సీతంపేట: తిరుపతి తొక్కిసలాట ఘటనలో మరణించిన సూరిశెట్టి లావణ్య మృతదేహానికి స్థానిక జగన్నాథపురం శ్మశానంలో ప్రభుత్వ లాంఛనాలతో శుక్రవారం అంత్యక్రియలు జరిగాయి. తెల్లవారు జామున 3 గంటలకు విశాఖ చేరిన మృతదేహాన్ని అక్కయ్యపాలెం 80 అడుగుల రోడ్‌లో సందర్శనార్థం ఉంచారు.
లావణ్య భర్త, కుమార్తెలు, కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో ఆ ప్రాంతంలో విషాదం అలుముకుంది. ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, వార్డు కార్పొరేటర్ పెద్దిశెట్టి ఉషశ్రీ తదితరులు లావణ్య మృతదేహం వద్ద నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. దహన సంస్కారాల నిమిత్తం ప్రభుత్వ సాయాన్ని అర్బన్ ఎమ్మార్వో రమేష్‌బాబు అందించారు.
బోరున విలపించిన∙కుమార్తెలు : మృతదేహం విశాఖ చేరడానికి కొద్దిసేపటి ముందు లావణ్య మృతి చెందిన విషయం ఆమె కుమార్తెలకు తెలిపారు. దీంతో కుమార్తెలిద్దరూ షాక్‌కు గురయ్యారు. తల్లిని విడిచి ఎప్పుడు ఒక్క క్షణం ఉండలేని పిల్లలు, తల్లి ఇక లేదన్న విషయాన్ని తట్టుకోలేక తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. తిరుపతి వెళ్లే ముందు అమ్మ చెప్పిన మాటలు గుర్తుచేసుకుని బోరున ఏడ్చేశారు.
Comments
Please login to add a commentAdd a comment