రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలన్నా.. పేదల ముఖంలో వెలుగు నింపాలన్నా అది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత
రాష్ర్ట అభివృద్ధి జగన్‌తోనే సాధ్యం
Published Sun, Nov 10 2013 3:05 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM
పాలకొల్లు, న్యూస్‌లైన్ :రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలన్నా.. పేదల ముఖంలో వెలుగు నింపాలన్నా అది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి వల్లే సాధ్యమని ఆ పార్టీ నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గం పరిశీకుడు కనుమూరి రఘరామకృష్ణంరాజు అన్నారు. జగన్‌మోహన్‌రెడిడ ముఖ్యమంత్రి అయితేనే ఇది సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు. పాలకొల్లు నియోజకవర్గ పార్టీ నాయకుడు ఆకెన వీరాస్వామి (అబ్బు) ఆర్థిక సహకారంతో నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను శనివారం ఆయన ఆవిష్కరించారు. తొలుత పాలకొల్లు మండలం శివదేవుని చిక్కాల గ్రామంలో వైఎస్ విగ్రహాన్ని రఘురామకృష్ణం రాజు ఆవిష్కరించి మాట్లాడారు. సంక్షేమ, అభివృద్ధి పథకాలు నిరాటంగా కొనసాగాలంటే రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వాలని ఆయన ప్రజలను కోరారు.
ఎమ్మెల్సీ మేకా శేషుబాబు మాట్లాడుతూ తండ్రి ఆశయ సాధన కోసం జగన్‌మోమన్‌రెడ్డి కుటుంబం ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొనడానికైనా సిద్ధంగా ఉందన్నారు. వైఎస్ విగ్రహావిష్కరణ అనంతరం శిలా ఫలకాన్ని మాజీ ఎంపీ చేగొండి జోగయ్య ఆవిష్కరించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి తెల్లం బాలరాజు, లోక్‌సభ మాజీ స్పీకర్ బాలయోగి విగ్రహానికి రఘురామకృష్ణంరాజు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పార్టీ భీమవరం, ఉండి నియోజకవర్గ సమన్వయకర్తలు గ్రంధి శ్రీనివాస్, పాతపాటి సర్రాజు, పాలకొల్లు, ఆచంట నియోజకవర్గ సమన్వయకర్తలు అల్లు వెంటకసత్యనారాయణ, మల్లుల లక్ష్మీనారాయణ, పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు గూడూరి ఉమాబాల, నాయకులు మేడిది జాన్సన్, గుణ్ణం నాగబాబు, ముచ్చర్ల శ్రీరామ్, సంగినీడి సూరిబాబు, ఎం మైఖేల్‌రాజు, యడ్ల తాతాజీ పాల్గొన్నారు.
Advertisement
Advertisement