జనగాం:వరంగల్ జిల్లాలో ఉప ఎన్నికల సందర్భంగా విధులు నిర్వర్తిస్తున్న క్రమంలో ఓ కానిస్టేబుల్ ఫిట్స్‌తో శుక్రవారం మృతిచెందాడు. ఎం.రాజు(48) అనే పోలీస్ కానిస్టేబుల్ రేపు జరగబోయే వరంగల్ ఉప ఎన్నికలలో డ్యూటీ నిమిత్తం రఘనాథపల్లి వచ్చారు.
శుక్రవారం ఉదయం ఫిట్స్ రావడంతో రాజును ఆస్పత్రికి తరలించే క్రమంలోనే మరణించారు. కానిస్టేబుల్ స్వగ్రామం మెదక్ జిల్లా నారాయణఖేడ్ మండలం చాప్తఖడీం. 1993 బ్యాచ్‌కు చెందిన రాజుకు కొంతకాలంగా ఫిట్స్ వస్తుండేదని తోటి కానిస్టేబుల్ రవీందర్ తెలిపారు. రాజుకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. పోస్టుమార్టం నిమిత్తం రాజు మృతదేహాన్ని జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు.