
సాక్షి, అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లాలో తనపై నమోదైన రెండు కేసులను కొట్టేయాలని కోరుతూ నరసాపురం ఎంపీ కనుమూరు రఘురామకృష్ణరాజు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలు బుధవారం న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి ముందు విచారణకు వచ్చాయి.
ఈ వ్యాజ్యాలను పరిశీలించిన న్యాయమూర్తి.. విచారణ నుంచి తప్పుకొంటున్నట్లు తెలిపారు. ఈ వ్యాజ్యాలపై అత్యవసర విచారణ జరపాల్సిన అవసరం ఉందని పిటిషనర్ న్యాయవాది ఉమేష్‌చంద్ర చెప్పారు. దీంతో ఈ వ్యాజ్యాలను మరో న్యాయమూర్తి ముందుంచేందుకు ఫైళ్లను సీజే ముందుంచాలని జస్టిస్ శ్రీనివాసరెడ్డి రిజిస్ట్రీని ఆదేశించారు..