సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అధ్యక్షతన ఉత్తరాంధ్ర రీజనల్ రెవెన్యూ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ మొదలైంది. శనివారం ఉదయం రుషికొండలోని రాడిసన్ బ్లూ హోటల్‌లో ఈ సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సుకు ఉత్తరాంధ్ర పరిధిలోని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, జిల్లా రెవెన్యూ అధికారులు, ఆర్డీవోలు, తహసీల్దారులు, ఇతర అధికారులు హాజరయ్యారు.
రెవెన్యూ వ్యవహారాలకు సంబంధించిన అంశాలపై సమగ్ర అవగాహన కల్పించేందుకు ఈ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. సీసీఎల్‌ఏ, రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి, సర్వే అండ్ సెటిల్‌మెంట్ డైరెక్టర్లు సైతం ఈ సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్బంగా ధర్మాన మాట్లాడుతూ.. ‘రెవెన్యూ శాఖలో సంస్కరణ అమలుపై సదస్సు నిర్వహించాము. వందేళ్ల తర్వాత రాష్ట్రంలో ఆధునిక సాంకేతికతతో సర్వే చేస్తున్నాము. అసైన్డ్ భూములు వ్యవసాయేతర పనులకు వినియోగంపై కమిటీ ఏర్పాటు చేస్తున్నాము. భూములను వినియోగంలోకి తేవడం ద్వారా జీడీపీ పెరుగుతుంది’ అని వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment