‘చీటి’ంగ్‌పై అప్రమత్తం చేయాలి
విజయనగరం క్రైం : చిట్‌ఫండ్ మోసాలపై ప్రజలను అప్రమత్తం చేయాలని, ప్రజా పోలీసు సంబంధాలను మరింత పెంచేందుకు కృషి చేయాలని ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవాల్ సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం మాసాంతపు నేర సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ రహదారి ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వాహనదారులు డ్రైవింగ్ చేసే సమయంలో రోడ్డు నిబంధనలు పాటించేటట్లు చూడాలని, వాహనాలు అధికలోడుతో ప్రయాణం చేయడాన్ని నివారించాలని సూచించారు. ప్రజలతో మమేకమై ప్రజా పోలీసు సంబంధాలను మెరుగుపరిచేందుకు కృషి చేయాలని కోరారు.
ఫిర్యాదు దారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించి వారి సమస్యను సామరస్యంగా తెలుసుకునిచట్టపరంగా పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం గతంలో వివిధ పోలీసు స్టేషన్లలో నమోదైన కేసులు, దర్యాప్తు దశ,విచారణలో ఉన్న కేసులను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా సమీ క్షించారు. కేసుల దర్యాప్తులో పురోగతిని గురించి తెలుసుకుని దర్యాప్తులో పాటించాల్సిన తీరుపై పోలీసు అధికారులకు పలు న్యాయపరమైన సూచనలు, మెలకువలను తెలియజేశారు. సమావేశంలో ఎస్‌పీ (అడ్మిన్) ఎం.సుందరరావు, పార్వతీపురం ఏఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ, విజయనగరం డీఎస్పీ ఎస్.శ్రీనివాస్, బొబ్బిలి డీఎస్పీ ఇషాక్ మహమ్మద్, ఏఆర్ డీఎస్పీ జి.శ్రీనివాసరావు, స్పెషల్‌బ్రాంచ్ సీఐలు, ఆర్‌ఐలు లీగల్ అడ్వయిజర్,పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.