Piler
-
టీడీపీ, జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, అన్నమయ్య జిల్లా: టీడీపీ, జనసేన మేనిఫెస్టోపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు హామీలన్నీ మోసమేనని బీజేపీ వైఖరితో అర్థమైందన్నారు. టీడీపీ, జనసేన మేనిఫెస్టోలో తమ ఫోటో వద్దని బీజేపీ గట్టిగా చెప్పిందని పేర్కొన్నారు. బాబు డిక్లేర్ చేసిన మేనిఫెస్టోలో మోదీ ఫోటో పెట్టొద్దని బీజేపీ తేల్చేసిందన్నారు. ముగ్గురు కూటమిలో ఉండి ముగ్గురు ఫోటోలను మేనిఫెస్టోలో పెట్టుకునే పరిస్థితి చంద్రబాబుకు లేదని ఎద్దేవా చేశారు.అవ్వాతాతలకు ఇంటివద్దకే అందే పెన్షన్‌ను ఆపిన దుర్మార్గుడు చంద్రబాబని ధ్వజమెత్తారు. మీ బిడ్డకు(జగన్) మంచి పేరు వస్తుందనే బాబు పెన్షన్లను అడ్డుకున్నాడని మండిపడ్డారు. తన మనిషిని నిమ్మగడ్డతో ఫిర్యాదు చేయించి పనెన్షన్‌ను అడ్డుకున్నాడని.. ప్రజల్లో వ్యతిరేకత రావడంతో తన కుట్రలను మనపై నెడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ పూర్తి ప్రసంగంఈ ఎన్నికలు.. రాబోయే అయిదేళ్ల భవిష్యత్.జగన్‌కు ఓటేస్తే..పథకాలు కొనసాగింపు.చంద్రబాబుకు ఓటేస్తే పథకాలు ముగింపే.పొరపాటున బాబుకు ఓటేస్తే..పసుపుపతి నిద్రలేస్తాడు.వదల బొమ్మాళి అంటూ పేదల రక్తం తాగుతాడు..బాబును నమ్మడమంటే కొండచిలువ నోట్లో తలపెట్టడమే.2014లో చంద్రబాబు చేసిన మోసాలు గుర్తున్నాయా?.రైతు రుణమాఫీ చేస్తానన్నాడు.. చేశాడా?రూ. 87,612 కోట్ల రుణాలు మాఫీ చేస్తానన్నాడు.. చేశాడా?పెట్టుబడి సాయం కింద బాబు ఏనాడు ఒక్క రూపాయి ఇవ్వలేదు.బాబు ఏనాడైనా రైతుభరోసా కింద ఒక్క రూపాయి అయినా ఇచ్చాడా.14 ఏళ్లలో బాబు ఏనాడు రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వలేదు.డ్వాక్రా రుణాలు రద్దు చేస్తానన్నాడు..చేశాడా?.రైతు రుణమాఫీ చేస్తానన్నాడు.. చేశాడా?అక్కాచెల్లెమ్మలను మోసం చేసి రోడ్డుపై నిలబెట్టాడుఆడబిడ్డ పుడితే రూ. 25 వేలు డిపాజిట్ చేస్తానన్నాడు.. చేశాడా?గర్భిణీ స్త్రీలకు రూ. 10 వేలు ఇస్తానన్నాడు.. ఇచ్చాడా?గ్యాస్ సిలిండర్‌పై రూ. 100 సబ్సిడీ ఇస్తానన్నాడు.. ఇచ్చాడా?బ్యాంకుల్లో పెట్టిన బంగారాన్ని విడిపిస్తానన్నాడు.. విడిపించాడా?ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తానన్నాడు.. చేశాడా?మీ బిడ్డ జగన్ రైతన్నకు అండగా నిలబడ్డాడు.పెట్టుబడి సాయం కింద మీ బిడ్డ ప్రతియేటా రూ. 13, 500 ఇచ్చాడు.జగన్‌కు, చంద్రబాబుకు ఉన్న తేడా గమనించండని కోరుతున్నా.అక్కా చెల్లెమ్మలకు మీ బిడ్డ జగన్ తోడుగా ఉన్నాడుఅక్కాచెల్లెమ్మల కోసం మేనిఫెస్టోలోని ప్రతి హామీని నెరవేర్చా.అక్కాచెల్లెమ్మల కోసం ఆసరా, సున్నా వడ్డీ, చేయూతతో ఆదుకున్నాం.అక్కాచెల్లెమ్మల కోసం కాపు నేస్తం, ఆబీసీ నేస్తం తీసుకొచ్చా.31 లక్షల ఇళ్లపట్టాలు అక్కా చెల్లెమ్మల పేరుపై రిజిస్ట్రేషన్.ఇంటి వద్దకే అవ్వాతాతలకు పెన్షన్ అందిస్తున్నాం.పెన్షన్ రూ. 3 వేల నుంచి రూ, ,500లకు పెంచుకుంటూ పోతాం.14 ఏళ్లలో చంద్రబాబు ఏనాడైనా పెన్షనర్లను పట్టించుకున్నాడా? చంద్రబాబు మోసాలను ఓడించడానికి మీరంతా సిద్ధమేనా.రైతుభరోసాగా ఏడాదికి రూ.16 వేలు.. ఐదేళ్లకు రూ.80 వేలు ఇస్తాడు మీ జగన్.చంద్రబాబు వల్ల రాష్ట్రంలోని మహిళలందరికీ కొన్ని రూ.వేల కోట్ల నష్టం జరిగింది. పిల్లలను బడులకు పంపే తల్లులకు ఇచ్చే అమ్మఒడిని రూ.17 వేలుకు పెంచాం. చంద్రబాబు ఈరోజు విడుదల చేసిన మేనిఫెస్టోలో అలవిగాని హామీలను చూసిన బీజేపీ.. నీ ఫోటో పెట్టుకోగానీ మోడీ గారి ఫొటో మాత్రం పెట్టుకోవద్దని తేల్చి చెప్పేసింది. ముగ్గురున్న కూటమిలో కనీసం ఆ ముగ్గురి ఫొటోలు కూడా మేనిఫెస్టోలో పెట్టుకోలేని స్థితిలో చంద్రబాబు ఉన్నాడు. వచ్చే ఎన్నికల్లో మన… pic.twitter.com/SrcrNnBYWQ— YS Jagan Mohan Reddy (@ysjagan) April 30, 2024 -
చిత్తూరు జిల్లాలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కలకలం
సాక్షి, చిత్తూరు: జిల్లాలోని పీలేరులో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు టీడీపీలో కలకలం సృష్టిస్తున్నాయి. పార్టీ అధికారంలోకి రావాలంటే జూనియర్ ఎన్టీఆర్ రావాలంటూ ప్లెక్సీలు వెలిశాయి. పీలేరు పలు ప్రాంతాల్లో ఈ రోజు ఉదయం వరకు ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. అయితే టీడీపీ శ్రేణులు ఫ్లెక్సీలు తొలగించాయి. సోమవారం నుంచి లోకేష్ పాదయాత్ర జరగనున్న నేపథ్యంలో ఈ ఫ్లెక్సీలు టీడీపీ శ్రేణుల్లో దడ పుట్టిస్తున్నాయి. చదవండి: చినబాబుకు షాక్.. అనుకున్నదొకటి.. అయ్యింది మరొకటి.. -
భర్తను వదిలి ప్రియుడితో మూడేళ్లు సహజీవనం.. ఆ క్రమంలోనే..
పీలేరు రూరల్ : ప్రియుడి వేధింపులతో సహజీవనం చేస్తున్న మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం పీలేరులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలావున్నాయి. తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేటకు చెందిన వెంకటముని కుమార్తె పొన్ను నిరోషా (28)కు పదేళ్ల క్రితం దేవరకొండ పంచాయతీ మైలవాండ్లపల్లెకు మంజునాథ్‌తో వివాహమై ఒక కుమారుడు ఉన్నాడు. అయితే మూడేళ్ల క్రితం పీలేరు పట్టణం రాఘవేంద్రనగర్‌కు చెందిన యుగంధర్ ఆచారితో నిరోషాకు వివాహేతర సంబంధం ఏర్పడింది. నిరోషా భర్తతో గొడవ పడి యుగంధర్ ఆచారి వద్దకు చేరుకుంది. మూడేళ్లుగా సహజీవనం సాగిస్తోంది. కొంతకాలంగా యుగంధర్ఆచారి వేధింపులతో జీవితంపై విరక్తి చెందిన నిరోషా శుక్రవారం ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన యుగంధర్ ఆచారి ఆయన భార్య భవ్య హుటాహుటిన నిరోషాను కిందకు దింపి చికిత్స నిమిత్తం పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. నిరోషా తండ్రి వెంకటముని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తిప్పేస్వామి తెలిపారు. చదవండి: (రూ.2లక్షల అప్పు.. భర్త స్నేహితుడితో వివాహేతర సంబంధం..) -
గంజాయి స్వాధీనం.. ఒకరి అరెస్ట్
పీలేరు : నాలుగు కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని, ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. సీఐ ఎన్. మోహన్‌రెడ్డి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సీఐకు అందిన సమాచారం మేరకు పోలీస్ సిబ్బందితో కలిసి శుక్రవారం స్థానిక రైల్వేస్టేషన్ వద్ద దాడి చేశారు. మదనపల్లెకు చెందిన సయ్యద్ సుల్తాన్ (28) గంజాయి కలిగి ఉండగా అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి నాలుగు కేజీల గంజాయితోపాటు ఒక ఫోన్, రూ. 400 స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని విచారణ చేయగా పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. చెడు వ్యసనాలకు బానిసై అక్రమంగా డబ్బు సంపాదించాలని పలువురితో కలిసి గంజాయి అక్రమ వ్యాపారం చేస్తున్నాడు. విశాఖపట్నం వెళ్లి అక్కడ పాడేరుకు చెందిన ఏ–3 నిందితుడు మహేష్ వద్ద గంజాయి కొనుగోలు చేసి రైలులో అక్రమ రవాణా చేసి మదనపల్లెకు తీసుకుని వచ్చే వాడు. చిన్న పొట్లాలుగా కట్టి విక్రయించే వాడు. అలాగే బెంగళూరుకు చెందిన ఏ–2 నిందితుడు ఖాజాకు గంజాయి పెద్దమొత్తంలో సరఫరా చేసే వాడు. సయ్యద్ సుల్తాన్‌పై మదనపల్లె–1 టౌన్, అలిపిరి, కర్ణాటక రాయపూర్ పోలీస్ స్టేషన్లలో దోపిడీ, హత్యాయత్నం, హత్య లాంటి నేరారోపణలపై కేసులు ఉన్నాయి. మదనపల్లె–1 టౌన్ పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీట్ కేసు ఉంది. బెంగళూరుకు చెందిన ఖాజా, పాడేరులోని మహేష్‌ను అరెస్ట్ చేయాల్సి ఉందని సీఐ తెలిపారు. -
తిరుపతి–పీలేరు రహదారికి మహర్దశ.. వెయ్యి కోట్లతో..
చంద్రగిరి: జాతీయ రహదారికి మహర్దశ పట్టనుంది. నిత్యం ప్రమాదాలతో నెత్తరోడుతున్న రోడ్డును విస్తరించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. భాకరాపేట కనుమలో ఇక సాఫీగా ప్రయాణం చేసే అవకాశం దక్కబోతోంది. తిరుపతి–పీలేరు జాతీయ రహదారిని నాలుగులేన్ల రహదారిగా విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. తిరుపతి–పీలేరు జాతీయ రహదారి రెండులేన్ల రహదారి కావడంతో నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల భాకరాపేట కనుమలో చోటుచేసుకున్న ప్రమాదంలో పదుల సంఖ్యలో ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఈ మార్గాన్ని నాలుగులేన్ల రహదారిగా తీర్చిదిద్దాలని సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సంకల్పించారు. ఈమేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో మార్చి 30న రోడ్ సేఫ్టీ అడిషనల్ డీజీపీ కృపానంద త్రిపాఠి ఉజేల ప్రమాద స్థలాన్ని పరిశీలించి, నాలుగు లేన్ల రహదారి ఏర్పాటుపై అధికారులతో సమీక్షించారు. చదవండి: ('నాగబాబు అలా చెప్పడం.. చిరంజీవిని అవమానించడమే') సుమారు రూ.వెయ్యికోట్లు మంజూరు భాకరాపేట బస్సు రోడ్డు ప్రమాద అనంతరం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో కేంద్ర ప్రభుత్వం తిరుపతి–పీలేరు జాతీయ రహదారిని నాలుగు లేన్ల రహదారిగా విస్తరించడానికి పచ్చజెండా ఊపింది. సుమారు రూ.వెయ్యికోట్ల వ్యయంతో పనులను ప్రారంభించేలా ప్రణాళిక సిద్ధం చేసింది. ఇప్పటికే టోపో సర్వేను పూర్తి చేసింది. ఇందులో భాగంగా మండల పరిధిలోని వెంకట పద్మావతి ఇన్స్టిట్యూట్ సమీపంలో నేషనల్ హైవే అథారిటీ (ఎన్హెచ్ఏ) డిజైన్ కన్సల్టెంట్ అధికారులు ట్రాఫిక్ సర్వేను నిర్వహిస్తున్నారు. రోజుకు ఎన్ని వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. అందులో హెవీ వెహికల్స్ ఎన్ని, బస్సులు, కార్లు, ద్విచక్ర వాహనాలు ఇతరత్రా వాహనాల రాకపోకలపై సర్వే నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వారం రోజుల పాటు ఈ సర్వే ఉంటుందన్నారు. సర్వే పూర్తి చేసిన తర్వాత నాలుగు లేన్ల రోడ్డు వెడల్పు, డిజైన్ రూపొందించనున్నట్లు వివరించారు. మరో మూడు నెలల్లో పనులు ప్రారంభించనున్నట్లు వారు తెలిపారు. జాతీయ రహదారి పనులు పూర్తయితే భాకరాపేట కనుమ ప్రమాదాలకు చెక్ పడుతుంది. -
పీలేరులో ఎన్డీఆర్ఫ్ రెస్క్యూ ఆపరేషన్ విజయవంతం
-
రఘురామ కృష్ణంరాజు దిష్టిబొమ్మ దగ్ధం
సాక్షి, చిత్తూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యలపై చిత్తూరు జిల్లా వైఎస్సార్సీపీ కార్యకర్తలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తలు ఎంపీ రఘురామ కృష్ణంరాజు దిష్టి బొమ్మను పీలేరులో దహనం చేశారు. మచ్చ లేని నాయకుడు ఎంపీ మిథున్ రెడ్డి అని, అటువంటి నేతపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదని స్పష్టం చేశారు. రఘురామ కృష్ణంరాజు ఖబర్దార్ అంటూ నినాదాలు చేశారు. (చదవండి: వలంటీరుతో ఓడిస్తాం.. దమ్ముంటే రాజీనామా చెయ్యండి ) -
పీలేరులో తల్లీబిడ్డ అదృశ్యం
పీలేరు: బిడ్డతో సహా తల్లి అదృశ్యమైన ఘటన పీలేరులో సోమవారం చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పీలేరు యల్లమంద క్రాస్‌కు చెందిన గురునాథ్, శివరాణి దంపతులకు రుషికేశ్వర్(2) కుమారుడు ఉన్నాడు. ఆ చిన్నారికి ఆరోగ్యం సరిగా లేదని శివరాణి శనివారం ఉదయం 8 గంటలకు ఆస్పత్రికి తీసుకెళ్లింది. 10 గంటలవుతున్నా ఇంటికి రాకపోవడంతో గురునాథ్ భార్యకు ఫోన్ చేశాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో చుట్టుపక్కల, బంధువుల ఇళ్లలో విచారించాడు. ఫలితం లేకపోవడంతో సోమవారం పీలేరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
నగరిలో ఓటర్లకు టీడీపీ ప్రలోభాలు
చిత్తూరు: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో భారీగా మొత్తంలో నగదు, మద్యం పట్టుబడుతున్నాయి. ప్రలోభాల పర్వానికి తెలుగుదేశం పార్టీ తెరలేపింది. సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు మరికొన్ని గంటలు మాత్రమే సమయం ఉండడంతో ఓట్ల కొనుగోలుకు సర్వశక్తులు వినియోగిస్తోంది. జిల్లాలో కీలకమైన కుప్పం, చంద్రగిరి, తిరుపతి, చిత్తూరు, శ్రీకాళహస్తి, నగరి, తంబళ్లపల్లె, పీలేరు నియోజకవర్గాల్లో నుంచి పెద్ద మొత్తాల్లో డబ్బు పంపకాలతో పాటు మద్యాన్ని ఏరులై పారిస్తోంది. అప్పలాయగుంట వద్ద 102 కేసుల మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ముగ్గురిని అరెస్ట్ చేసి, వాహనాన్ని సీజ్ చేశారు. -
మహబూబ్‌నగర్ జిల్లాలో రోడ్డుప్రమాదం
మహబూబ్‌నగర్ క్రైం,న్యూస్‌లైన్: అతివేగం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. ముందు వెళ్తున్న లారీని కారు ఓవర్టేక్ చేయబోయబోవడంతో ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణిస్తున్న ఓ 12 ఏళ్ల బాలిక మృతి చెందింది. మరో ముగ్గురు గాయపడ్డాడు. ఈ ఘటన మహబూ బ్‌నగర్ జిల్లాలో ఆదివారం చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లాలోని పీలేరుకు చెందిన విశ్వనాథ్‌రెడ్డి తన భార్య గీత, కూతుళ్లు హన్సిక (12), నాలుగేళ్ల సోనికతో కారులో ఆదివారం ఉదయం హైదరాబాద్‌కు బయల్దేరారు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో జాతీయ రహదారిపై ఉన్న దివిటిపల్లి స్టేజీ సమీపంలో విశ్వనాథ్‌రెడ్డి తన కారును ఓవర్టేక్ చేయబోయి ముందుగా వెళ్తున్న లారీను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో హన్సిక అక్కడికక్కడే మృతి చెందింది. మిగతా ముగ్గురికి గాయాలయ్యా యి. గమనించిన స్థానికులు 108 అంబులెన్స్‌లో వారిని ఎస్వీఎస్ ఆస్పత్రికి తరలిం చా రు. ఈ మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ లక్ష్మీనారాయణ తెలిపారు. -
మీకు కొంచెమైనా సిగ్గుందా ?: వైఎస్ జగన్
* సీఎం కిరణ్, ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వైఎస్ జగన్ ధ్వజం * కేంద్రం అడ్డగోలుగా విభజన నిర్ణయం తీసుకుని రాష్ట్రానికి బిల్లు పంపింది * ఆ బిల్లు మాకొద్దని వెనక్కి పంపాల్సిన కిరణ్, బాబు నిస్సిగ్గుగా బిల్లుపై చర్చ జరిపిస్తున్నారు * బిల్లుపై చర్చ జరిగితే విభజనకు ఒప్పుకున్నట్టే * కిరణ్, బాబులతో మాట్లాడి గులాంనబీ ఆజాద్ బిల్లుపై చర్చ జరిగేలా చేస్తున్నారు * ఓటింగ్ కోసం పట్టుబట్టిన వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేశారు ‘సమైక్య శంఖారావం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజిస్తూ నిర్ణయం తీసుకొని ఆ బిల్లు మనకు పంపించారు. ఈ బిల్లు మాకు వద్దు అని చెప్పి వెనక్కి పంపించాల్సిన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నిస్సిగ్గుగా బిల్లు మీద ఇవాళ చర్చ జరిపిస్తున్నారు. బిల్లు మీద చర్చ జరిగితే విభజన చేయడానికి కేంద్రానికి అనుమతిచ్చినట్టే అవుతుంది.. అందుకోసమే చర్చ జరగనే వద్దని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా పట్టుపడుతోంది. కానీ కాంగ్రెస్ పార్టీ, చంద్రబాబు నాయుడు కుమ్మక్కై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదే తప్పని వేలెత్తి చూపించే సిగ్గుమాలిన పనికి ప్రయత్నిస్తున్నారు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించారు. తాపీగా విభజన కార్యక్రమం పూర్తి చేసేందుకే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారని అన్నారు. ఈ గడ్డ మీద పుట్టిన ఈ ముఖ్యమంత్రికి, ప్రతిపక్ష నాయకుడికి ఇంతకంటే సిగ్గు ఏమైనా ఉందా? అని నిలదీశారు. ‘‘బీహార్‌లో కూడా ఇటువంటి పరిస్థితి ఎదురైనపుడు అక్కడి ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ గట్టిగా నిలబడి ఎదుర్కొన్నారు. మీరెవరు మా రాష్ట్రాన్ని విడగొట్టడానికి? ఆ అధికారం మీకు ఎవరిచ్చారు? అని ఆ బిల్లును లాలూ ప్రసాద్ యాదవ్ వెనక్కి పంపించారు. మళ్లీ లాలూను ఒప్పించిన తరువాతే బీహార్‌ను విడగొట్టారు. మన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆ పని ఎందుకు చేయలేకపోతున్నారు?’’ అని ప్రశ్నించారు. ఓట్ల కోసం, సీట్ల కోసం రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించటాన్ని నిరసిస్తూ జగన్మోహన్రెడ్డి కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా తలపెట్టిన ‘సమైక్య శంఖారావం’ యాత్ర చిత్తూరు జిల్లాలో మూడో విడత, ఐదో రోజు గురువారం ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పీలేరులోను,చంద్రగిరి, పుంగనూరు నియోజకవర్గాల్లోనూ కొనసాగింది. సదుం, కల్లూరుల్లో వైఎస్ విగ్రహాలను ఆవిష్కరించారు. సదుం మండల కేంద్రం, పీలేరు నియోజకవర్గ కేంద్రం, కల్లూరు, మాదలచెరువు గ్రామాల్లో జరిగిన బహిరంగ సభలకు పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి జగన్ ప్రసంగించారు. ఈ ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే.. చర్చ అంటూ పట్టపగలు ప్రజల్ని మోసం చేస్తున్నారు ‘‘ఈ రోజు టీవీ ఆన్ చేస్తే మనకు అసెంబ్లీ సమావేశాలే కనిపిస్తున్నాయి. కానీ వాటిలో చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డి మాత్రం కనపడరు. ఇద్దరూ మోసగాళ్లే. ఇవాళ అసెంబ్లీ జరుగుతున్న తీరు చూస్తుంటే దేశ చరిత్రలో ఇంత అన్యాయం ఎక్కడా జరగలేదేమో అనిపిస్తోంది. ఏ రాష్ట్రాన్నైనా విభజించాలని అనుకుంటే మొదట ఆ శాసన సభలో తీర్మానం చేయాలి. శాసన సభ్యులంతా అనుకూలమే అని చెబితే తప్ప విభజించడానికి వీలు లేదు. ఇవాళ రాష్ట్రంలో 70 శాతం మంది ప్రజలు సమైక్యాన్ని కోరుకుంటున్నారు. శాసన సభలో మెజార్టీ ఎమ్మెల్యేలు రాష్ట్రాన్ని విడగొట్టొద్దని చెప్తున్నారు. కానీ యూపీఏ ప్రభుత్వం మాత్రం ఎటువంటి తీర్మానం లేకుండా బిల్లును అసెంబ్లీకి పంపి ఇక విభజన అయిపోయింది, చర్చించుకోండి అని చెప్తోంది. ఇటువంటి అన్యాయం ఎక్కడైనా ఉందా? బిల్లు మీద చర్చ పెట్టి, పట్టపగలు రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారు. సమైక్యాంధ్ర కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరాహార దీక్షలు చేసింది. పార్టీ మొత్తం ఒక్కతాటి మీద నిలబడి, రాష్ట్రపతి దగ్గరకు వెళ్లి అఫిడవిట్లు ఇచ్చి సమైక్యాంధ్ర కోసం నిలబడింది. చర్చ జరిగితే విభజనకు ఒప్పుకున్నట్టే అని, చర్చ కాదు ఓటింగ్ జరపండి అని పట్టుబట్టిన వైఎస్సార్ సీపీ శాసన సభ్యులను ప్రభుత్వం ఈ రోజు శాసనసభ నుంచి సస్పెండ్ చేయించింది. ఇవాళ పేపర్లో చదివా.. కేంద్ర మంత్రి గులాంనబీ ఆజాద్ మన రాష్ట్రానికి వచ్చారట. చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డితో మాట్లాడి వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయించి చర్చ సాగిస్తున్నారట. నిజంగా మీరు చేస్తున్న దిక్కుమాలిన రాజకీయాలు, రాక్షస పాలన అంతమయ్యే రోజులు త్వరలోనే వస్తాయి. విభజన కోసం చర్చ ఎందుకు? రాష్ట్రాన్ని విభజించడానికి మీరు అసెంబ్లీలో చర్చ ప్రారంభించారు. విభజన కోసం చర్చ ఎందుకు అని అడుగుతున్నా. ఒక్కరోజు శాసన సభ్యులందరినీ అసెంబ్లీకి పిలవండి, పిలిచి ఈ రాష్ట్ర విభజనకు మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరా అని అడగండి. వాళ్లు చెప్పిన దాన్నే తీర్మానంగా చేయండి. అది చేస్తే సరిపోదా? అని అడుగుతున్నా. ఆ కార్యక్రమం చేయాలంటే మీకు మనసు రాదు. ఒక్కసారి ప్రజల వద్దకు రండి, ఆ ప్రజలను అడగండి. వాళ్లు ఏం చెప్తే అది చేయండి. నేను దారి వెంట వస్తూ చాలా మంది ప్రజలను అడిగా.. పీలేరు నియోజకవర్గ ప్రజలను కూడా అడిగా! ‘గ్యాస్ సబ్సిడీ ఇంత వరకు అందలేదన్నా.. రూ.1,300 పెట్టి గ్యాస్ కొనుక్కుంటున్నాం’ అని చాలామంది అక్కా చెల్లెమ్మలు చెప్పారు. వ్యవసాయానికి ఎన్నిగంటలు కరెంటు ఇస్తున్నారని రైతన్నలను అడిగితే.. 3-4 గంటలకు మించి ఇవ్వలేదన్నారు. పీలేరులో తాగటానికి నీళ్లు లేవని అక్కాచెల్లెమ్మలు చెప్తున్నా రు, బిందెడు నీళ్లు రూ.3 నుంచి రూ. 5 పెట్టి కొనుక్కుంటున్నాం అని చెప్తున్నారు. ఈ సమస్యల మీద చర్చించకుండా రాష్ట్రాన్ని ఎలా విభజించాలని చర్చిస్తారట. కిరణ్.. ఎవరు ఆపుతున్నారు మిమ్మల్ని? అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరు చూస్తే గుండె తరుక్కుపోతోంది. ఎప్పుడో జూలై 30న సీడబ్ల్యూసీ మీటింగ్‌లో సోనియాగాంధీ రాష్ట్రాన్ని విభజిస్తామని చెప్పారు. కిరణ్‌కుమార్‌రెడ్డిని నేను అడుగుతున్నా. ఎవరు ఆపుతున్నారయ్యా నిన్ను? ముఖ్యమంత్రి హోదాలో వెంటనే అసెంబ్లీని సమావేశపరిచి విభజనకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని చెప్పి మేం అంతా కోరినా కూడా మీరు ఎందుకు తీర్మానం చేయలేదు? అంతెందుకు కనీసం ఇప్పుడైనా తీర్మానం చేయండి అంటే వెనకడుగు వేస్తున్నారు. సోనియా గాంధీ ప్రత్యేక విమానంలో బిల్లును పంపించారు. ఆ బిల్లు డ్రాఫ్టు అందిన 17 గంటలలోపే సంతకం చేసి దాన్ని అసెంబ్లీకి ఎందుకు పంపించారు? రాష్ట్రమంతటా సమైక్య ఉద్యమాలు జరుగుతున్నాయి. ఉద్యోగస్తులు దీక్షలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు. అటువంటి ఉద్యోగులను ఎందుకు కిరణ్‌కుమార్‌రెడ్డి భయపెట్టి దీక్షలు, ధర్నాలను విరమింపజేశారు? సోనియా గాంధీ విభజన చేయాలని చెప్తుంటే ముఖ్యమంత్రిగా నువ్వు మీ అధికారులకు చెప్పి ప్రతి అడుగులోనూ ఎందుకు సహకారం అందిస్తున్నావు?’’ జగన్ వెంట యాత్రలో పాల్గొన్న వారిలో జిల్లా పార్టీ కన్వీనర్ నారాయణస్వామి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, అమర్నాథ్రెడ్డి, పార్టీ నాయకులు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, రోజా, డాక్టర్ సునీల్‌కుమార్ తదితరులు ఉన్నారు. సమైక్యం కోసం మీరు ఏం చేశారు? ‘‘రాష్ట్రాన్ని విడగొట్టడానికిగాను బిల్లుపై చర్చ జరిపించేందుకు ఉత్సాహం చూపిస్తున్న నాయకులందరినీ నేను అడగదలుచుకున్నా. ఈ రాష్ట్రాన్ని విడగొట్టకూడదని ఏ రోజైనా మీరు నిరాహార దీక్షలు చేశారా? రాష్ట్రాన్ని విడగొట్టవద్దని ఎప్పుడైనా రాష్ట్రపతి వద్దకు వెళ్లి అఫిడవిట్లు ఇచ్చారా? రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలి అని కనీసం ఒక్క లేఖైనా ఇచ్చారా? అని అడుగుతున్నా. ఏ ఒక్కటీ కూడా వీళ్లు చేయలేదు. వీళ్లు చేస్తున్నదంతా ముసుగులో దొంగాట. వీళ్లంతా కుమ్మక్కై ఈ రాష్ట్రాన్ని విడగొట్టడానికి సిద్ధమయ్యారు. మీరు చేస్తున్న మోసాలను పై నుంచి దేవుడు చూస్తున్నాడు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరం ఒక్కటవుతాం. ఒక్కటైనప్పుడు ఉప్పెన లేస్తుంది. రాష్ట్రాన్ని విభజించాలని ఉబలాటపడుతున్న సోనియాగాంధీ, ఆమె గీచిన గీత దాటకుండా ప్రజలను మోసం చేస్తున్న కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్యాకేజీలు అడుగుతున్న చంద్రబాబు.. వీళ్లంతా ఆ ఉప్పెనలో కొట్టుకుపోతారు. వీళ్లంతా ఎన్ని కుట్రలు పన్నినా.. మరో నాలుగు నెలల్లో ఎన్నికలు వస్తాయి. ఆ ఎన్నికలు ఢిల్లీ అహంకారానికి, తెలుగువారి ఆత్మగౌరవానికి మధ్య జరుగుతాయి. వాటిలో మనందరం ఒక్కటవుదాం. ఒక్కటై 30 ఎంపీ స్థానాలను మనంతట మనమే తెచ్చుకుందాం. ఎవరైతే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతారో వారినే ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెడదాం.’’ -
తెలుగువారిని అడ్డగోలుగా విడగొడతారా?: వైఎస్ జగన్