సాక్షి, అనంతపురం: తమ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర డిసెంబర్ 4 నుంచి అనంతపురం జిల్లాలో కొనసాగుతుందని వైఎస్సార్ సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి తెలిపారు. వైఎస్ జగన్ 15 రోజుల పాటు 220 కిలోమీటర్ల మేర జిల్లాలో పాదయాత్ర చేస్తారని చెప్పారు. దారి పొడవునా అన్ని వర్గాల ప్రజలను కలుస్తారని, ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటారని పేర్కొన్నారు. ఇప్పటికే వైఎస్సార్ జిల్లాలో జగన్ పాదయాత్ర పూర్తి చేశారు. ప్రస్తుతం కర్నూలు జిల్లాలో ప్రజాసంకల్పయాత్రను కొనసాగిస్తున్నారు.
కాగా, వంద మంది చంద్రబాబులు వచ్చినా వైఎస్ జగన్‌ను అడ్డుకోలేరని.. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీదే విజయమని మాజీ ఎమ్మెల్సీ రెహ్మాన్ అన్నారు. ప్రజా సమస్యలపై స్పందించే ఏకైక నేత వైఎస్ జగన్ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment