బీఎస్పీ నేత మాయావతిపై... మొరటు వాఖ్యలు చేసి మహిళా లోకాన్నే అవమానపర్చిన బీజేపీ ఎంపీ దయాశంకర్‌సింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక దళిత సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు మాసాయిపేట మల్లేశం, దళిత బహూజన ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుబాషి సంజీవ్, అంబేద్కర్ సంఘం మండలశాఖ ప్రధాన కార్యదర్శి పద్మారావు, మండల ఉపాధ్యక్షులు బైరం సిద్దరాంలు, టంకరిరాజు గురువారం స్థానిక విలేకరులతో మాట్లాడారు.
ఈవిషయమై బీజేపీ సదరు ఎంపీని అనర్హుడిగా ప్రక టించడంతోపాటు అతనిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. అన్నిపార్టీలు ఈసంఘటను ఖండించడంతోపాటు భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పుననావతం కాకుండా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. దళితులపట్ల బీజేపీ వైఖరి ఈసంఘటతో బయట పడిందని వారు పేర్కొన్నారు. ఈవిషయంలో దళితుల మనోబావాలు దెబ్బతినకముందే చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.