
సాక్షి, చిత్తూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యలపై చిత్తూరు జిల్లా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తలు ఎంపీ రఘురామ కృష్ణంరాజు దిష్టి బొమ్మను పీలేరులో దహనం చేశారు. మచ్చ లేని నాయకుడు ఎంపీ మిథున్ రెడ్డి అని, అటువంటి నేతపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదని స్పష్టం చేశారు. రఘురామ కృష్ణంరాజు ఖబర్దార్ అంటూ నినాదాలు చేశారు.
(చదవండి: వలంటీరుతో ఓడిస్తాం.. దమ్ముంటే రాజీనామా చెయ్యండి )
Comments
Please login to add a commentAdd a comment