
న్యూఢిల్లీ: ఎంపీ రఘురామకృష్ణ రాజుకు లోక్‌సభ సచివాలయం గురువారం నోటీసు అందించింది. అనర్హత పిటిషన్‌పై 15 రోజుల్లోగా జవాబు చెప్పాలని ఆదేశించింది. రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలని.. వైఎస్‌ఆర్‌సీపీ పార్లమెంటరీ పార్టీ ఏడాది కిందటే ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
ఇటీవల పథకం ప్రకారం.. ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పదవుల్లో ఉన్నవారిని కించపరుస్తూ, ఓ సామాజిక వర్గాన్ని, ఓ మతాన్ని టార్గెట్ చేసి తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ఉద్రిక్తతలు రెచ్చగొడుతున్న రఘురామకృష్ణరాజుపై సీఐడీ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment