‘హింసకు తావులేని కోళ్ల పందాలు జరగాలి’ | Raghu Rama Krishna Raju speech In West Godavari | Sakshi
Sakshi News home page

‘హింసకు తావులేని కోళ్ల పందాలు జరగాలి’

Published Tue, Dec 24 2019 3:17 PM | Last Updated on Tue, Dec 24 2019 3:18 PM

Raghu Rama Krishna Raju speech In West Godavari - Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి: జూదానికి, హింసకు తావులేని కోళ్లపందాలు సంక్రాంతి పండగలో జరగాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు. సంక్రాంతి పండగలో కోళ్ల పందాల సాంప్రదయం గురించి ఆయన మీడియాతో మాట్లాడారు. గోదావరి జిల్లాలు సంక్రాంతి పండగ సాంప్రదాయలకు ప్రతీక అని ఆయన గుర్తు చేశారు. అమరావతి రైతులకు ప్రభుత్వం న్యాయం చేస్తుందని ఆయన తెలిపారు. అమరావతి అభివృద్ధి ఏమాత్రం తగ్గదని ఎంపీ రఘురామ కృష్ణంరాజు స్పష్టం చేశారు. అన్ని ప్రాంతాల అభివృద్ధిలో భాగంగానే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన గుర్తు చేశారు. విశాఖపట్నం రాజధానితో ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఎంపీ రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement