ఢిల్లీ, సాక్షి: లోక్‌సభ ఎన్నికలు 2024 కోసం అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేసింది భారతీయ జనతా పార్టీ. మొత్తం 195 స్థానాల్లో తెలంగాణ నుంచి 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. వీళ్లలో ముగ్గురు సిట్టింగ్‌లే ఉండగా.. ఓ సిట్టింగ్‌కు మొండిచేయి ఎదురైంది.
సికింద్రాబాద్ నుంచి కిషన్‌రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అర్వింద్‌లే పోటీ చేస్తారని తెలిపింది. అలాగే.. చేవెళ్ల నుంచి కొండావిశ్వేశ్వర్‌రెడ్డి, భువనగిరి-బూర నర్సయ్య గౌడ్, నాగర్‌కర్నూల్ నుంచి పీ.భరత్, జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్‌కు అవకాశం ఇచ్చింది. ఇక హైదరాబాద్ నుంచి కొంపెల్ల మాధవీలతకు ఛాన్స్ ఇచ్చారు. హాట్ నియోజకవర్గం భావిస్తున్న మల్కాజ్‌గిరి నుంచి ఈటల రాజేందర్‌ను బరిలోకి దింపేందుకు బీజేపీ అధిష్టానం నిర్ణయించింది.
ఇక.. ఇటీవలె బీజేపీలో చేరిన నాగర్‌కర్నూల్ సిట్టింగ్ ఎంపీ రాములుకి మొండిచేయి ఎదురైంది. ఆ స్థానంలో పీ.భరత్‌కు అవకాశం ఇచ్చారు. ఇక తొమ్మిది స్థానాలకు అభ్యర్థుల ప్రకటనతో.. ఆదిలాబాదు, పెద్దపల్లి, మెదక్, మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం స్థానాలకు అభ్యర్థుల ప్రకటనను బీజేపీ పెండింగ్‌లో ఉంచినట్లయ్యింది.
సంబంధిత వార్త: టార్గెట్ 370.. బీజేపీ హాట్ ఫస్ట్ లిస్ట్
Comments
Please login to add a commentAdd a comment