సభలో ప్రసంగిస్తున్న మంత్రి ధర్మాన ప్రసాదరావు
చంద్రబాబు టక్కు టమారాలు పనిచేయవు
తొలిరోజు ఎన్నికల ప్రచారంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): ప్రతి ఎన్నికల్లో చంద్రబాబు చేసే టక్కు టమారాలు, దొంగవిధానాలు, అబద్ధపు హామీలు, బూటకపు కూటములు ఈ ఎన్నికల్లో పనిచేయబోవని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని 50వ డివిజన్ ఆదివారం పేట పరిసర ప్రాంతంలో సోమవారం ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. వలంటీర్లపై టీడీపీ నేతలు ఎన్నికల కమిషన్‌కి ఫిర్యాదు చేసి, కుట్రలు కుతంత్రాలు పన్నిన కారణంగా పంపిణీలో జాప్యం చోటుచేసుకుందని మండిపడ్డారు. లబ్ధిదారులంతా ఇప్పుడు సచివాలయాల వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని దుయ్యబట్టారు.
జాతీయ సంస్థల సర్వేల్లో ఏపీ బెస్ట్
2019 నుంచి 2024 వరకు జరిగిన అభివృద్ధిపై జాతీయ సంస్థలు అనేక సర్వేలు చేశాయని, జీఎస్‌డీపీ టీడీపీ హయాంలో 22వ స్థానంలో ఉంటే ఈ ఐదేళ్లలో 5వ స్థానానికి వచి్చందన్నారు. తలసరి ఆదాయం 17 నుంచి 9వ స్థానానికి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలోనే 3వ స్థానంలో నిలిచిందన్నారు. ఇవన్నీ అభివృద్ధి సూచికలు కాదా అని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా పేరాడ తిలక్‌ను గెలిపించాలని కోరారు.
ఫ్యాన్ గుర్తుకే ఓటు
మంత్రి ధర్మాన ప్రసంగిస్తున్న సమయంలో 70 ఏళ్ల వృద్ధురాలు కూర్మాపు లకు‡్ష్మమమ్మ మధ్యలో లేచి మైక్ దగ్గరికి వెళ్లి మాట్లాడారు. ‘మీ అందరికీ దండంబాబు.. ఏ దిక్కు మొక్కులేని నాకు జగన్‌బాబు దయవల్ల వలంటీర్ ఇంటికొచ్చి పెన్షన్, బియ్యం ఇస్తున్నారు. నాకు భర్తలేడు. కోడలు చనిపోయింది. నా కొడుక్కి, ఇద్దరు మనవళ్లకు నేనే గంజి పోస్తున్నాను. తప్పనిసరిగా ఫ్యాన్ గుర్తుకే ఓటేసి జగన్‌బాబును, పెసాదుబాబును గెలిపిస్తా’ అంటూ తన యాసలో చెప్పి అందరినీ ఆకట్టుకుంది.
Comments
Please login to add a commentAdd a comment