‘వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ‘రావాలి జగన్.. కావాలి జగన్’ అనే నినాదంతో ఈ నెల 17వ తేదీ నుంచి పోలింగ్ బూత్ స్థాయిలో గడపగడపకు వెళ్లబోతున్నాం. బూత్ కమిటీ సభ్యులతో కలిసి సమన్వయకర్తలు ప్రతి గడపకూ వెళ్లి.. ప్రతి ఒక్కర్ని స్వయంగా కలుసుకుని కేంద్రంలో, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను తెలియజేస్తారు. పార్టీ అధికారంలోకి వస్తే చేపట్టబోయే నవరత్నాలతో పాటు టీడీపీ ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తాం’ అని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వెల్లడించారు. స్థానిక బీచ్ రోడ్‌లోని విశాఖ ఫంక్షన్ హాలులో మంగళవారం జరిగిన వైఎస్సార్‌సీపీ రాష్ట్రస్థాయి సమన్వయకర్తల సమావేశం వివరాలను ధర్మాన మీడియాకు వివరించారు. పార్లమెంటు, అసెంబ్లీకి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో భవిష్యత్ కార్యాచరణపై తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ సమావేశంలో దిశానిర్దేశం చేశారని చెప్పారు. రానున్న నాలుగైదు నెలలు చాలా కీలకమైనందున.. వాటికి సన్నద్ధమయ్యేలా కార్యక్రమాలు రూపకల్పన చేశారని చెప్పారు.