
శ్రీకాకుళం నియోజకవర్గం పరిధి గార మండలం వాడాడ పంచాయతీ కొత్తూరు–కొన్నిపేట గ్రామంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు ఆధ్వర్యంలో రచ్చబండ ,పల్లెనిద్ర కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ధర్మాన మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం హామీలిచ్చి నాలుగేళ్లు పూర్తయినా వాటిని నెరవేర్చలేదని, దీనిపై ప్రజలు ఆలోచించి ప్రజాప్రతినిధులు వచ్చినప్పుడు ప్రశ్నించాలన్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ గొండు కృష్ణమూర్తి, పార్టీ జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు గొండు రఘురాం, సర్పంచ్ బి.సావిత్రమ్మ పాల్గొన్నారు.
ఆమదాలవలస నియోజకవర్గంలోని సరుబుజ్జిలి మండలం కొండ్రగూడ గ్రామంలో పార్టీ పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు తమ్మినేని సీతారాం ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పూర్తిగా ప్రజలను గాలికొదిలేసి అవినీతిలో కూరుకుపోయిందన్నారు. పల్లెల్లో ప్రజలు పడుతున్న ఇబ్బందులను పట్టించుకోవడంలో విఫలమైందని దుయ్యబట్టారు. ఈ ప్రభుత్వం పూర్తిగా భ్రష్టుపట్టిందని, అవినీతి, ఆశ్రితపక్షపాతం, బంధుప్రీతితో ఊరేగుతోందని ధ్వజమెత్తారు. ఎంపీపీ కేవీపీ సత్యనారాయణ, జెడ్పీటీసీ ఎస్.నాగేశ్వరరావు పాల్గొన్నారు.
శ్రీకాకుళం అర్బన్: జనం మధ్యలోకి జగన్ దళం మరింత చొచ్చుకుపోయింది. ప్రజా సమస్యలు తెలుసుకొని.. వాటి పరిష్కారం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమాలకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లోని ఎస్సీ, ఎస్టీ కాలనీలను పార్టీ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ప్రజలు ఆయా ప్రాంతంలోని సమస్యలను పార్టీ నేతల ముందు ఏకరువు పెట్టారు. రాష్ట్రంలోని తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయడం లేదని, సంక్షేమ పథకాలు కూడా సక్రమంగా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు ఆయా ప్రాంత ప్రజలకు తామున్నామంటూ భరోసా ఇచ్చారు
♦ఎచ్చెర్ల నియోజకవర్గానికి సంబంధించి రచ్చబండ, పల్లెనింద్ర కార్యక్రమాలు రణస్థలం మండలం బంటుపల్లి గ్రామంలో సమన్వయకర్త గొర్లె కిరణ్‌కుమార్‌నిర్వహించారు. ప్రజల సమస్యలు తెలుసుకొని, దళితవాడలో రాత్రి నిద్రించారు. రణస్థలం జెడ్పీటీసీ సభ్యుడు గొర్లె రాజగోపాల్ పాల్గొన్నారు.
♦ నరసన్నపేట మండలం నడగాం గ్రామంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ధర్మాన కృష్ణదాస్ ఆధ్వర్యంలో రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమం జరిగింది. రచ్చబండ కార్యక్రమంలో గ్రామస్తుల సమస్యలు తెలుసుకొని వైఎస్ జగన్ పాదయాత్రలో ఇస్తున్న హామీలను రైతులకు వివరించారు. ఎస్సీ కాలనీలో పల్లెనిద్ర నిర్వహించారు.
♦టెక్కలి నియోజకవర్గం నందిగాం మండలం సవరనీలాపురం గ్రామంలో నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ ఆధ్వర్యంలో రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమం జరిగింది.
♦ ఇచ్ఛాపురం మండలం డొంకూరు మత్స్యకార గ్రామంలో నియోజకవర్గ సమన్వయకర్త నర్తు రామారావు పార్టీ జెండాను ఆవిష్కరించారు. గ్రామంలో పాదయాత్ర చేసి రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడారు. అక్కడి నుంచి బైక్‌లపై సన్యాసిపుట్టుగ దళితవాడకు చేరుకున్నారు.
♦ రాజాం నియోజకవర్గం పరిధి రేగిడి మండలం సంకిలి గ్రామంలో ఎమ్మెల్యే కంబాల జోగులు రచ్చబండ,కార్యక్రమం నిర్వహించారు. పల్లెనిద్ర చేశారు. ఈ సందర్భంగా జోగులు మాట్లాడుతూ రచ్చబండ అనేది మహత్తర కార్యక్రమమని, ప్రజల కష్టసుఖాలు తెలుసుకునేందుకు ఉపయోగపడుతుందన్నారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రచ్చబండ కార్యక్రమానికి ఎందుకు శ్రీకారం చుట్టారో ఇప్పుడు తెలుస్తుందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకునేందుకు వీలుంటుందనన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి పాలవలస విక్రాంత్ పాల్గొన్నారు.
♦ పాలకొండ నియోజకవర్గం పరిధి సీతంపేట మండలం కడగండి పంచాయతీ రోలుగుడ్డి గ్రామంలో సర్పంచ్ ఎస్.రాము అధ్యక్షతన జరిగిన రచ్చబండ కార్యక్రమంలో ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి పాల్గొన్నారు. గిరిజన సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రానున్న రోజుల్లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే ప్రజలకు అందే సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. అనంతరం పలు గిరిజన గ్రామాల్లో పాదయాత్ర నిర్వహించారు. రాత్రి పంచాయతీ కేంద్రం కడగండిలో పల్లెనిద్ర చేశారు. ఈమె వెంట పార్టీ మండల కన్వీనర్ జి. సుమిత్రరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment