కొద్దినెలల పాటు సజావుగానే సాగింది. 10 నెలలు కట్టించుకుని అనంతరం చిట్‌లు ఎత్తేస్తున్నామని కంపెనీ డైరెక్టర్లు ఆమెకు సూచించారు. ఇంతవరకు కట్టిన డబ్బుతో పాటు కమిషన్ కూడా ఇస్తామన్నారు. దీంతో అంగీకరించిన సావిత్రి 2 నెలల అనంతరం తిరిగి తమకు రావాలల్సిన డబ్బులను అడిగారు. ఆ సంస్థలో 8 మంది డైరెక్టర్లు ఉండడంతో ఒకరిపై ఒకరు చెప్పుకుని తిప్పించుకుంటూనే ఉన్నారు. మోసం చేశారని తెలుసుకున్న ఆమె గురువారం ఈస్ట్ పోలీసులను ఆశ్రయించింది. ఆ సంస్థ డైరెక్టర్లు శ్రీ ఇంజినీరింగ్ కళాశాల అధినేత దామోదరం, గోపి, భూపతి, మరో ఐదుగురు కలసి తనను మోసం చేశారంటూ పోలీసులకు తెలిపింది.
సీఐ రాంకిశోర్ తన సిబ్బందితో గురువారం రాత్రి సంఘమిత్ర కార్యాలయంలో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కంపెనీ రిజిస్టర్ అయినట్లుగానీ, కంపెనీకి సంబంధించిన ఎటువంటి డాక్యుమెంట్లు దొరకలేదు. అనుమతి లేకుండానే చిట్లు నడుపుతున్నట్టు గుర్తించారు. దీంతో దామోదరంతో పాటు మరో డైరెక్టర్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదేవిధంగా ఇంకా ఎంతోమంది బాధితులు ఉన్నారని వీళ్లు బయటకు పొక్కకుండా తరచూ వారిని ప్రలోభపెడుతూ రోజులు గడుపుతున్నారని తెలుస్తోంది. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.