
సాక్షి, అన్నమయ్య జిల్లా: టీడీపీ, జనసేన మేనిఫెస్టోపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు హామీలన్నీ మోసమేనని బీజేపీ వైఖరితో అర్థమైందన్నారు. టీడీపీ, జనసేన మేనిఫెస్టోలో తమ ఫోటో వద్దని బీజేపీ గట్టిగా చెప్పిందని పేర్కొన్నారు. బాబు డిక్లేర్ చేసిన మేనిఫెస్టోలో మోదీ ఫోటో పెట్టొద్దని బీజేపీ తేల్చేసిందన్నారు. ముగ్గురు కూటమిలో ఉండి ముగ్గురు ఫోటోలను మేనిఫెస్టోలో పెట్టుకునే పరిస్థితి చంద్రబాబుకు లేదని ఎద్దేవా చేశారు.
అవ్వాతాతలకు ఇంటివద్దకే అందే పెన్షన్‌ను ఆపిన దుర్మార్గుడు చంద్రబాబని ధ్వజమెత్తారు. మీ బిడ్డకు(జగన్) మంచి పేరు వస్తుందనే బాబు పెన్షన్లను అడ్డుకున్నాడని మండిపడ్డారు. తన మనిషిని నిమ్మగడ్డతో ఫిర్యాదు చేయించి పనెన్షన్‌ను అడ్డుకున్నాడని.. ప్రజల్లో వ్యతిరేకత రావడంతో తన కుట్రలను మనపై నెడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం జగన్ పూర్తి ప్రసంగం
- ఈ ఎన్నికలు.. రాబోయే అయిదేళ్ల భవిష్యత్.
- జగన్‌కు ఓటేస్తే..పథకాలు కొనసాగింపు.
- చంద్రబాబుకు ఓటేస్తే పథకాలు ముగింపే.
- పొరపాటున బాబుకు ఓటేస్తే..పసుపుపతి నిద్రలేస్తాడు.
- వదల బొమ్మాళి అంటూ పేదల రక్తం తాగుతాడు..
- బాబును నమ్మడమంటే కొండచిలువ నోట్లో తలపెట్టడమే.
- 2014లో చంద్రబాబు చేసిన మోసాలు గుర్తున్నాయా?.
- రైతు రుణమాఫీ చేస్తానన్నాడు.. చేశాడా?
- రూ. 87,612 కోట్ల రుణాలు మాఫీ చేస్తానన్నాడు.. చేశాడా?
- పెట్టుబడి సాయం కింద బాబు ఏనాడు ఒక్క రూపాయి ఇవ్వలేదు
- .బాబు ఏనాడైనా రైతుభరోసా కింద ఒక్క రూపాయి అయినా ఇచ్చాడా.
- 14 ఏళ్లలో బాబు ఏనాడు రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వలేదు.
- డ్వాక్రా రుణాలు రద్దు చేస్తానన్నాడు..చేశాడా?.
- రైతు రుణమాఫీ చేస్తానన్నాడు.. చేశాడా?
- అక్కాచెల్లెమ్మలను మోసం చేసి రోడ్డుపై నిలబెట్టాడు
- ఆడబిడ్డ పుడితే రూ. 25 వేలు డిపాజిట్ చేస్తానన్నాడు.. చేశాడా?
- గర్భిణీ స్త్రీలకు రూ. 10 వేలు ఇస్తానన్నాడు.. ఇచ్చాడా?
- గ్యాస్ సిలిండర్‌పై రూ. 100 సబ్సిడీ ఇస్తానన్నాడు.. ఇచ్చాడా?
- బ్యాంకుల్లో పెట్టిన బంగారాన్ని విడిపిస్తానన్నాడు.. విడిపించాడా?
- ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తానన్నాడు.. చేశాడా?
మీ బిడ్డ జగన్ రైతన్నకు అండగా నిలబడ్డాడు.
- పెట్టుబడి సాయం కింద మీ బిడ్డ ప్రతియేటా రూ. 13, 500 ఇచ్చాడు.
- జగన్‌కు, చంద్రబాబుకు ఉన్న తేడా గమనించండని కోరుతున్నా.
- అక్కా చెల్లెమ్మలకు మీ బిడ్డ జగన్ తోడుగా ఉన్నాడు
- అక్కాచెల్లెమ్మల కోసం మేనిఫెస్టోలోని ప్రతి హామీని నెరవేర్చా.
- అక్కాచెల్లెమ్మల కోసం ఆసరా, సున్నా వడ్డీ, చేయూతతో ఆదుకున్నాం.
- అక్కాచెల్లెమ్మల కోసం కాపు నేస్తం, ఆబీసీ నేస్తం తీసుకొచ్చా.
- 31 లక్షల ఇళ్లపట్టాలు అక్కా చెల్లెమ్మల పేరుపై రిజిస్ట్రేషన్.
- ఇంటి వద్దకే అవ్వాతాతలకు పెన్షన్ అందిస్తున్నాం.
- పెన్షన్ రూ. 3 వేల నుంచి రూ, ,500లకు పెంచుకుంటూ పోతాం.
- 14 ఏళ్లలో చంద్రబాబు ఏనాడైనా పెన్షనర్లను పట్టించుకున్నాడా?
- చంద్రబాబు మోసాలను ఓడించడానికి మీరంతా సిద్ధమేనా.
- రైతుభరోసాగా ఏడాదికి రూ.16 వేలు.. ఐదేళ్లకు రూ.80 వేలు ఇస్తాడు మీ జగన్.
- చంద్రబాబు వల్ల రాష్ట్రంలోని మహిళలందరికీ కొన్ని రూ.వేల కోట్ల నష్టం జరిగింది.
పిల్లలను బడులకు పంపే తల్లులకు ఇచ్చే అమ్మఒడిని రూ.17 వేలుకు పెంచాం.
చంద్రబాబు ఈరోజు విడుదల చేసిన మేనిఫెస్టోలో అలవిగాని హామీలను చూసిన బీజేపీ.. నీ ఫోటో పెట్టుకోగానీ మోడీ గారి ఫొటో మాత్రం పెట్టుకోవద్దని తేల్చి చెప్పేసింది. ముగ్గురున్న కూటమిలో కనీసం ఆ ముగ్గురి ఫొటోలు కూడా మేనిఫెస్టోలో పెట్టుకోలేని స్థితిలో చంద్రబాబు ఉన్నాడు. వచ్చే ఎన్నికల్లో మన… pic.twitter.com/SrcrNnBYWQ
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 30, 2024

Comments
Please login to add a commentAdd a comment