుమూర్తి చెప్పి... అలాగే ఉద్భవించి రావణుడు.. హిరణ్యకశిపుడు వంటి రాక్షసులను సంహరించారు,. అలాగే పవన్ కూడా ఇదే మాట చెప్పుకున్నారు.
సనాతన ధర్మానికి విఘాతం కలిగితే చాలు తాను మగ కాళికగా మారతానని హూంకరించారు. నిలువు బొట్లు.. కాషాయం బట్టలతో నానా హడావుడి చేశారు.. ఆలయ ఆంప్రోక్షణ పేరిట వీడియో షూట్లు చేశారు. చిత్తశుద్ధి పేరిట పవన్ చేసిన ఈ స్కిట్‌ను కొందరు అభినందించగా చాలామంది ట్రోల్ చేసారు. ఇక ఇప్పుడు వైకుంఠ ఏకాదశి దర్శనం టోకెన్లు ఇచ్చేవిషయంలో క్యూ లైన్లు నిర్వహణ సరిగా లేక అధికారుల్లో బాధ్యత లేక.. సినిమా టిక్కెట్ల కోసం ఒకేసారి గేట్లు తీసి జనాన్ని వదిలినట్లు వదలడం. పోలీసులు కూడా ఎక్కడ లైన్లు నియంత్రించకపోవడంతో తొక్కిసలాట(Stampede) జరిగింది.
ఆరుగురు ప్రాణాలు హరించుకుపోయాయి. పదుల సంఖ్యలో భక్తులు తొక్కిసలాటలో నలిగిపోయి ఆస్పత్రుల పాలయ్యారు. మరి ఇప్పుడు ఆలయ పవిత్రతకు భంగం కలగలేదా..? ఇన్స్టంట్ సనాతన వాది పవన్ రక్తం మరిగిపోలేదా.. ఇప్పుడు సంప్రోక్షణ అవసరం లేదా.. ప్రాయశ్చిత్త దీక్ష చేయోద్దా...? మెట్లు కడిగే పని లేదా ? మరోవైపు బిజెపి నాయకులు కూడా కిక్కురుమనడం లేదు.. అసలు రాష్ట్రంలో అలంటి ఘటన జరగనట్లే ఉంటున్నారు. అంటే వీళ్లంతా చంద్రబాబుకు ఇబ్బంది ఎదురైతేనే కలుగుల్లోంచి బయటకు వస్తారా లేకుంటే బొరియలలో దాక్కుంటారా అనే సందేహాలు ప్రజల్లో ముప్పిరిగొంటున్నాయి.
ఇప్పుడు పవన్ అర్జన్ట్ గా తిరుపతి వెళ్లాలి.. వీలయితే చీపురు ఫినాయిల్ బకెట్ పట్టుకుని మెట్లు కడగాలి.. మల్లోమారు ఆయనలోని సనాతన వాది బయటకు రావాలని ఒరిజినల్ హిందుత్వవాదులు ఆశపడుతున్నారు. కానీ, ఇప్పటికే ఆయన అక్కడికి చేరుకోవడంతో.. అది జరగదనే అనుకోవాలి.
:::సిమ్మాదిరప్పన్న
ఇదీ చదవండి: పవన్ ఇమేజ్‌కు డ్యామేజ్ షురూ!
Comments
Please login to add a commentAdd a comment