రజని భర్త లక్ష్మారెడ్డి
తల్లి మృతదేహం వద్ద బోరున
విలపించిన హర్షవర్ధన్
నేడు అంత్యక్రియలు
మద్దిలపాలెం: రద్దీగా ఉండడంతో క్యూలోంచి బయట వెళ్లిపోదాం అనుకున్నంతలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో తన భార్య రజని ప్రాణాలు కోల్పోయిందని భర్త గుడ్ల లక్ష్మారెడ్డి భోరుమంటూ విలపించారు. అప్పటి వరకూ ఇద్దరం కలిసి క్యూలో జాగ్రత్తగా వెళ్తున్న సమయంలో రద్దీ అధికమవ్వడంతోపాటు గేట్లు తెరిచారని, దీంతో జనం ఒక్కసారిగా క్యూలో కదలడం పలువురి ప్రాణాలు పోవడానికి కారణమయిందని మద్దిలపాలేనికి చెందిన మృతురాలు రజని భర్త లక్ష్మారెడ్డి వాపోయారు.
రెండు గంటల తర్వాత జాడ తెలిసింది
‘తొక్కిసలాటలో తప్పిపోయిన రజని కోసం వెతుకుతున్నా. ఎక్కడా జాడలేదు. దీంతో ఏం చేయాలో తెలియలేదు. నా చేతిలో ఫోన్‌కూడా రజనీ బ్యాగులో ఉండిపోయింది. దీంతో అక్కడే వున్న ఆటో డ్రైవర్ ఫోన్ ద్వారా కాల్ చేస్తున్న పనిచేయలేదు. ఏం జరిగిందో తెలియదు. రెండు గంటల తర్వాత ఆస్పత్రిలో చేర్పింపిచారని సమాచారం అందింది. ఆ ఆస్పత్రి ఎక్కడుందో తెలియక ఆటో ద్వారా అక్కడి చేరుకున్నా. వెళ్లి చూసే సరికి విగత జీవిగా పడి ఉంది’అంటూ బోరున విలపించారు.
అమెరికా నుంచి హుటాహుటిన వచ్చిన హర్షవర్ధన్ రెడ్డి.. తల్లి భౌతికకాయాన్ని చూసి సొమ్మసిల్లిపోయాడు. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు రజనీ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
నేడు అంత్యక్రియలు
అమెరికా నుంచి మృతురాలి తమ్ముడు శనివారం విశాఖ వస్తున్నారు. అతను రాగానే అంత్యక్రియలు నిర్వహిస్తామని భర్త లక్ష్మారెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment