chit fund
-
సంతకాలు చేస్తారా.. చస్తారా?
సాక్షి, అమరావతి: ఆదరించినవారికి ద్రోహ చేయడం, ఆశ్రయం కల్పించిన వారిని ముంచేయడం అంటే ఠక్కున చంద్రబాబే గుర్తుకు వస్తారు. కానీ ఆయన రాజగురువు రామోజీరావు కూడా ఆ విషయంలో రెండాకులు ఎక్కువే చదివారు. రామోజీ వ్యాపార సామ్రాజ్యానికి నల్లధనం సరఫరా యూనిట్‌గా నిలుస్తున్న మార్గదర్శి చిట్‌ఫండ్సే నమ్మక ద్రోహం, మోసాల పునాదుల మీద ఏర్పడింది. నమ్మి ఆశ్రయం కల్పించిన మిత్రుడు, భాగస్వామి జీజే రెడ్డి కుటుంబాన్ని నిలువునా మోసం చేసి, వారి షేర్లను కొల్లగొట్టి.. తుపాకీతో బెదిరించి మరీ మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ను హస్తగతం చేసుకోవడం రామోజీ వికృత వ్యాపారానికి నిదర్శనం. రామోజీ చేసిన ద్రోహంపై జీజే రెడ్డి వారసులు సీఐడీకి ఫిర్యాదు చేయడంతోపాటు న్యాయ పోరాటం చేయాల్సి వస్తోంది. పాయింట్ బ్లాంక్‌లో తుపాకి గురిపెట్టి రామోజీ చేసిన మైండ్ బ్లోయింగ్ దుర్మార్గం ఇదిగో ఇలా ఉంది.. ఆదరించిన చేయినే కాటేసిన రామోజీ.. కృష్ణాజిల్లా జొన్నలపాడుకు చెందిన జీజే రెడ్డి చెకొస్లెవేకియాలో ఉన్నత విద్య పూర్తి చేసిన అనంతరం ఢిల్లీలో నవభారత్ ఎంటర్ప్రైజెస్ అనే కంపెనీని ఏర్పాటు చేశారు. అదే జిల్లా పెదపారుపూడికి చెందిన రామోజీరావు అప్పట్లో నిరుద్యోగి. 1960లో కమ్యూనిస్ట్ పార్టీ నేత కొండపల్లి సీతారామయ్య సిఫార్సు చేయడంతో రామోజీకి జీజే రెడ్డి తన కంపెనీలో టైపిస్టుగా ఉద్యోగం ఇచ్చారు. అంతేకాదు.. రెండేళ్లకే అంటే 1962లో మార్గదర్శి చిట్‌ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేయడం కోసం రామోజీరావుకు జీజే రెడ్డి ఆర్థిక సహకారం అందించారు. ఆ కంపెనీలో జీజే రెడ్డికి 288 షేర్లు ఉన్నాయి. తదనంతర పరిణామాల్లో జీజే రెడ్డి చెకొస్లెవేకియాలో స్థిరపడి 1985లో అక్కడే చనిపోయారు. ఆయన భార్య కూడా 1986లో మరణించారు. కాగా జీజే రెడ్డి ఇద్దరు కుమారులు మార్టిన్ రెడ్డి, యూరి రెడ్డి మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో తమ తండ్రి వాటా షేర్లను తమ పేరిట బదిలీ చేయాలని చాలాసార్లు కోరినా రామోజీరావు ససేమిరా అన్నారు. ఆ షేర్లు ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. తుపాకీతో బెదిరించిన రామోజీ 2014లో పత్రికల్లో వచ్చిన వార్తలు, నోటిఫికేషన్ల ద్వారా మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో షేర్ల వివరాలను మార్టిన్ రెడ్డి, యూరి రెడ్డి తెలుసుకున్నారు. అప్పటి నుంచి తమ తండ్రి పేరిట ఉన్న షేర్ల కోసం రామోజీరావును కలిసేందుకు రెండేళ్లపాటు ప్రయత్నించిన తరువాత... 2016 సెప్టెంబరు 29న రామోజీరావు ఆ సోదరులిద్దరికీ అపాయింట్మెంట్ ఇచ్చారు. తమ తండ్రి పేరిట ఉన్న షేర్లకు సంబంధించి షేర్ సర్టిఫికెట్ ఇవ్వాలని మార్టిన్ రెడ్డి రామోజీని కోరారు. అప్పుడు 2007–08 వార్షిక సంవత్సరానికి సంబంధించి షేర్లపై డివిడెండ్ కింద రూ.39,74,400 విలువైన యూనియన్ బ్యాంక్ చెక్ (నంబరు 137991)ను ఆయన వారికిచ్చారు. మిగిలిన సంవత్సరాల డివిడెండ్ కూడా చెల్లించాలని యూరీ రెడ్డి కోరారు. అవన్నీ సెటిల్ చేస్తానని చెప్పి రామోజీరావు వెళ్లిపోయారు. అనంతరం.. రామోజీరావు సిబ్బంది మార్టిన్ రెడ్డి, యూరి రెడ్డిని ఓ గదిలో కూర్చోమని చెప్పి వెళ్లారు. కాసేపటికి రామోజీ ఆ గదిలోకొచ్చి ఓ రూ.100 విలువైన స్టాంపు పేపర్‌పై రాసిన అఫిడవిట్ మీద సంతకం చేయమని మార్టిన్ రెడ్డికి చెప్పారు. తన వాటా షేర్లను తన సోదరుడు యూరి రెడ్డి పేరిట మార్చేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని అందులో రాసి ఉంది. అదే సమయంలో 2016 అక్టోబరు 5 వ తేదీతో ఉన్న రూ.2,88,000 పోస్ట్ డేటెడ్ చెక్ (నంబరు 296460)ను యూరి రెడ్డికి ఇచ్చి తేదీ లేని ఫామ్ ఎస్‌హెచ్–4పై సంతకం చేయమని రామోజీరావు చెప్పారు. కానీ, దీనిపై సంతకం చేసేందుకు యూరి రెడ్డి నిరాకరించారు. దాంతో రామోజీరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తూ.. తుపాకీ తీసి అన్నదమ్ములు మార్టిన్ రెడ్డి, యూరి రెడ్డిల తలకు గురిపెట్టారు. ‘మిమ్మల్ని కాపాడటానికి ఇక్కడ ఎవరూ లేరు. సంతకాలు చేయకపోతే కాల్చి పారేస్తా’ అని బెదిరించారు. దాంతో ప్రాణభయంతో ఆ ఫామ్‌పై యూరి రెడ్డి సంతకం చేశారు. తమ షేర్లను ఎవరి పేరిట బదిలీ చేస్తోందని గానీ, తేదీ గానీ ఆ ఫామ్‌పై లేవు. తుపాకితో బెదిరించడంతో కేవలం ప్రాణభయంతోనే ఆ ఫామ్‌పై సంతకాలు చేసి అక్కడి నుంచి బయటపడ్డారు. షేర్ల బదిలీకి సమ్మతించని సోదరులు ప్రాణభయంతో ఆ ఫామ్‌పై సంతకం చేసినప్పటికీ తమ వాటా షేర్లను బదిలీ చేసేందుకు యూరి రెడ్డి, మార్టిన్ రెడ్డి సమ్మతించలేదు. అందుకే వారు రామోజీరావు ఇచ్చిన చెక్కును నగదుగా మార్చుకోలేదు. ఆ చెక్కును నగదుగా మారిస్తే షేర్ల బదిలీకి సమ్మతించినట్టు అవుతుంది. అందుకే వారు ఆ చెక్కును నగదుగా మార్చకుండా అలానే ఉంచారు. నిజానికి.. షేర్లు బదిలీ చేయాలంటే ఒక్క పత్రంపై సంతకం చేస్తే సరిపోదు. అందుకు సంబంధించిన చాలా పత్రాలపై సంతకాలు చేయాలి. చిట్‌ఫండ్స్ చట్టం, కంపెనీల చట్టం ప్రకారం నిర్దేశించిన అన్ని పత్రాలపై తాను సంతకాలు చేయలేదు కాబట్టి తాను షేర్లు బదిలీ చేసినట్లు కాదని యూరి రెడ్డి ధీమాగా ఉన్నారు. రామోజీరావు ఇచ్చిన చెక్కును నగదుగా మార్చుకోలేదు కాబట్టి షేర్ల బదిలీకి అంగీకరించలేదనడానికి బలమైన సాక్ష్యంగా ఉందని ఆయన భావించారు. ప్రాణభయంతో మరోసారి రామోజీని సంప్రదించేందుకు సాహసించలేదు. తమ షేర్లపై రావల్సిన డివిడెండ్‌ను కూడా అడగలేకపోయారు. దీంతో 2016 నాటికి ఒక్కోటి రూ.55,450 విలువ చేసే 288 షేర్లు అంటే రూ.1,59,69,600 మూలధన విలువైన షేర్లు ఆయన పేరిట ఉన్నాయి. ఫోర్జరీ సంతకాలతో అక్రమంగా బదిలీ కానీ అక్రమాల్లో ఆరితేరిన రామోజీ మాత్రం ఫోర్జరీ సంతకాలతో జీజే రెడ్డి షేర్లను తన కోడలు శైలజ కిరణ్ పేరిట బదిలీ చేసేశారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాలపై ఇటీవల ఏపీ సీఐడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దాంతో కాస్త ధైర్యం చేసుకుని యూరి రెడ్డి మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో తన షేర్ల గురించి తెలుసుకోవాలని భావించారు. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ కార్యాలయంలో పరిశీలించగా ఆయన పేరిట ఒక్క షేర్ కూడా లేదని తెలుసుకుని విస్తుపోయారు. ఆయన పేరిట ఉన్న 288 షేర్లను 2016లోనే శైలజ కిరణ్ పేరిట బదిలీ చేసినట్లు రికార్డుల్లో ఉంది. తాను సంతకాలు చేయకుండా ఎలా బదిలీ చేశారా అని పరిశీలిస్తే అసలు బాగోతం బయటపడింది. యూరి రెడ్డి సంతకాలను ఫోర్జరీ చేసి మరీ ఆయన వాటా షేర్లను శైలజ కిరణ్ పేరిట అక్రమంగా బదిలీ చేసేసినట్లు వెల్లడైంది. షేర్ల బదిలీకి కంపెనీల చట్టంలో నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించకుండానే రామోజీరావు ఫోర్జరీ సంతకాలు, నకిలీ పత్రాలతో కథ నడిపించేశారు. రామోజీ, శైలజలపై సీఐడీ కేసు జీజే రెడ్డి పెద్ద కుమారుడు మార్టిన్ రెడ్డి ప్రస్తుతం విదేశాల్లో ఉండగా.. రెండో కుమారుడు యూరి రెడ్డి భారత్‌లో నివసిస్తూ తమ కుటుంబ ఆస్తి వ్యవహా రాలను పర్యవేక్షిస్తున్నారు. తమ షేర్లను రామోజీ రావు, శైలజ కిరణ్ ఫోర్జరీ పత్రాలతో అక్రమంగా బదిలీ చేసుకున్నారని యూరి రెడ్డి ఏపీ సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఎందుకంటే కృష్ణా జిల్లాలోని తమ స్వగ్రామంలోని ఆస్తుల నుంచి సేకరించిన నిధులనే జీజే రెడ్డి మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టారు. మరోవైపు.. ఆంధ్రప్రదేశ్‌లో 37 బ్రాంచి కార్యాలయాల ద్వారా మార్గదర్శి చిట్‌ఫండ్స్ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. దీనిపై న్యాయ నిపుణులను సంప్రదించిన తరువాతే యూరి రెడ్డి తన షేర్ల అక్రమ బదిలీపై ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేశారు. ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని నిర్థారించుకున్న తరువాత సీఐడీ విభాగం కేసు నమోదు చేసింది. ఏ–1గా చెరుకూరి రామోజీరావు, ఆయన కోడలు చెరుకూరి శైలజ కిరణ్‌ను ఏ–2గా పేర్కొంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. వారిపై ఐపీసీ సెక్షన్లు 420, 467, 120–బి రెడ్‌విత్ 34 కింద అభియోగాలు నమోదు చేసింది. -
మతతత్వ పార్టీలకు ఆదరణ ఉండదు
సాక్షి, అమరావతి: బీజేపీ వంటి మతతత్వ పార్టీలకు దక్షిణాది రాష్ట్రాల్లో పెద్దగా ఆదరణ ఉండదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ అన్నారు. స్వర్ణాంధ్ర వేదిక ఆధ్వర్యంలో ఫిల్మ్ చాంబర్ హాల్లో బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. చిట్‌ఫండ్ చట్టాలను పాటించాల్సిన అవసరం లేదని మార్గదర్శి నిర్వాహకులు చెబుతున్నారని, అలాంటి వారిపై ఎందుకు కేసులు పెట్టకూడదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకు వస్తామంటున్న యూనిఫామ్ సివిల్ కోడ్ అనవసరమని, దానికంటే ముందు దేశంలో ఆర్థిక అసమానతలు తొలిగించే దిశగా దృష్టి సారించాలని కోరారు. దీనిపై వైఎస్సార్సీపీ, టీడీపీ, జనసేన వ్యతిరేకమా, అనుకూలమా అనే దానిపై వైఖరి ఏమిటో వెల్లడించాలన్నారు. ఒక్కో రాష్ట్రంలో వివాహ, విడాకుల సంప్రదాయం ఒక్కోలా ఉంటుందని, అన్నిటికీ ఒకే విధానాన్ని తీసుకురావడం సమంజసం కాదని అన్నారు. కాంగ్రెస్ పార్టీలోకి వైఎస్ షర్మిల వస్తే కాంగ్రెస్‌కు కచ్చితంగా మంచి జరుగుతుందన్నారు. ప్రతిపక్షాల సమావేశ ప్రభావం ఉంటుంది కేంద్ర ప్రతిపక్షాలు బెంగళూరులో ఏర్పాటు చేస్తున్న సమావేశ ప్రభావం కచ్చితంగా ఉంటుందని ఉండవల్లి అన్నారు. రాష్ట్ర విభజనపై కేంద్రంతోను, పార్లమెంట్తోను, స్పీకర్తోను తాను గొడవ పడుతుంటే సీఎం వైఎస్ జగన్ మద్దతుగా నిలిచారని గుర్తు చేశారు. ఎన్నికల ముందు వచ్చే సర్వేలు చివరి నిమిషంలో మారే అవకాశం ఉందని, రాష్ట్రంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గట్టి పోటీ ఉంటుందని పేర్కొన్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వారాహి యాత్రలో ఆయన ప్రసంగాలు అయోమయానికి గురి చేసేవిగా ఉన్నాయన్నారు. పోలవరంలో డయాఫ్రమ్ వాల్ ఎందుకు దెబ్బతిన్నదో, బాధ్యులెవరో, దానిని పునరుద్ధరించడానికి ఎంత ఖర్చువుతుందో, అసలు పోలవరం ప్రస్తుత పరిస్థితి ఏమిటనే అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. రూ.కోటి 64.5 లక్షల కోట్లు అప్పులు చేసిన కేంద్రాన్ని అధికార, ప్రతిపక్షాలు ఒక్కమాట కూడా ఎందుకు అనడం లేదని ప్రశ్నించారు. మన రాష్ట్రం నుంచి వెళ్లిన పన్నుల సొమ్ము మొత్తం కేంద్రం ఇస్తే మనకు సరిపోతుందని.. అప్పులు చేయక్కర్లేదని అన్నారు. -
AP: చిట్స్ నిర్వహణలో ఇక కొత్త విధానం
సాక్షి, అమరావతి: ఏపిలో చిట్ ఫండ్ వ్యాపారం పారదర్శకంగా జరిగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో.. చిట్స్ నిర్వహణలో ఏపీ ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఇక నుంచి అంతా ఆన్ లైన్ విధానంలోనే సాగనుందని ఏపీ రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు వెల్లడించారు. అంతేకాదు.. ఇ -చిట్స్ అనే ఎలక్ట్రానిక్ అప్లికేషన్ ను ప్రారంభించారాయన. కొత్త విధానం ప్రకారం అన్ని చిట్ ఫండ్ కంపెనీలు అన్ లైన్ ద్వారా మాత్రమే లావాదేవీలు నిర్వహించాలి. ఇందుకోసం ఏపీ రెవిన్యూ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖలు ఇ-చిట్స్ అనే ఎలక్ట్రానిక్‌ను రూపొందించాయి. చందాదారులు అంతా ఇ- చిట్స్ ద్వారా తన డబ్బు సురక్షితంగా ఉందో లేదో.. ఈ కొత్త విధానం ద్వారా తెలుసుకోవచ్చు. చందాదారు మోసపోకుండా చూడాలనే ఈ విధానం తీసుకొచ్చినట్లు మంత్రి ధర్మాన వెల్లడించారు. రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు ఆన్లైన్లో పరిశీలించి ఆమోదం తెలియజేస్తారు. ఈ విధానం ద్వారా మాత్రమే ఇక నుంచి చిట్ లు నిర్వహించాల్సి ఉంటుంది. అలాగే.. గతంలో నమోదు అయిన సంస్థలు క్రమంగా ఈ విధానంలోకి రావాల్సిందేనని మంత్రి ధర్మాన స్పష్టం చేశారు. -
రాజమహేంద్రవరంలో మరో మార్గదర్శి
-
శారదా గ్రూప్ ఆస్తుల వేలం
న్యూఢిల్లీ: నిబంధనలకు విరుద్ధంగా చిట్ ఫండ్ తదితర అక్రమ పథకాలను నిర్వహించిన శారదా గ్రూప్ ఆస్తులను వేలం వేయనున్నట్లు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా పేర్కొంది. ఏప్రిల్ 11న నిర్వహించనున్న వేలానికి రూ. 32 కోట్ల రిజర్వ్ ధరను నిర్ణయించింది. ఆస్తులలో కంపెనీకి చెందిన పశ్చిమ బెంగాల్‌లోని భూములు న్నట్లు సెబీ నోటీసులో ప్రకటించింది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 మధ్య ఈవేలం నిర్వహించనున్నట్లు తెలియజేసింది. ఆస్తుల అమ్మకంలో సహకరించేందుకు క్వికార్ రియల్టీని, ఈవేలం నిర్వహణకు సీ1 ఇండియాను ఎంపిక చేసుకుంది. శారదా గ్రూప్ ఆస్తుల వేలానికి 2022 జూన్‌లో కోల్‌కతా హైకోర్టు అనుమతించడంతో సెబీ తాజా చర్యలకు దిగింది. మూడు నెలల్లోగా ప్రక్రియను ముగించవలసిందిగా కోర్టు ఆదేశించింది. శారదా గ్రూప్ 239 ప్రయివేట్ కంపెనీల కన్సార్షియంగా ఏర్పాటైంది. పశ్చిమ బెంగాల్, అస్సామ్, ఒడిషాలలో కంపెనీ నిబంధనలకు విరుద్ధంగా చిట్ ఫండ్ బిజినెస్‌ను చేపట్టింది. 2013 ఏప్రిల్‌లో మూతపడటానికి ముందు 17 లక్షల మంది కస్టమర్ల ద్వారా రూ. 4,000 కోట్లు సమీకరించింది. ముందుగానే శారదా గ్రూప్ ఆస్తులకు సంబంధించి సొంతంగా వివరాలు తెలుసుకోవలసి ఉంటుందని సెబీ స్పష్టం చేసింది. తదుపరి వేలంలో బిడ్స్ దాఖలు చేసుకోమని సూచించింది. -
Margadarsi Chit Fund: అన్నీ ఉల్లంఘనలు మోసాలే!
సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్‌ఫండ్ కంపెనీలో భారీ అవకతవకలు, మోసాలు జరిగినట్లు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్, ఐజీ వి.రామకృష్ణ వెల్లడించారు. చందాదారులు పాడుకున్న చిట్టీల సొమ్మును డిపాజిట్లుగా సేకరించి ఉషోదయ ఎంటర్ప్రైజెస్, ఉషాకిరణ్ మూవీస్, ఇతర కంపెనీలకు మళ్లించినట్లు తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి చెందిన చిట్టీల రికార్డులు, ఖాతాలను సక్రమంగా నిర్వహించడం లేదని, ఆ కంపెనీ వ్యవహారాలన్నీ అనుమానాస్పదంగా ఉన్నాయని చెప్పారు. కనీసం కంపెనీ బ్యాలెన్స్ షీట్లను కూడా అధికారులకు చూపడం లేదన్నారు. మార్గదర్శితోపాటు 35 కంపెనీల్లో మూడు విడతలుగా తనిఖీలు నిర్వహించి పలు ఉల్లంఘనలను గుర్తించినట్లు తెలిపారు. తనిఖీలకు మార్గదర్శి ఫోర్మెన్లు ఏమాత్రం సహకరించలేదన్నారు. ఉల్లంఘనలు, మోసాలపై మార్గదర్శి సహా ఇతర కంపెనీలకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తామన్నారు. సమాచారం ఇవ్వకుండా సహాయ నిరాకరణ చేసిన మార్గదర్శి కంపెనీలో ప్రత్యేకంగా ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తామన్నారు. హైదరాబాద్‌లోని ఆ కంపెనీ హెడ్‌క్వార్టర్‌లోనూ తనిఖీలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. వెలగపూడిలోని సచివాలయంలో సోమవారం ఆయన స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అదనపు కమిషనర్ ఉదయభాస్కర్తో కలిసి మీడియాకు ఈ వివరాలు వెల్లడించారు. అందుకే మూడు రోజులు.. మార్గదర్శిలో ఏపీలోని 37 బ్రాంచిలకు ఒక్కో వ్యక్తిని ఫోర్‌మెన్‌గా నామినేట్ చేశారు. వారికి ఎటువంటి అధికారాలు, చెక్ పవర్ ఇవ్వలేదు. బ్రాంచిల బ్యాంక్ అకౌంట్ల వివరాలు కూడా వారికి తెలియవు. ఆ బ్రాంచిల సొమ్ము ఎక్కడికి బదిలీ అవుతుందో తెలియదు. బ్రాంచి లావాదేవీలు ఏవీ వారికి తెలియదు. తనిఖీల సమయంలో ఏది అడిగినా మాకు తెలియదు.. హెడ్‌క్వార్టర్స్‌లో ఉన్నాయని సమాధానం చెప్పారు. వారి నుంచి ఎలాంటి సహకారం అందలేదు. అక్కడ దొరికిన డాక్యుమెంట్ల గురించి అడిగినా చెప్పలేదు. వాటికి సంబంధించిన స్టేట్మెంట్లపై సంతకాలు చేసేందుకు చేయడానికి నిరాకరించారు. అందుకే ఆ సంస్థలో తనిఖీలకు మూడు రోజుల సమయం పట్టింది. అవసరమైన సమాచారం, వివరాలు ఇవ్వలేదు. అక్కడ దొరికిన కొంత సమాచారాన్ని మాత్రమే తీసుకోగలిగాం. వడ్డీ ఆశ చూపి డిపాజిట్లు సేకరించారు మార్గదర్శిలో వడ్డీ ఆశ చూపించి సెక్యూరిటీ డిపాజిట్లు సేకరించడం పెద్ద ఉల్లంఘనగా గుర్తించాం. డిపాజిట్లు కట్టిన వారికి ఒక రశీదు మాత్రమే ఇస్తున్నారు. ఆ రశీదు గురించి బ్రాంచి ఫోర్మెన్కి సమాచారం కూడా లేదు. రశీదులో 6–12 నెలలకు నాలుగు శాతం వడ్డీ, 12 అంతకంటె ఎక్కువ నెలలైతే ఐదు శాతం వడ్డీ ఇస్తామని పేర్కొన్నారు. సెక్యూరిటీ సొమ్ముపై వడ్డీ ఎలా చెల్లిస్తారు? అదేమీ బ్యాంకులో వేసిన డిపాజిట్ కాదు. దీనిపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పడంలేదు. సెక్యూరిటీ సొమ్మును ఎక్కడ ఉంచుతున్నారు? ఏ బ్యాంక్ ఖాతాలో ఉంచారు? వాటి లావాదేవీల గురించి ఫోర్మెన్కి తెలియదు. ఇది చాలా సీరియస్ ఉల్లంఘన. సెక్యూరిటీ రూపంలో డిపాజిట్లు సేకరించడం అనుమానాస్పదం. వడ్డీ ఆశ చూపుతున్నారంటే ఆ సొమ్మును ఎక్కడో పెట్టుబడి పెట్టినట్లు అర్థమవుతోంది. దీన్నిబట్టి ఆ సొమ్మును వేరే దానికి వాడుతున్నారు. ఇది పూర్తిగా మోసం. వేరే వ్యాపారానికి ఉపయోగించకూడదు చిట్‌ఫండ్ సొమ్మును వేరే వ్యాపారాలకు ఉపయోగించకూడదు. దీనిపై చూస్తూ ఊరుకోం. కఠినమైన చర్య తీసుకుంటాం. ఆ సెక్యూరిటీ సొమ్మును రాష్ట్రంలోని అన్ని బ్రాంచీల వారీగా ప్రత్యేకంగా డిపాజిట్ చేయాలని ఇప్పటికే మార్గదర్శికి సూచించాం. ప్రజల సొమ్ముకు భద్రత కల్పించాల్సిన బాధ్యత మాపై ఉంది. అన్నింటికీ ఒకే అకౌంట్ ద్వారా ఇష్టానుసారంగా నిర్వహిస్తున్నారు. కొత్త చిట్ఫండ్కి, పాత చిట్ఫండ్కి, పాట పాడుకున్న వారికి ఒకే అకౌంట్ చూపిస్తున్నారు. ఫోర్‌మెన్ కట్టిన చందాకు మిగతా చందాదారుల మాదిరిగానే సెక్యూరిటీ చూపించి అది వేరే ప్రత్యేక అకౌంట్లో ఉంచాలి. కానీ అలా చేయడంలేదు. మార్గదర్శి ఆర్థిక పరిస్థితిపై అనుమానాలు అత్యవసరమైన రికార్డులను కూడా మార్గదర్శి నిర్వహించడం లేదు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి ప్రత్యేకంగా బ్యాలెన్స్ షీట్ ఫైల్ చేయాలి. అలా ఫైల్ చేయకపోవడం వల్ల ఫండ్స్ ఎక్కడున్నాయి? ఆ కంపెనీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? సక్రమంగా నిర్వహిస్తున్నారో లేదో తెలియడం లేదు. వీటిపై చాలా అనుమానాలున్నాయి. మార్గదర్శి ఆర్థిక పరిస్థితిపై అనుమానాలు వ్యక్తం అవతున్నాయి. ప్రతి చిట్‌కి వివరాలు ఇవ్వాలి. కానీ ఇవ్వడం లేదు. బ్యాలెన్స్ షీట్లు ఇవ్వకపోవడం వల్ల వారి పెట్టుబడుల గురించి తెలియడంలేదు. ఇది పెద్ద మోసం.. పబ్లిక్ డొమైన్లో ఉన్న వివరాల ఆధారంగా మార్గదర్శి సొమ్ములు ఉషోదయ ఎంటర్ప్రైజెస్, ఉషాకిరణ్ మూవీస్ ఇతర కంపెనీల్లో ఉన్నట్లు గుర్తించాం. చిట్‌ఫండ్ సొమ్మును ఇతర కంపెనీలు మళ్లించినట్లు స్పష్టమైంది. ఇది పెద్ద మోసం. ప్రజల సొమ్మును రిస్కులో పెట్టారు. చిట్‌ఫండ్ చట్టం ప్రకారం బ్యాలెన్స్ షీట్స్, ప్రత్యేక బ్యాంక్ అకౌంట్స్ లేవు. లావాదేవీలు, పెట్టుబడుల వివరాలు లేవు. ఇవన్నీ సీరియస్ ఉల్లంఘనలు. తనిఖీల సమయంలో మా అధికారులు చాలా ఓపిగ్గా వ్యవహరించారు. సహనంగా సమాచారం సేకరించేందుకు ప్రయత్నించినా వారు సహకరించలేదు. సమాచారం ఇవ్వకపోగా అధికారులు తమను ఇబ్బంది పెట్టారని, డజన్ల సంఖ్యలో అధికారులు వచ్చారని పత్రికల్లో కథనాలు రాశారు. జీఎస్టీ ఉల్లంఘనలు కూడా ఉన్నందున తనిఖీల్లో ఆ అధికారులు కూడా భాగస్వాములయ్యారు. వీటిపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇప్పటికే మార్గదర్శికి నోటీసులిచ్చినట్లు మా దృష్టికి వచ్చింది. స్పెషల్ ఆడిట్ నిర్వహిస్తాం చిట్‌ఫండ్ కంపెనీలు చట్టాన్ని ఉల్లంఘించి ఇష్టానుసారంగా నిర్వహిస్తుంటే చూస్తూ ఊరుకోం. ప్రజల సొమ్మును రక్షించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాం. 7 నుంచి 10 రోజుల్లో పూర్తి స్థాయి షోకాజ్ నోటీసు ఇస్తాం. వారిచ్చిన సమాధానాన్ని బట్టి తదుపరి చర్య ఉంటుంది. అకౌంట్స్ నిర్వహణ సక్రమంగా లేదు కాబట్టి మార్గదర్శిలో స్పెషల్ ఆడిట్ నిర్వహిస్తాం. ఫోరెన్సిక్ తరహాలో జరిగే ఈ ప్రత్యేక ఆడిట్లో అన్ని అకౌంట్స్, అన్ని లావాదేవీలు, డాక్యుమెంట్స్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తాం. ప్రతి ఒక్కటీ హైదరాబాద్ హెడ్‌క్వార్టర్‌లో ఉంటుందని మార్గదర్శి ఫోర్మెన్స్ చెబుతున్నారు కాబట్టి తెలంగాణ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సహకారంతో అక్కడ కూడా తనిఖీలు చేస్తాం. ఇన్ని ఉల్లంఘనలు జరిగిన దృష్ట్యా మార్గదర్శి, ఇతర కంపెనీల్లో కొత్త చిట్స్‌ను అన్ని పరిశీలించాకే అనుమతి ఇస్తాం. గతంలో ఇతర సంస్థల్లోనూ.. చిట్‌ఫండ్ సంస్థల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. చిట్టీలు కట్టేముందు ఆ కంపెనీలకు సంబంధించిన అన్ని వివరాలు తెలుసుకోవాలి. తనిఖీల్లో ఎలాంటి వివక్ష లేదు. ఫిర్యాదులు వచ్చిన అన్ని కంపెనీల్లో తనిఖీలు చేశాం. 2018లోనే కపిల్ చిట్స్‌లో ఈ తరహా తనిఖీలు చేసి చర్యలు తీసుకున్నాం. 2019 నుంచి 2022 వరకు ఆ కంపెనీకి కొత్త చిట్స్‌ను వేసే అవకాశం ఇవ్వలేదు. 2018లోనే మార్గదర్శి సంస్థ బ్యాంకు స్టేట్మెంట్స్ చూపించడం లేదని అప్పటి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ గుర్తించారు. సెకండ్ అకౌంట్స్ వివరాలు ఇప్పటికీ ఇవ్వలేదు. ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకుంటాం. -
రాష్ట్రంలోని చిట్ ఫండ్ కంపెనీలపై రెండో రోజు తనిఖీలు
-
ఏపీలో 18 చిట్ ఫండ్ సంస్థల్లో రిజిస్ట్రేషన్ శాఖ తనిఖీలు
-
ఏపీ వ్యాప్తంగా చిట్‌ఫండ్, ఫైనాన్స్ కంపెనీల్లో సోదాలు
-
‘చిట్‌ఫండ్’ దాడి కేసులో గాయపడిన వ్యక్తి మృతి
వరంగల్ క్రైం: హనుమకొండలో పెట్రోల్ దాడికి గురైన సెల్‌ఫోన్ షాపు నిర్వాహకుడు పిట్టల రాజు (28) చికిత్స పొందు తూ బుధవారం సాయంత్రం మృతిచెందాడు. నగరంలోని అచల చిట్‌ఫండ్‌లో ఏజెంట్‌గా పనిచేస్తున్న గొడుగు గణేష్ అతని భార్య కావ్యలు క్షణికావేశంతో ఈనెల 3న రాజుపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన విషయం తెలిసిందే. తీవ్రగాయాలతో నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో రాజు ఆరు రోజులుగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. టేకుమట్ల మండలం పంగిడిపల్లికి చెందిన పిట్టల రాజు, చిట్యాల మండలం నైన్‌పాకకు చెందిన గొడుగు గణేష్ స్నేహితులు. రాజు సెల్‌ఫోన్ బిజినెస్‌లో ఎదుగుతున్న క్రమంలో, గణేశ్ అచల చిట్‌ఫండ్‌లో ఏజెంట్‌గా చేరి రాజు చేత రూ.5 లక్షల చీటీ వేయించాడు. చీటీ ఎత్తుకున్న తరువాత సకాలంలో డబ్బులు కట్టకపోవడంతో రాజు, గణేష్ మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. ఈ గొడవ ముదిరి గణేశ్ అతని భార్య కావ్య రాజుపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు. -
చిట్‌ఫండ్ మోసగాడి అరెస్టు
టెక్కలి: డివిజన్ కేంద్రంలోని చిరు వ్యాపారుల నుంచి చిట్‌ఫండ్ పేరుతో రూ.లక్షలు వసూలు చేసి ఉడాయించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక సీఐ కార్యాలయంలో సీఐ కె.భవానీ ప్రసాద్, ఎస్ఐ జి.రాజేష్ ఈ వివరాలను శనివారం వెల్లడించారు. సీఐ భవానీప్రసాద్ మాట్లాడుతూ టెక్కలికి చెందిన యువకుడు శ్రీనివాస్ శతపతి చిట్‌ఫండ్ పేరుతో రూ.లక్షలు వసూలు చేసి మోసగించాడని పట్టణానికి చెందిన కొండాల భుజంగరావుతో పాటు మరో 20 మంది బాధితులు ఫిర్యాదుచేశారని వెల్లడించారు. నిర్వాహకుడు శతపతితో పాటు తల్లి సుహాసిని శతపతి, తండ్రి అనంత సేనా శతపతి, సోదరి ప్రశాంతి శతపతి తో పాటు స్థానిక వ్యాపారి తంగుడు కృష్ణపై ఫిర్యాదు చేశారన్నారు. ఈ కేసులో సుమారు రూ. 45,68,835 చిట్ రూపంలో బాధితులు చెల్లించినట్లు లెక్క తేలిందన్నారు. ఇందులో రూ.19,56,500 ఖాతాదారులకు ఇచ్చినట్లు శతపతి చెప్పాడని సీఐ పేర్కొన్నారు. మిగిలిన రూ.27,23,855ను బాధితులకు చెల్లించాల్సి ఉందన్నారు. శతపతిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తామని, మిగిలిన వారిని విచారించి మిగిలిన వారిని అరెస్టు చేస్తామన్నారు. అంతేగాక వారి ఆస్తులను అటాచ్ చేసేలా చర్యలు తీసుకుంటామని సీఐ వెల్లడించారు. -
చిట్స్ పేరుతో మోసం
► లబోదిబోమంటున్నబాధితులు ► సంఘమిత్ర ఎంటర్‌ప్రైజెస్‌పై కేసు నమోదు తిరుపతి: చిట్‌ఫండ్ పేరుతో డబ్బులు వసూలు చేసి బోర్డు తిప్పేసిన సంఘటన తిరుపతి నగరంలో గురువారం రాత్రి వెలుగులోకి వచ్చింది. ఈస్ట్ సీఐ రాంకిశోర్, బాధితురాలు సావిత్రి కథనం మేరకు.. నగరంలోని ఎయిర్ బైపాస్ రోడ్డులోని పాస్‌పోర్టు ఆఫీస్ సమీపంలో ఉన్న సంఘమిత్ర ఎంటర్ ప్రైజెస్ పేరుతో చిట్‌ఫండ్‌ను నిర్వహిస్తున్నారు. ఇందులో ఎన్జీవోస్ కాలనీలో నివాసముంటున్న సుబ్రమణ్యం భార్య సావిత్రి, మరో ఐదుగురు స్నేహితులు 2015 నవంబర్‌లో రూ.10 లక్షల చిట్లు వేశారు. కొద్దినెలల పాటు సజావుగానే సాగింది. 10 నెలలు కట్టించుకుని అనంతరం చిట్లు ఎత్తేస్తున్నామని కంపెనీ డైరెక్టర్లు ఆమెకు సూచించారు. ఇంతవరకు కట్టిన డబ్బుతో పాటు కమిషన్ కూడా ఇస్తామన్నారు. దీంతో అంగీకరించిన సావిత్రి 2 నెలల అనంతరం తిరిగి తమకు రావాలల్సిన డబ్బులను అడిగారు. ఆ సంస్థలో 8 మంది డైరెక్టర్లు ఉండడంతో ఒకరిపై ఒకరు చెప్పుకుని తిప్పించుకుంటూనే ఉన్నారు. మోసం చేశారని తెలుసుకున్న ఆమె గురువారం ఈస్ట్ పోలీసులను ఆశ్రయించింది. ఆ సంస్థ డైరెక్టర్లు శ్రీ ఇంజినీరింగ్ కళాశాల అధినేత దామోదరం, గోపి, భూపతి, మరో ఐదుగురు కలసి తనను మోసం చేశారంటూ పోలీసులకు తెలిపింది. సీఐ రాంకిశోర్ తన సిబ్బందితో గురువారం రాత్రి సంఘమిత్ర కార్యాలయంలో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కంపెనీ రిజిస్టర్ అయినట్లుగానీ, కంపెనీకి సంబంధించిన ఎటువంటి డాక్యుమెంట్లు దొరకలేదు. అనుమతి లేకుండానే చిట్లు నడుపుతున్నట్టు గుర్తించారు. దీంతో దామోదరంతో పాటు మరో డైరెక్టర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదేవిధంగా ఇంకా ఎంతోమంది బాధితులు ఉన్నారని వీళ్లు బయటకు పొక్కకుండా తరచూ వారిని ప్రలోభపెడుతూ రోజులు గడుపుతున్నారని తెలుస్తోంది. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నమ్మకానికి చెల్లుచీటి
పాలకొల్లు టౌ¯ŒS : పాలకొల్లులో బాలాజీ ట్రేడర్స్ హోల్‌సేల్ వ్యాపారి జవ్వాజి నాగ వెంకట సత్య నరసింహారావు (రవి) రూ.3కోట్లకు టోకరా వేసి పరారైన ఘటనపై పట్టణానికి చెందిన కిరాణా అసోసియేష¯ŒS అధ్యక్షుడు సన్నిశెట్టి లీలా భవన్నారాయణ పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. బాధితుల కథనం ప్రకారం.. పదేళ్లుగా రంగమన్నారుపేట సమీపంలో కొన్ని షాపులను అద్దెకు తీసుకుని బాలాజీ ట్రేడర్స్ పేరుతో రవి కన్జ్యూమర్స్ ప్రొడక్ట్స్ వ్యాపారం ప్రారంభించారు. దీంతోపాటు ప్రైవేట్ చిట్‌ఫండ్ కంపెనీ నెలకొల్పి వ్యాపారుల వద్ద చిట్స్ వేయించారు. పట్టణంలోని పలువురు వ్యాపారులు రవిపై నమ్మకంతో చిట్స్ వేయడంతోపాటు ఆయనకు రూ.లక్షల్లో వడ్డీలకు అప్పులు ఇచ్చారు. రవి చేతిలో సుమారు 50మంది వరకు మోసపోయినట్టు తెలుస్తోంది. చీటీలు పాడుకున్న పాటదారులకు కూడా సొమ్ములు చెల్లించకుండా రవి ఎగనామం పెట్టినట్టు సమాచారం. పట్టణంలో వ్యాపారుల వద్ద నుంచి రవి సుమారు రూ.కోటి వరకు వడ్డీలకు అప్పులు తీసుకుని చెక్కులు, ప్రాంసరీనోట్లు ఇచ్చినట్టు తెలిసింది. ఇదిలా ఉండగా పట్టణంలోని ఒక బ్యాంక్‌లో ఆయనకున్న అపార్టుమెంట్, ఖాళీస్థలం తనఖా పెట్టి వాటి విలువ కంటే సుమారు రూ.60 లక్షల వరకు రుణం పొందినట్టు సమాచారం. అతను పరారు కావడంతో ఆ బ్యాంక్ అధికారులు ఏమి చేయాలో తర్జనభర్జన పడుతున్నట్లు తెలిసింది. అలాగే ఒక రిటైర్డు బ్యాంక్ మేనేజర్ నుంచి రవి రూ.2లక్షలు అప్పుగా తీసుకున్నట్టు తెలుస్తోంది. రవికి అప్పులు ఇచ్చిన కొంతమంది వ్యాపారులు తమకిచ్చిన చెక్కులు తీసుకుని బ్యాంకులకు వెళితే అవి చెల్లలేదని సమాచారం. ఇదిలా ఉండగా అతని షాపులో పనిచేసిన ఒక వ్యక్తి తన స్థలాన్ని అమ్మి రూ.2లక్షలు రవికి వడ్డీకిచ్చినట్టు సమాచారం. మరికొందరు బాధితులు రెండురోజుల్లో రవిపై ఫిర్యాదు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. పెద్దనోట్ల రద్దు ప్రభావమేనా! పెద్దనోట్ల రద్దు ప్రభావం వల్ల వ్యాపారులు డీలా పడుతున్నట్టు తెలుస్తోంది. రవిలాగే చాలామంది జాతకాలు తలకిందులైనట్టు సమాచారం. డెల్టాలో ప్రధానంగా వడ్డీ, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు డీలా పడడంతో ఇప్పటివరకు రూ.కోట్ల అప్పులతో నడుస్తున్న వ్యాపారాలు ఒక్కసారిగా స్తంభించిపోవడంతో దిక్కుతోచని స్థితి ఎదురైందని సమాచారం. రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా చతికిలపడడంతో లావాదేవీలు జరగక తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక డెల్టాలోని నరసాపురం, పాలకొల్లు, భీమవరంలోని కొంతమంది వ్యాపారులు బోర్డులు తిప్పే పరిస్థితులున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. -
కదిరిలో బోర్డు తిప్పేసిన ఫైనాన్స్ సంస్థ!
-
‘చీటి’ంగ్‌పై అప్రమత్తం చేయాలి
విజయనగరం క్రైం : చిట్‌ఫండ్ మోసాలపై ప్రజలను అప్రమత్తం చేయాలని, ప్రజా పోలీసు సంబంధాలను మరింత పెంచేందుకు కృషి చేయాలని ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవాల్ సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం మాసాంతపు నేర సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ రహదారి ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వాహనదారులు డ్రైవింగ్ చేసే సమయంలో రోడ్డు నిబంధనలు పాటించేటట్లు చూడాలని, వాహనాలు అధికలోడుతో ప్రయాణం చేయడాన్ని నివారించాలని సూచించారు. ప్రజలతో మమేకమై ప్రజా పోలీసు సంబంధాలను మెరుగుపరిచేందుకు కృషి చేయాలని కోరారు. ఫిర్యాదు దారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించి వారి సమస్యను సామరస్యంగా తెలుసుకునిచట్టపరంగా పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం గతంలో వివిధ పోలీసు స్టేషన్లలో నమోదైన కేసులు, దర్యాప్తు దశ,విచారణలో ఉన్న కేసులను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా సమీ క్షించారు. కేసుల దర్యాప్తులో పురోగతిని గురించి తెలుసుకుని దర్యాప్తులో పాటించాల్సిన తీరుపై పోలీసు అధికారులకు పలు న్యాయపరమైన సూచనలు, మెలకువలను తెలియజేశారు. సమావేశంలో ఎస్పీ (అడ్మిన్) ఎం.సుందరరావు, పార్వతీపురం ఏఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ, విజయనగరం డీఎస్పీ ఎస్.శ్రీనివాస్, బొబ్బిలి డీఎస్పీ ఇషాక్ మహమ్మద్, ఏఆర్ డీఎస్పీ జి.శ్రీనివాసరావు, స్పెషల్‌బ్రాంచ్ సీఐలు, ఆర్ఐలు లీగల్ అడ్వయిజర్,పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు. -
బాధితులు.. నిందితులు.. విద్యావంతులే
ఇటీవల నగరంలో జరుగుతున్న మోసాలు ఎక్కువగా విద్యావంతులే చేస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో వెలుగు చూస్తోంది. మోసపోయేదీ చదువుకున్నవారే. వీరి సులువుగా డబ్బు సంపాదించి విలాస జీవితం గడిపేందుకు మోసాలను దగ్గరి మార్గంగా ఎంచుకుంటున్నారు. ఉద్యోగాల పేరిట నగరంలోని కృష్ణలంక పోలీసులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల పేరిట మోసగించిన నలుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేసిందీ. వీరిలో ముగ్గురు బీటెక్ చేయగా. ఒకరు ఇంటర్‌ను మధ్యలోనే ఆపేశారు. నిందితుల్లో సాధిక్, ప్రవీణ్‌కుమార్, రాజేష్ బీటెక్ చదివారు. ప్రధాన నిందితుడైన పి.భరత్‌చంద్ర ఇంజినీరింగ్ మధ్యలోనే ఆపేశాడు. బాగా చదువుకొని ఖాళీగా ఉండే వారిని లక్ష్యంగా చేసుకొని వీరు మోసాలకు దిగారు. వీరి చేతిలో మోసపోయిన వారిలో ఎంబీఎ పట్టభద్రులు, బీటెక్ చదివిన వారూ ఉన్నారు. ఉద్యోగాలను ఆశగా చూపించగానే ఏమాత్రం ఆలోచించకుండా నిందితుల చేతుల్లో లక్షలకు లక్షల రూపాయలు పోశారు. క్లిష్టమైన ఉద్యోగాల సులువుగా ఎలా వస్తాయని ఏ ఒక్కరు ఆలోచించినా వీరి మోసాలకు ఆదిలోనే అడ్డుకట్ట పడేదని సెంట్రల్ జోన్ ఏసీపీ లావణ్యలక్ష్మి అన్నారు. నకిలీ బంగారంతో.. తక్కువ ధరకు బంగారం పేరిట మోసగించిన ముఠా సభ్యులు కూడా విద్యావంతులే. ఈ కేసులో మాచవరం పోలీసులు అరెస్టు చేసిన రుద్రపాటి డేవిడ్ ఎంబీఎ చదవగా..ఇదే ముఠా సభ్యులైన మణీంద్రకుమార్ బీఎస్సీ, గోపీనాథ్ ఎంఎ, బీఏ బీఈడీ చేసిన శ్రీకాంత్, బీఎస్సీ చదివిన శివకిషోర్ ఉన్నారు. వీరి చేతిలో మోసపోయిన వారూ.. పెద్ద చదువులు చదువుకొని వ్యాపార రంగంలో స్థిరపడిన వారే. ఇంకా ఉంటారు పోలీసులకు చిక్కిన వాళ్లే కాకుండా చిక్కని మోసగాళ్లూ ఉన్నారు. రక రకాల పద్ధతుల్లో ఇటీవల ఉన్నత విద్యావంతులే మోసాలు చేస్తున్నారు. పరువుకు భయపడి కొందరు బాధితులు ముందుకు రావడం లేదు. మోసపోతున్న వారిలో బాగా చదువుకున్న వాళ్లు ఉండటం దురదృష్టకరం. -
చిట్ ఫండ్ పేరుతో టీడీపీ నేత కోటి రూపాయల కుచ్చుటోపి
ఖమ్మం: చిట్టిల పేరుతో టీడీపీ నేత జనాన్ని మోసం చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. సంఘమిత్ర చిట్‌ఫండ్ పేరుతో ఖమ్మం జిల్లా వైరాలో టీడీపీ నేత దేవబత్తిని నాగేశ్వరరావు జనానికి కుచ్చుటోపి పెట్టారు. సుమారు కోటి రూపాయల మేరకు కుచ్చుటోపి పెట్టినట్టు తెలుస్తోంది. మోసానికి గురైన ఇన్వెస్టర్ల ఫిర్యాదు మేరకు టీడీపీ నేత దేవబత్తిని నాగేశ్వరరావుపై చీటింగ్ కేసు నమోదు చేశారు. ఫిర్యాదుదారుల నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. చీటింగ్ పాల్పడినట్టు సమాచారం బయటకు పొక్కడం పెద్ద ఎత్తున్న ఖాతాదారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి ఘరానా మోసం
నిజామాబాద్ సిటీ, న్యూస్‌లైన్ : సొంత అవసరాల కోసం తెలిసిన వారితో పాటు తమ వద్ద అప్పులు తీసుకుని పరారీలో ఉన్న ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. జమానాతు ఇచ్చిన పాపానికి తమ వేతనాలకు ఎసరు వచ్చిందని సదరు ఉద్యోగులు వాపోతున్నారు. జిల్లా కేంద్రంలోని బీఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్ కార్యాలయంలో ప్లానింగ్ విభాగంలో సూపర్వైజర్గా పనిచేసే వెంకటేశం కొద్ది నెలల క్రితం తోటి ఉద్యోగుల వద్ద, తెలిసిన వారి వద్ద దాదాపు రూ.1.80 కోట్ల వరకు అప్పులు చేసినట్లు తెలిసింది. ఇందులో రూ.30 నుంచి 40 లక్షల వరకు వివిధ చిట్‌ఫండ్ కంపెనీలలో చీటీలు ఎత్తుకుని తోటి ఉద్యోగులను జమానాతు పెట్టాడు. ఓ పక్క ఉద్యోగం చేస్తూనే మరోపక్క ప్రైవేట్‌గా పలు వ్యాపారాలు చేసేవాడని సంస్థ ఉద్యోగులు తెలిపారు. దానికి పెద్ద మొత్తంలో డబ్బులు అవసరం కావటంతో తెలిసిన వారివద్ద,తోటి ఉద్యోగుల వద్ద లక్షలాది రూపాయలు అప్పులు చేశాడు. చేసిన అప్పులు తీర్చలేక దాదాపు నాలుగు నెలల క్రితం ఉద్యోగులకు కనిపించకుండా పోయాడు. విధులకు కూడా గైర్హాజరవుతున్నాడు. కనిపించకుండా పోయిన వెంకటేశం కోసం ఉద్యోగులు పలు చోట్ల ఆరా తీసినప్పటికి ఆచూకీ లభ్యం కాలేదు. చిట్‌ఫండ్‌లో ఎత్తుకున్న డబ్బులు చెల్లించక పోవటంతో జమానాతులు ఉన్న ఉద్యోగులకు చిట్‌ఫండ్ కంపనీల నుంచి వేతనం కటింగ్ల నోటీసులు జారీ అయ్యాయి. దీంతో కంగారు పడిన ఉద్యోగులు రెండు రోజుల కిత్రం జిల్లా ఎస్పీ కేవీ మోహన్‌రావును ఆశ్రయించారు. కనిపించకుండా పోయిన వెంకటేశంను ఇక్కడకు రప్పించాలని వినతి ఇచ్చారు. ఉద్యోగులు ఇచ్చిన ఫిర్యాదుపై తగిన న్యాయం చేస్తామని ఎస్పీ వారికి హామీ ఇచ్చారు.ఉద్యోగులు ఇచ్చిన ఫిర్యాదును ఎస్పీ డీఎస్పీ అనిల్‌కుమార్‌కు పంపారు. ఆయన దానిని నగర సీఐకి పంపి విచారించాలని ఆదేశించారు. అయితే ఉద్యోగులు ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో వెంకటేశంకు దాదాపు రూ.40 లక్షల వరకు జమానాతులు పెట్టినట్లు చెప్పారు. కాని మిగతా రూ.1.40 కోట్లపై బాధితులు ఎవరైనా తమకు ఫిర్యాదులు చేస్తే తగు చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఫైనల్ నోటీసులు జారీచేశాం.. సంస్థలో టెలికాం సూపర్వైజర్గా పనిచేసే వెంకటేశం నాలుగు నెలలుగా విధులకు గైర్హాజరవుతున్నారు. దీనిపై వివరణ ఇవ్వాలని ఆయనకు శాఖాపరమైన నోటీసులు జారీచేశాం.అతని నుంచి ఎలాంటి స్పందనలేదు. ఇటీవలే చివరిసారిగా నోటీసులు సైతం జారీచే శాం.శుక్రవారం విధులకు హాజరవుతానని చె ప్పాడు. కాని కాలేదు. కొంతమంది ఉద్యోగులు అతనిపై ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసినట్లు మా దృష్టికి వచ్చింది. అతనిపై చీటింగ్ కేసు నమోదైతే చర్యలకు పైఅధికారులకు నివేదిస్తాం. - జగ్గురాం, బీఎస్ఎన్ఎల్ ఏజీఎం