![ys Jagan asks cadre to relief assistance for cyclone Foni victims - Sakshi](/styles/webp/s3/article_images/2019/05/3/YS-jagan-serious.jpg.webp?itok=3reghlEJ)
సాక్షి, హైదరాబాద్: ఉత్తరాంధ్రపై పెను ప్రభావం చూపించిన ఫొని తుపానుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరా తీశారు. శ్రీకాకుళం జిల్లా పార్టీ నాయకులు ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్, తమ్మినేని సీతారాం, కిల్లి కృపారాణి, తదితర నేతలతో ఆయన శుక్రవారం ఫోన్‌లో మాట్లాడారు. ఉత్తరాంధ్రలో ఫొని ప్రభావాన్ని అడిగి తెలుసుకున్న వైఎస్ జగన్... తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు అండగా నిలవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
కాగా తుపాను తీరం దాటినప్పటికీ శ్రీకాకుళం జిల్లా భారీ వర్షాలతో పాటు, ఈదురు గాలులు వీస్తున్నాయి. మరోవైపు జిల్లా కలెక్టర్ కూడా పరిస్థితిని ఎప్పటికప్పుడూ సమీక్షిస్తున్నారు. ఇక టెక్కలిలో తుపాను ధాటికి అన్నా క్యాంటీన్ షెల్టర్ గాలికి ఎగిరిపోయింది. దీనితో కరెంటు వైర్లు తెగిపడ్డాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment