AP: చిట్స్ నిర్వహణలో ఇక కొత్త విధానం | AP Government new approach in managing chits | Sakshi
Sakshi News home page

చిట్స్ నిర్వహణలో ఏపీ ప్రభుత్వ కొత్త విధానం, ఇక నుంచి అంతా..

Published Mon, May 15 2023 3:19 PM | Last Updated on Mon, May 15 2023 3:32 PM

AP Government new approach in managing chits - Sakshi

సాక్షి, అమరావతి:  ఏపిలో చిట్ ఫండ్ వ్యాపారం పారదర్శకంగా జరిగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో.. చిట్స్ నిర్వహణలో ఏపీ ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఇక నుంచి అంతా ఆన్ లైన్ విధానంలోనే సాగనుందని ఏపీ రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు వెల్లడించారు. అంతేకాదు.. ఇ -చిట్స్ అనే ఎలక్ట్రానిక్ అప్లికేషన్ ను ప్రారంభించారాయన. 

కొత్త విధానం ప్రకారం అన్ని చిట్ ఫండ్ కంపెనీలు అన్ లైన్ ద్వారా మాత్రమే లావాదేవీలు నిర్వహించాలి. ఇందుకోసం ఏపీ రెవిన్యూ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖలు ఇ-చిట్స్ అనే ఎలక్ట్రానిక్‌ను రూపొందించాయి.  చందాదారులు అంతా ఇ- చిట్స్ ద్వారా తన డబ్బు సురక్షితంగా ఉందో లేదో.. ఈ కొత్త విధానం ద్వారా తెలుసుకోవచ్చు. చందాదారు మోసపోకుండా చూడాలనే ఈ విధానం తీసుకొచ్చినట్లు మంత్రి ధర్మాన వెల్లడించారు. 

రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు ఆన్‌లైన్‌లో పరిశీలించి ఆమోదం తెలియజేస్తారు. ఈ విధానం ద్వారా మాత్రమే ఇక నుంచి చిట్ లు నిర్వహించాల్సి ఉంటుంది. అలాగే.. గతంలో నమోదు అయిన సంస్థలు క్రమంగా ఈ విధానంలోకి రావాల్సిందేనని మంత్రి ధర్మాన స్పష్టం చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement