Chandrababu Naidu Is Behind The Conspiracies Of MP Raghurama Krishnaraju - Sakshi
Sakshi News home page

బాబు వాట్సాప్‌లో రఘురామ పిటిషన్‌!

Published Tue, Jul 20 2021 2:54 AM | Last Updated on Tue, Jul 20 2021 11:14 AM

Raghu Rama Krishna Raju was a puppet in Chandrababu naidu hands - Sakshi

సార్‌... అన్ని పాయింట్లూ కవర్‌ చేశా..!
రఘురామకృష్ణరాజు: సార్‌... జగన్‌  బెయిల్‌ రద్దు పిటిషన్‌ లేటెస్ట్‌ వెర్షన్‌ ఇది. అన్ని పాయింట్లూ కవర్‌ చేశా. (ఆ పిటిషన్‌ కాపీని వాట్సాప్‌ చేశారు)
చంద్రబాబు: నాకు లేటెస్ట్‌ వెర్షన్‌ను మళ్లీ పంపించగలవా?
రఘురామకృష్ణరాజు: సారీ సార్‌... ఇప్పుడే పంపిస్తా. (ఆ వెంటనే పిటిషన్‌ లేటెస్ట్‌ వెర్షన్‌ను పంపించారు) 
– 2021 ఏప్రిల్‌ 4న చంద్రబాబు, రఘురామ కృష్ణరాజు వాట్సాప్‌ చాటింగ్‌ ఇదీ.

చంద్రబాబు డైరెక్షన్‌లోనే, ఆయన అనుమతి పొందాకే రఘురామ సీఎం జగన్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌తో సహా సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేందుకు వివిధ అంశాలను తన అజెండాగా చేసుకున్నారన్నది దీని ద్వారా స్పష్టంగా తెలుస్తోంది. ఇద్దరి మధ్య జరిగిన పలు వాట్సాప్‌ సంభాషణలు, చాటింగ్‌లు అదే విషయాన్ని రుజువు చేస్తున్నాయి. కులాలు, మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడంతో సహా రఘురామ మీడియా ద్వారా మాట్లాడే అన్ని విషయాలూ చంద్రబాబుకు ముందే తెలుసన్నది వారి వాట్సాప్‌ చాటింగ్‌ను పరిశీలిస్తే స్పష్టమవుతోంది.  

సాక్షి, అమరావతి: టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు మరోసారి అవే కుట్రలకు తెర తీశారు. తన చేతిలో కీలుబొమ్మగా మారిన నరసా పురం ఎంపీ రఘురామకృష్ణరాజును పావుగా వాడు కుంటూ ప్రభుత్వం, సీఎం వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా కుట్రలు, కుతంత్రాలకు రచన చేశారు. కులాలు, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందు కు బరి తెగించారు. వైఎస్‌ జగన్‌ బెయిల్‌ను రద్దు చేయాలంటూ చంద్రబాబు డైరెక్షన్‌లోనే రఘురామ కృష్ణరాజు పిటిషన్‌ దాఖలు చేశారు.

ఇవన్నీ ఏవో ఆరోపణలు కావు... పక్కా ఆధారాలతో బయట పడ్డ సంచలన నిజాలు. చంద్రబాబు, లోకేశ్, టీడీపీ అనుకూల మీడియా చానళ్లు ఏబీఎన్‌–ఆంధ్రజ్యోతి, టీవీ 5 యాజమాన్యాలు, ప్రతినిధులతో రఘు రామకృష్ణరాజు జరిపిన వాట్సాప్‌ సంభాషణలు, చాటింగ్‌లు వెల్లడిస్తున్న విస్మయకర వాస్తవాలు. సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టేందుకు కుట్ర పన్నిన కేసులో రఘురామకృష్ణరాజును సీఐడీ అధి కారులు గత మే నెలలో అరెస్టు చేసినప్పుడు ఆయ న సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో భాగంగా ఆ సెల్‌ఫోన్‌ కాల్‌డేటాను విశ్లేషించగా ఈ విభ్రాంతికర కుట్ర బహిర్గతమైంది.

ఇదే అంశాలను రాష్ట్ర ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టుకు ఇటీవల సమర్పించిన అఫిడవిట్‌లో సీఐడీ అధికారులు సవి వరంగా నివేదించారు. 230 పేజీల ఆ అఫిడవిట్‌ను పరిశీలిస్తే సీఎం వైఎస్‌ జగన్‌కు వ్యతిరేకంగా చంద్ర బాబు, లోకేశ్, రఘురామకృష్ణరాజు, టీడీపీ అను కూల మీడియా ఏబీఎన్‌–ఆంధ్రజ్యోతి, టీవీ 5 సాగిస్తున్న కుట్రలు తేటతెల్లమవుతాయి. 

బాబు చేతిలో కీలుబొమ్మ రఘురామ
రఘురామకృష్ణరాజు మొదటి నుంచి చంద్రబాబు కనుసన్నల్లోనే వ్యవహరిస్తున్నారు. సీఎం వైఎస్‌ జగన్‌పై ఏ రోజు ఎటువంటి ఆరోపణలు చేయను న్నదీ, ఏ విధంగా కించపరుస్తూ విద్వేషాలు రెచ్చ గొట్టనున్నదీ, అందుకు అనుకూల మీడియాను ఎ లా వాడుకోనున్నదీ రఘురామకృష్ణరాజు నిత్యం చంద్రబాబు, లోకేశ్‌లకు ముందుగానే చెబుతున్నా రు.

బాబు తరపున లోకేశ్‌ తరచూ ఆయనతో వా ట్సాప్‌ చాట్‌ ద్వారా టచ్‌లో ఉంటున్నారు. ఏ విష యంపై ఎలా విద్వేషాలు రెచ్చగొట్టాలో వారిద్దరూ పక్కాగా చర్చించుకుంటున్నారు. ‘మీరు ఇలా చేయండి.. నేను ఇలా చేస్తా’ అని పక్కాగా కుట్రలు పన్నిన అనంతరమే రఘురామకృష్ణరాజు మీడియా ద్వారా విద్వేషాలు రెచ్చగొట్టారు. సీఎంను ఉద్దే శించి తాను చేయనున్న అసభ్యకర వ్యాఖ్యలు, మ తాల మధ్య విద్వేషం రేకెత్తించే వ్యాఖ్యల గురించి లోకేశ్, ఏబీఎన్‌–ఆంధ్రజ్యోతి, టీవీ 5 ప్రతినిధుల తో ఆయన ముందుగానే చర్చించారు.

మీడియా ప్రతినిధులు తనను ఏ ప్రశ్నలు వేయాలి? వాటికి తాను ఎలాంటి సమాధానాలు చెప్పాలి? తద్వారా విద్వేషాలు ఎలా రెచ్చగొట్టాలి? అనేవి రఘు రామకృష్ణరాజు, లోకేశ్, ఆంధ్రజ్యోతి–ఏబీఎన్, టీవీ 5 ప్రతినిధులు తరచూ చాటింగ్‌ ద్వారా చర్చించు కున్నారు. ఆ కుట్రలో భాగంగానే రఘురామ కృష్ణరాజు వీడియో లింక్‌లను లోకేశ్‌ వివిధ చానళ్లు, సోషల్‌ మీడియా వేదికలకు షేర్‌ చేశారు. తద్వారా  అలజడి సృష్టించేందుకు యత్నించారు. 

వాట్సాప్‌లో బాబుకు పిటిషన్‌ కాపీ..
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్‌ రద్దు పిటిషన్‌ వ్యవహారంలో చంద్రబాబు స్వయం గా రఘురామకృష్ణరాజుతో వాట్సాప్‌లో చాటింగ్‌ చేశారు. చంద్రబాబు డైరెక్షన్‌లోనే సీఎం వైఎస్‌ జగన్‌ బెయిల్‌ రద్దు చేయాలని న్యాయస్థానంలో రఘురామకృష్ణరాజు పిటిషన్‌ దాఖలు చేసినట్లు వాట్సాప్‌ సంభాషణలు స్పష్టం చేస్తున్నాయి. పిటి షన్‌ ఎలా వేయాలి? అందులో ఏ అంశాలు ఉండా లి? లాంటివన్నీ చంద్రబాబు సూచనల మేరకే జరి గాయి. ఆ పిటిషన్‌ కాపీని చంద్రబాబు స్వయంగా చూసి తన న్యాయ సలహాదారులతో చర్చించి ఆమోదించిన తరువాతే న్యాయస్థానంలో రఘు రామకృష్ణరాజు దాన్ని దాఖలు చేశారు.

బెయిల్‌ రద్దు పిటిషన్‌ అంశంపై 2021 మార్చి 28, 29, ఏప్రిల్‌ 2, 3, 4వ తేదీలలో చంద్రబాబుతో రఘు రామకృష్ణరాజు వాట్సాప్‌ చాటింగ్‌ చేశారు. సీఎం జగన్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌ కాపీని చంద్రబాబుకు రెండుసార్లు వాట్సాప్‌ చేశారు. ఆ పిటిషన్‌ కాపీని చంద్రబాబు చూసి ఆమోదించాకే 2021 ఏప్రిల్‌ 6న న్యాయస్థానంలో దాఖలు చేశారు.   

విద్వేషాలు రేకెత్తించేందుకే ‘రచ్చబండ..
‘క్రిస్టియన్, రెడ్డి సామాజిక వర్గాలను లక్ష్యంగా చేసుకుని రఘురామకృష్ణరాజు చంద్రబాబు, లోకేశ్, ఏబీఎన్‌–ఆంధ్రజ్యోతి, టీవీ 5లతో కలసి కుట్రలకు పాల్పడ్డారని సీఐడీ పేర్కొంది. ఏబీఎన్‌ ఛానల్‌  రఘురామకృష్ణరాజు కోసం రచ్చబండ పేరుతో ఏకంగా ఓ కార్యక్రమాన్నే రూపొందించిందని తెలిపింది. దురుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తూ వర్గ వైషమ్యాలను రెచ్చగొట్టేందుకు వేదికలైన ఈ రెండు టీవీ ఛానళ్లు మీడియా స్వేచ్ఛను అడ్డం పెట్టుకుని రక్షణ పొందలేవని సీఐడీ అఫిడవిట్‌లో పేర్కొంది.

మీడియా స్వేచ్ఛను సాకుగా చూపి రక్షణ పొందేం దుకు పిటిషనర్లకు అనుమతినివ్వొద్దని, దర్యాప్తును అడ్డుకునే ప్రయత్నాలను అనుమతించవద్దని సుప్రీంకోర్టును అభ్యర్థించింది. సీఐడీ నమోదు చేసి న ఎఫ్‌ఐఆర్‌ను సవాలు చేస్తూ ఆమోద బ్రాడ్‌ కాస్టింగ్‌ (ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి), శ్రేయా బ్రాడ్‌ కాస్టింగ్‌ (టీవీ 5) దాఖలు చేసిన పిటిషన్లను కొట్టే యాలని, దర్యాప్తునకు సహకరించేలా వారిని ఆదేశించాలని కోరింది. 

రఘురామకు రూ.8.81 కోట్లు ఇచ్చిన టీవీ 5 నాయుడు
టీవీ 5 చానల్‌ యజమాని బీఆర్‌ నాయుడు, రఘురామకృష్ణరాజులకు మధ్య డబ్బు బదిలీ జరి గిందని సీఐడీ తన అఫిడవిట్‌లో పేర్కొంది. దాదాపు రూ.8.81 కోట్లు (1 మిలియన్‌ యూరో లు) టీవీ 5 బీఆర్‌ నాయుడు నుంచి రఘురామ కృష్ణరాజుకు బదిలీ అయ్యాయని సీఐడీ తెలిపింది. ఏ కంపెనీ పేరు మీద, ఏ బ్యాంకులో ఆ డబ్బు జమ అయిందో కూడా సీఐడీ ఆధారాలతో సహా సుప్రీం కోర్టుకు నివేదించింది. 

నాన్నగారితో ఇప్పుడే మాట్లాడా....!
రఘురామకృష్ణరాజు: నాన్నగారి (చంద్రబాబు)తో ఇప్పుడే మాట్లాడా. సోమవారం మధ్యాహ్నానికల్లా మనం సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలి. మనం సుప్రీంకోర్టుకు వెళ్లకుండా చేసేందుకు ఈ ‘ప్రవీణ్‌’  దీన్ని పెండింగ్‌లో ఉంచేందుకు ప్రయత్నించవచ్చు. కానీ మనం సిద్ధంగా ఉండాలి. సుప్రీంకోర్టులో ఫెయిల్‌ అయితే మనం హెల్ప్‌లెస్‌ అవుతాం. కానీ మనం దీన్ని వదలొద్దు. నేను నావైపు నుంచి ఆట ఈ రోజే మొదలుపెడతా. 

లోకేశ్‌: అవును. ఆ అవకాశం  కూడా ఉంది.
►2021 మే 1న రఘురామకృష్ణరాజు – లోకేశ్‌ మధ్య వాట్సాప్‌ చాటింగ్‌ ఇదీ.
►రఘురామకృష్ణరాజు, లోకేశ్‌లు తమ సంభాషణల్లో పలుదఫాలు పలువురు న్యాయమూర్తుల పేర్లు, కోర్టుల బెంచ్‌ల పేర్లను కూడా ప్రస్తావించడం గమనార్హం. ఏ పిటిషన్‌ ఏ న్యాయమూర్తి ముందుకు విచారణకు రానుందో... ఆయన ఏ విధంగా స్పందిస్తారో... అలా అయితే మనం ఏం చేయాలో... అంటూ వారిద్దరూ చాటింగ్‌ చేయడం విస్మయపరుస్తోంది. న్యాయస్థానాలు, న్యాయమూర్తులకు కూడా వివిధ అంశాలు ఆపాదిస్తూ వారిద్దరూ చర్చించుకోవడం గమనార్హం.

45 వీడియోలు, వేలాది చాటింగ్‌లను విశ్లేషించిన సీఐడీ
సీఐడీ దర్యాప్తులో భాగంగా రఘురామరాజు వివిధ సందర్భాల్లో మాట్లాడిన 45 వీడియోలను విశ్లేషించారు. ఫోరెన్సిక్‌ ల్యాబరేటరీలకు పంపించి నివేదిక తెప్పించుకున్నారు. చంద్రబాబు, లోకేశ్, ఏబీఎన్‌–ఆంధ్రజ్యోతి, టీవీ 5 యాజమాన్యాలు, ఆ సంస్థ ప్రతినిధులతో జరిపిన వేలాది చాటింగ్‌లను నిశితంగా పరిశీలించారు. చంద్రబాబు డైరెక్షన్‌లో లోకేశ్, టీడీపీ అనుకూల మీడియా ప్రతినిధులతో చర్చించి పక్కాగా కుట్రపన్ని రఘురామకృష్ణరాజు వ్యవహరించారని సీఐడీ అధికారులు నిర్ధారించారు. కొన్ని మతాలు, కులాలను కించపరుస్తూ మరికొన్ని మతాలు, కులాలను రెచ్చగొట్టడమే లక్ష్యంగా విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం ద్వారా  అలజడులు సృష్టించేందుకు పన్నాగం పన్నారని నిగ్గుతేల్చారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కించపరుస్తూ, తూలనాడుతూ అసభ్యపూరితంగా మాట్లాడటం ద్వారా సమాజంలో సుహృద్భావ వాతావరణాన్ని దెబ్బతీసేందుకు పన్నాగం పన్నారని ఆధారాలు బయటపెట్టారు. ప్రజల్లో ఆందోళనలు సృష్టించేందుకు పన్నిన పన్నాగాన్ని బట్టబయలు చేశారు. చంద్రబాబు డైరెక్షన్‌లో రఘురామకృష్ణరాజు, ఏబీఎన్‌–ఆంధ్రజ్యోతి, టీవీ 5 యాజమాన్యాలు ఆరు విధాలుగా క్రిమినల్‌ కుట్రలకు పాల్పడ్డారని సీఐడీ అధికారులు నిర్ధారిస్తూ అఫిడవిట్‌లో పేర్కొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement