peddireddy mithunreddy
-
రఘురామ కృష్ణంరాజు దిష్టిబొమ్మ దగ్ధం
సాక్షి, చిత్తూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యలపై చిత్తూరు జిల్లా వైఎస్సార్సీపీ కార్యకర్తలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తలు ఎంపీ రఘురామ కృష్ణంరాజు దిష్టి బొమ్మను పీలేరులో దహనం చేశారు. మచ్చ లేని నాయకుడు ఎంపీ మిథున్ రెడ్డి అని, అటువంటి నేతపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదని స్పష్టం చేశారు. రఘురామ కృష్ణంరాజు ఖబర్దార్ అంటూ నినాదాలు చేశారు. (చదవండి: వలంటీరుతో ఓడిస్తాం.. దమ్ముంటే రాజీనామా చెయ్యండి ) -
పార్లమెంటరీ సలహా సంఘ సభ్యులుగా జిల్లా ఎంపీలు
సాక్షి, చిత్తూరు : జిల్లా అభివృద్ధికి కృషి చేస్తామని కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ మంత్రిత్వ శాఖలకు పార్లమెంటరీ సలహా సంఘ సభ్యులుగా గురువారం ఎంపికైన జిల్లాకు చెందిన ఎంపీలు మిధున్‌రెడ్డి, రెడ్డెప్ప, బల్లి దుర్గాప్రసాద్ తెలిపారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సలహా సంఘం సభ్యునిగా నియమితులైన రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి మాట్లాడుతూ, రాజంపేట పరిధిలోని గ్రామాల్లో ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు చొరవ చూపుతానన్నారు. కేంద్రంతో చర్చించి గ్రామాల అభివృద్ధికి విశేష కృషి చేస్తామని చెప్పారు. పర్యాటక, సాంస్కృతిక పార్లమెంటరీ సలహా సభ్యునిగా ఎంపికైన చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప మాట్లాడుతూ, జిల్లాలోని సాంస్కృతిక, టూరిజం ప్రదేశాలను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానన్నారు. హార్సిలీహిల్స్, తలకోన, కైగల్, పులిగుండు తదితర పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. షిప్పింగ్ పార్లమెంటరీ సభ్యులుగా ఎన్నికైన తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ, నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం రేవు అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఆ రేవు నుంచి ఇతర దేశాలకు సరుకులు ఎగుమతి చేసేలా ఒప్పందాలు చేసుకునేందుకు చొరవ చూపుతానన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆశయాలకు అనుగుణంగా పనిచేసి ప్రజల సమస్యలను పరిష్కారిస్తామని ఎంపీలు పేర్కొన్నారు. పార్లమెంటరీ సలహా సంఘంలో జిల్లాకు చెందిన ఎంపీలు ఎంపిక కావడం పట్ల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
‘బాబుకు ఏపీ ప్రజలు కూడా బుద్ధి చెబుతారు’
ఢిల్లీ: తెలంగాణ ప్రజలు పరిపక్వతతో మంచి తీర్పు ఇచ్చారని వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఢిల్లీలో మేకపాటి విలేకరులతో మాట్లాడుతూ.. నాయకులు దారి తప్పినా ప్రజలు సరైన విధంగా తీర్పు ఇచ్చారని తెలిపారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడికి ఏపీ ప్రజలు కూడా తగిన బుద్ధి చెబుతారని అన్నారు. ఎత్తుగడలు, మోసాలతో నారా చంద్రబాబు ప్రజలను వంచించారని విమర్శించారు. బాబు విన్యాసాలు బెడిసికొట్టాయి: ఉమ్మారెడ్డి చంద్రబాబు విన్యాసాలు తెలంగాణాలో బెడిసికొట్టాయని వైఎస్సార్సీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. అనైతిక పొత్తు వల్ల నష్టపోయామని కాంగ్రెస్, టీడీపీలోనే అనేక మంది నాయకులు అభిప్రాయపడుతున్నారని తెలిపారు. పొత్తులు లేకుండా చంద్రబాబు రాజకీయాలు చేయలేదని మండిపడ్డారు. పొత్తుకు పరాకాష్టగా కాంగ్రెస్‌తో జత కట్టారని దుయ్యబట్టారు. హోదా వచ్చే వరకు పోరాటం ఆగదు: వైవీ ప్రత్యేక హోదా కోసం పార్లమెంటులో తొలి రోజునే ధర్నాకు దిగామని, ఎంపీలందరూ రాజీనామా చేసి నిరవధిక దీక్షకు దిగి పోరాటం చేశామని వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా ఊపిరి లాంటిదని, ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే వరకు మా పోరాటం కొనసాగుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో వైఎస్సార్సీపీ 25 ఎంపీ సీట్లు గెలుచుకుంటుదని జోస్యం చెప్పారు. చంద్రబాబు ఓటమిని ఏ పార్టీ కూడా రక్షించలేదన్నారు. ఆయనకు ఏ పార్టీ కూడా మద్ధతిచ్చే అవకాశం లేదన్నారు. తెలంగాణాలో ఉన్న అన్ని పార్టీలతో కలిసినా ప్రజలు చంద్రబాబును, కాంగ్రెస్‌ను ఓడించారని ఎద్దేవా చేశారు. సీబీఐ నుంచి కాపాడుకునేందుకు ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో కొత్తపాట పాట పాడుతున్నారని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇప్పటికే చంద్రబాబును ఓడించాలని ప్రజలు నిర్ణయించుకున్నారని, సైకిల్ రెండు చక్రాల్లో ఇప్పటికే గాలిపోయిందని ఎద్దేవా చేశారు. కర్ణాటకలో గెలిస్తే నా వల్లే గెలిచావని చెప్పావు బాబూ! స్పష్టమైన ఆధిక్యంతో గెలిచిన టీఆర్ఎస్ పార్టీకి మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నట్లు వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చెప్పారు. కర్ణాటక ఎన్నికల్లో గెలిస్తే నావల్లే గెలిచారని చంద్రబాబు జబ్బలు చరుచుకున్నారని చెప్పారు. తెలంగాణలోనూ ఓటమికి చంద్రబాబే కారణమన్నారు. చంద్రబాబుతో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మునిగిపోయిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కూడా చిత్తుగా ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. -
బైరటీస్ గనుల్లో ఏపీఎండీసీ అక్రమాలు
-
డిసెంబర్ 4 నుంచి ‘అనంత’లో ప్రజాసంకల్పయాత్ర
సాక్షి, అనంతపురం: తమ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర డిసెంబర్ 4 నుంచి అనంతపురం జిల్లాలో కొనసాగుతుందని వైఎస్సార్ సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి తెలిపారు. వైఎస్ జగన్ 15 రోజుల పాటు 220 కిలోమీటర్ల మేర జిల్లాలో పాదయాత్ర చేస్తారని చెప్పారు. దారి పొడవునా అన్ని వర్గాల ప్రజలను కలుస్తారని, ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటారని పేర్కొన్నారు. ఇప్పటికే వైఎస్సార్ జిల్లాలో జగన్ పాదయాత్ర పూర్తి చేశారు. ప్రస్తుతం కర్నూలు జిల్లాలో ప్రజాసంకల్పయాత్రను కొనసాగిస్తున్నారు. కాగా, వంద మంది చంద్రబాబులు వచ్చినా వైఎస్ జగన్‌ను అడ్డుకోలేరని.. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీదే విజయమని మాజీ ఎమ్మెల్సీ రెహ్మాన్ అన్నారు. ప్రజా సమస్యలపై స్పందించే ఏకైక నేత వైఎస్ జగన్ అని పేర్కొన్నారు. -
'రెయిన్ గన్స్ పేరుతో రైతులను ముంచారు'
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు పుణ్యమా అని రైతులు వలస వెళ్తున్నారని వైఎస్ఆర్సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ధ్వజమెత్తారు. రెయిన్ గన్స్ పేరుతో చంద్రబాబు రైతులను నట్టేట ముంచారన్నారు. పుష్కరాలకు రూ.3వేల కోట్లు ఖర్చు పెట్టిన చంద్రబాబు, రైతులకు ఎందుకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేక పోతున్నారని మండిపడ్డారు.