మంత్రి పదవిపై ఆశలు పెంచుకుని బలమైన లాబీయింగ్ సాగించిన సొంత సామాజికవర్గ నేతలకు సీఎం చంద్రబాబునాయుడు గట్టిగా షాక్ ఇచ్చారు. వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబుకు అమాత్య యోగం దక్కి ఆదివారం ప్రమాణ స్వీకారం చేయగా మిగిలిన ముఖ్యనేతలు కొందరు పదవి ఆశించి భంగపడ్డారు. ఈ క్రమంలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు రంగంలో దిగి బుజ్జగింపుల పర్వం కొనసాగించినట్లు సమాచారం. ‘ఆనంద’మానందమాయే..