Revenue summits
-
రెవెన్యూ శాఖ ప్రాంతీయ సదస్సులో ధర్మాన కీలక వ్యాఖ్యలు
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అధ్యక్షతన ఉత్తరాంధ్ర రీజనల్ రెవెన్యూ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ మొదలైంది. శనివారం ఉదయం రుషికొండలోని రాడిసన్ బ్లూ హోటల్లో ఈ సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సుకు ఉత్తరాంధ్ర పరిధిలోని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, జిల్లా రెవెన్యూ అధికారులు, ఆర్డీవోలు, తహసీల్దారులు, ఇతర అధికారులు హాజరయ్యారు. రెవెన్యూ వ్యవహారాలకు సంబంధించిన అంశాలపై సమగ్ర అవగాహన కల్పించేందుకు ఈ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. సీసీఎల్ఏ, రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి, సర్వే అండ్ సెటిల్మెంట్ డైరెక్టర్లు సైతం ఈ సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్బంగా ధర్మాన మాట్లాడుతూ.. ‘రెవెన్యూ శాఖలో సంస్కరణ అమలుపై సదస్సు నిర్వహించాము. వందేళ్ల తర్వాత రాష్ట్రంలో ఆధునిక సాంకేతికతతో సర్వే చేస్తున్నాము. అసైన్డ్ భూములు వ్యవసాయేతర పనులకు వినియోగంపై కమిటీ ఏర్పాటు చేస్తున్నాము. భూములను వినియోగంలోకి తేవడం ద్వారా జీడీపీ పెరుగుతుంది’ అని వ్యాఖ్యలు చేశారు. -
'రెవెన్యూ సదస్సులను వాయిదా వేస్తున్నాం'
హైదరాబాద్:సాధారణ ఎన్నికల సన్నాహాక విధుల దృష్ట్యా రెవెన్యూ సదస్సులు వాయిదా వేసుకోమని ఈసీ లేఖ రాసిందని మంత్రి రఘువీరా రెడ్డి తెలిపారు. అందుచేత రెవెన్యూ సదస్సులను సాధారణ ఎన్నికల తర్వాతనే నిర్వహిస్తామన్నారు. సీఎం ధర్నాలు చేయవచ్చా?లేదా?అనే విషయాన్ని పక్కన బెడితే గతంలో ఎన్టీఆర్, మొన్న తాజాగా అరవింద్ కేజ్రీవాల్ లు ధర్నాలు చేశారని రఘువీరా తెలిపారు. మహిళా మంత్రులపై జరిగిన సంఘటనలు బాధాకరమన్నారు. త్వరలో మైక్రోసాఫ్ట్ సీఈవో నాదెళ్ల సత్యకు భారీ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నట్లు రఘువీరా తెలిపారు. -
ఫిబ్రవరి 10 నుంచి రెవెన్యూ సదస్సులు
సాక్షి, హైదరాబాద్: ఫిబ్రవరి 10వ తేదీ నుంచి 25వ తేదీ వరకూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి అధికారులను ఆదేశించారు. రెవెన్యూశాఖపై శుక్రవారం సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో భూ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ సదస్సులు నిర్వహణకు ఎజెండా రూపొందించాలని సూచించారు. కాగా, ఏడో విడత భూపంపిణీ కార్యక్రమాన్ని ఈనెల 10వ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. వీఆర్ఓ, వీఆర్ఏ పోస్టుల రాతపరీక్ష ముందుగా నిర్ణయించిన ప్రకారం ఫిబ్రవరి రెండో తేదీనే జరుగుతుందని రఘువీరా స్పష్టం చేశారు.