రాజు (ఫైల్)
వరంగల్ క్రైం: హనుమకొండలో పెట్రోల్ దాడికి గురైన సెల్‌ఫోన్ షాపు నిర్వాహకుడు పిట్టల రాజు (28) చికిత్స పొందు తూ బుధవారం సాయంత్రం మృతిచెందాడు. నగరంలోని అచల చిట్‌ఫండ్‌లో ఏజెంట్‌గా పనిచేస్తున్న గొడుగు గణేష్ అతని భార్య కావ్యలు క్షణికావేశంతో ఈనెల 3న రాజుపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన విషయం తెలిసిందే.
తీవ్రగాయాలతో నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో రాజు ఆరు రోజులుగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. టేకుమట్ల మండలం పంగిడిపల్లికి చెందిన పిట్టల రాజు, చిట్యాల మండలం నైన్‌పాకకు చెందిన గొడుగు గణేష్ స్నేహితులు. రాజు సెల్‌ఫోన్ బిజినెస్‌లో ఎదుగుతున్న క్రమంలో, గణేశ్ అచల చిట్‌ఫండ్‌లో ఏజెంట్‌గా చేరి రాజు చేత రూ.5 లక్షల చీటీ వేయించాడు. చీటీ ఎత్తుకున్న తరువాత సకాలంలో డబ్బులు కట్టకపోవడంతో రాజు, గణేష్ మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. ఈ గొడవ ముదిరి గణేశ్ అతని భార్య కావ్య రాజుపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment