Navdeep Singh greval
-
చింతమనేని దాడి చేయలేదట!
సాక్షి ప్రతినిధి, ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తన అధికారాన్ని ఎంతలా దుర్వినియోగం చేసిందీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఎన్నికల ముందు తనపై ఉన్న కేసులు ఎత్తి వేయించుకున్న సంగతి తాజాగా వెలుగుచూసింది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తహశీల్దార్ వనజాక్షిపై దాడి కేసు కూడా తప్పుడు కేసుగా తీసేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో పలు కీలకమైన కేసులను తప్పుడు కేసులుగా చూపించి ఎత్తివేశారు. ఈ విషయాలన్నీ పోలీసులు రహస్యంగా ఉంచారు. ఇప్పుడు చింతమనేని పరారీలో ఉండటంతో అతనిపై ఉన్న కేసులను పరిశీలిస్తున్న సమయంలో ఈ వివరాలు వెలుగుచూశాయి. అప్పట్లో కీలకంగా వ్యవహరించిన అధికారి ఈ కేసులను ఎత్తివేయించినట్లు సమాచారం. 2015 జూలై ఎనిమిదిన అప్పటి ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కృష్ణా జిల్లా ముసునూరు మండలం రంగంపేటలో ఇసుక ర్యాంపు వద్ద తహసీల్దార్ వనజాక్షిపై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై వనజాక్షి ముసునూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దాడి విషయంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు.. చింతమనేనినే వెనకేసుకు వచ్చారు. అయితే కనీసం ఫిర్యాదుదారునికి సమాచారం కూడా ఇవ్వకుండా కేసును తప్పుడు కేసు కింద చూపి ఈ ఏడాది ఫిబ్రవరి 15న తొలగించారు. డీఎస్పీ కేసును తప్పుడు కేసు కింద రిఫర్ చేసినప్పుడు కోర్టుకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. కోర్టు బాధితునికి కూడా నోటీసులు పంపుతుంది. ఈ ప్రక్రియ చేయకుండా కేసులను ఎత్తివేశారు. ఎన్నికల ముందు పెదవేగి మండలం లక్ష్మీపురంలో అక్రమంగా మట్టి తోలడాన్ని అడ్డుకున్న వైఎస్సార్ సీపీ నేత మేడికొండ కృష్ణారావు కేసును, దళిత మహిళను దూషించిన కేసును, గుండుగొలను వద్ద ఏఎస్ఐపై దాడి చేసిన కేసును, ఏలూరు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో దౌర్జన్యంగా ప్రవేశించి నిందితులను తీసుకువెళ్లిన కేసులను కూడా తప్పుడు కేసులుగా రిఫర్ చేశారు. ఇప్పటివరకూ చింతమనేని ప్రభాకర్‌పై 49 కేసులు నమోదు కాగా, అందులో 23 కేసులు రిఫర్ చేసి తీసివేశారు. ఈ కేసులన్నీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలోనే తొలగించడం విశేషం. బాధితులు ధైర్యంగా ముందుకు రావాలి: ఎస్పీ చింతమనేని అరాచకాలకు బలి అయిన బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి తమకు ఫిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవల్ కోరారు. శనివారం కూడా పలువురు బాధితులు ఎస్పీని కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. జగన్నాథపురం, సోమవరప్పాడు, భోగాపురం, శ్రీరామవరం గ్రామాలలో తమ భూములను చింతమనేని, అతని అనుచరులు అక్రమించుకున్నారంటూ పలువురు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. మరోవైపు చింతమనేని కేసులో సాక్షులు ఓ ఛానల్లో ఇంటర్వ్యూ ఇవ్వడంపై ఎస్పీ స్పందించారు. చింతమనేనిపై ఫిర్యాదు చేసిన జోసఫ్‌ను విచారించిన అనంతరం కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పారదర్శకంగా కేసు విచారణ జరుగుతోందని, పోలీసులపై ఉద్దేశపూర్వకంగా విమర్శలు చేస్తున్నారని అన్నారు. చింతమనేనిపై ఇంకా ఫిర్యాదులు వస్తున్నాయని, అన్ని ఫిర్యాదులపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని ఎస్పీ నవదీప్ సింగ్ గ్రేవల్ పేర్కొన్నారు. -
‘చీటి’ంగ్‌పై అప్రమత్తం చేయాలి
విజయనగరం క్రైం : చిట్‌ఫండ్ మోసాలపై ప్రజలను అప్రమత్తం చేయాలని, ప్రజా పోలీసు సంబంధాలను మరింత పెంచేందుకు కృషి చేయాలని ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవాల్ సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం మాసాంతపు నేర సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ రహదారి ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వాహనదారులు డ్రైవింగ్ చేసే సమయంలో రోడ్డు నిబంధనలు పాటించేటట్లు చూడాలని, వాహనాలు అధికలోడుతో ప్రయాణం చేయడాన్ని నివారించాలని సూచించారు. ప్రజలతో మమేకమై ప్రజా పోలీసు సంబంధాలను మెరుగుపరిచేందుకు కృషి చేయాలని కోరారు. ఫిర్యాదు దారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించి వారి సమస్యను సామరస్యంగా తెలుసుకునిచట్టపరంగా పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం గతంలో వివిధ పోలీసు స్టేషన్లలో నమోదైన కేసులు, దర్యాప్తు దశ,విచారణలో ఉన్న కేసులను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా సమీ క్షించారు. కేసుల దర్యాప్తులో పురోగతిని గురించి తెలుసుకుని దర్యాప్తులో పాటించాల్సిన తీరుపై పోలీసు అధికారులకు పలు న్యాయపరమైన సూచనలు, మెలకువలను తెలియజేశారు. సమావేశంలో ఎస్పీ (అడ్మిన్) ఎం.సుందరరావు, పార్వతీపురం ఏఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ, విజయనగరం డీఎస్పీ ఎస్.శ్రీనివాస్, బొబ్బిలి డీఎస్పీ ఇషాక్ మహమ్మద్, ఏఆర్ డీఎస్పీ జి.శ్రీనివాసరావు, స్పెషల్‌బ్రాంచ్ సీఐలు, ఆర్ఐలు లీగల్ అడ్వయిజర్,పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు. -
ప్రజా సహకారంతో శాంతి భద్రతలు
విజయనగరం క్రైం: ప్రతి పోలీసూ ప్రజలతో సత్సం బంధాలు కలిగి ఉండాలి. అపుడే పోలీసులకు కచ్చితమైన సమాచారం వస్తుంది. ప్రజల సహకారంతో జిల్లాలో శాంతి భద్రతలు పరిరక్షణకు కృషి చేస్తాను, వైట్‌కాలర్ నేరాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తానని నూతన ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవాల్ తెలిపారు. బుధవారం ఆయన జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. జిల్లా పోలీసుశాఖ మీడియాకు సమాచారం అందించడంలో విఫలమవుతోందని విలేకరులు ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లగా ఇకపై అటువంటి సమస్యలు లేకుండా చేస్తానని తెలిపారు. గత మూడు ఎన్నికల సందర్భంగా జిల్లా పోలీసు శాఖకు కేటాయించిన బడ్జెట్లో రూ.50 లక్ష ల వరకూ దుర్విని యోగమైనట్టు వచ్చిన ఆరోపణలపై విచారణ చేయిస్తానని, అధికార దుర్వినియోగం తదితర ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీస్ అధికారులపై విచారణ జరిపిస్తానని తెలిపారు. మావోయిస్టుల కదలికలపై తమ వద్ద పక్కా సమాచారం ఉందని, మావోయిస్టుల వారోత్సవాల సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు చో టుచేసుకోకుండా పూర్తి అప్రమత్తతతో వ్యవహరిస్తామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. విదేశీ ఉద్యోగాల పేరిట జరుగుతున్న మోసాలపై కూడా దృష్టిసారిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ ఎం.సుందరరావు పాల్గొన్నారు.