Tragedy in Wedding Function: Father Died In Daughter's Marriage In Warangal - Sakshi
Sakshi News home page

Tragedy in Wedding Function: చిన్న కూతురు పెళ్లి.. గ్రూప్‌ ఫొటో దిగారు.. అంతలోనే

Published Sun, Apr 24 2022 3:13 AM | Last Updated on Sun, Apr 24 2022 3:33 PM

Father Of The Bride Who Collapsed In Daughter Wedding In Warangal - Sakshi

కన్యాదానం చేస్తున్న వెంకట్రాంనర్సయ్య 

వరంగల్‌ చౌరస్తా: పెళ్లి మండపం అంతా సందడిగా ఉంది.. అతిథులు ఒకవైపు భోజనాలు చేస్తున్నారు. మరోవైపు కొందరు నూతన వధూవరులతో ఫొటోలు దిగుతున్నారు. అదే సమయంలో పెళ్లికూతురు తండ్రి కుప్పుకూలిపోయారు. కుటుంబ సభ్యులు దగ్గరకు వచ్చి చూడగా అప్పటికే చనిపోయారు. దీంతో అప్పటిదాకా సందడిగా, సంతోషంగా ఉన్న పెళ్లి మండపం వద్ద ఒక్కసారిగా రోదనలతో నిండిపోయింది.

వరంగల్‌ నగరంలో ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. వరంగల్‌ వేణురావు కాలనీకి చెందిన బోరిగం వెంకట్రాంనర్సయ్య, కళావతి దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వారిలో చిన్న కూతురు పెళ్లి శనివారం జరిగింది. పెళ్లితంతు పూర్తయ్యాక వెంకట్రాంనర్సయ్య.. కుటుంబసభ్యులతో కలసి గ్రూప్‌ ఫొటో దిగారు. అంతలోనే గుండెలో నొప్పి వస్తుందంటూ కుప్పకూలిపోయారు. పక్కనే ఉన్నవారు ఏమైందని చూసేలోగా ప్రాణం పోయింది. రాత్రి అంత్యక్రియలు పూర్తిచేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement