మహబూబ్‌నగర్ క్రైం,న్యూస్‌లైన్: అతివేగం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. ముందు వెళ్తున్న లారీని కారు ఓవర్‌టేక్ చేయబోయబోవడంతో ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణిస్తున్న ఓ 12 ఏళ్ల బాలిక మృతి చెందింది. మరో ముగ్గురు గాయపడ్డాడు. ఈ ఘటన మహబూ బ్‌నగర్ జిల్లాలో ఆదివారం చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లాలోని పీలేరుకు చెందిన విశ్వనాథ్‌రెడ్డి తన భార్య గీత, కూతుళ్లు హన్సిక (12), నాలుగేళ్ల సోనికతో కారులో ఆదివారం ఉదయం హైదరాబాద్‌కు బయల్దేరారు.
సాయంత్రం 4 గంటల ప్రాంతంలో జాతీయ రహదారిపై ఉన్న దివిటిపల్లి స్టేజీ సమీపంలో విశ్వనాథ్‌రెడ్డి తన కారును ఓవర్‌టేక్ చేయబోయి ముందుగా వెళ్తున్న లారీను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో హన్సిక అక్కడికక్కడే మృతి చెందింది. మిగతా ముగ్గురికి గాయాలయ్యా యి. గమనించిన స్థానికులు 108 అంబులెన్స్‌లో వారిని ఎస్‌వీఎస్ ఆస్పత్రికి తరలిం చా రు. ఈ మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ లక్ష్మీనారాయణ తెలిపారు.
మహబూబ్‌నగర్ జిల్లాలో రోడ్డుప్రమాదం
Published Mon, Mar 17 2014 4:51 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
Advertisement
Advertisement