Lok sabha elections 2024: ముగిసిన నాలుగో విడత పోలింగ్‌.. 62.31 శాతం ఓటింగ్‌ నమోదు | Lok Sabha Elections 2024 4th Phase Polling Live Updates And Highlights In Telugu | Sakshi
Sakshi News home page

Lok Sabha Elections 2024: ముగిసిన నాలుగో విడత పోలింగ్‌.. 5 గంటల వరకు 62.31 పోలింగ్‌ నమోదు

Published Mon, May 13 2024 6:41 AM

Lok sabha elections 2024: 4th phase polling updates In Telugu

Updates

ఢిల్లీ:  దేశవ్యాప్తంగా సోమవారం(మే13)   లోక్‌సభ ఎన్నికల  నాలుగో విడత  పోలింగ్‌ ముగిసింది. సాయంత్రం  5గంటల వరకు 96 లోక్‌సభ నియోజక వర్గాల పరిధిలో సగటున 62.31 పోలింగ్‌ శాతం నమోదయింది. 

  • ఆంధ్రప్రదేశ్ -68.04%
  • బీహార్ - 54.14%
  • జమ్మూ-కాశ్మీర్- 35.75%
  • జార్ఖండ్ -63.14%
  • మధ్యప్రదేశ్ - 68.01%
  • మహారాష్ట్ర - 52.49%
  • ఒడిస్సా - 62.96%
  • తెలంగాణ - 61.16%
  • ఉత్తరప్రదేశ్ - 56.35%
  • పశ్చిమ బెంగాల్ - 75.66%

ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో 67.99 శాతం పోలింగ్‌  నమోదయింది.  డిషాలోని 28 అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో 62.96 పోలింగ్‌ శాతం నమోదైంది.  

బిహార్‌:

  • బిహార్‌ డిప్యూటీ సీఎం విజయ్‌ కుమార్‌ సిన్హా ఓటు హక్కు వినియోగించుకున్నారు.
  • లాఖీసారాయ్‌ పోలింగ్‌ బూత్‌లో  ఓటు వేశారు.

కొనసాగుతున్న నాలుగో విడత పోలింగ్‌

  • లోక్ సభ ఎన్నికల్లో మధ్యాహ్నం 1 గంటవరకు 40.32% పోలింగ్ శాతం నమోదు
  • ఆంధ్రప్రదేశ్ - 40.26 %
  • బీహార్ - 34.44%
  • జమ్మూ-కాశ్మీర్- 23.57%
  • జార్ఖండ్ - 43.80%
  • మధ్యప్రదేశ్ - 48.52%
  • మహారాష్ట్ర - 30.85%
  • ఒడిస్సా - 39.30%
  • తెలంగాణ - 40.38%
  • ఉత్తరప్రదేశ్ - 39.68%
  • పశ్చిమ బెంగాల్ - 51.87%
  • ఆంధ్రప్రదేశ్ లో 175 అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో నమోదయిన పోలింగ్ శాతం 36 శాతం
  • ఒడిస్సాలో 28 అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో నమోదయిన పోలింగ్ శాతం 39.30

బిహార్‌:

  • నార్త్‌-ఈస్ట్‌ ఢిల్లీ కాంగ్రెస్‌ అభ్యర్థి కన్హయ్య కుమార్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు
  • బెగుసారాయ్‌ పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు

    మధ్య ప్రదేశ్‌:

  • మాజీ లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
  • ఇండోర్‌ పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు.

     
    ఉత్తర ప్రదేశ్‌

  • కేంద్రమంత్రి లఖీంపూర్‌కేరీ బీజేపీ అభ్యర్థి అజయ్‌ మిశ్రా తేని ఓటు వేశారు
  • బాన్‌వీర్‌పూర్‌ పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు

నాలుగో విడత పోలింగ్‌ కొనసాగుతోంది

ఉదయం 11 గంటల వరకు 24.87 శాతం పోలింగ్‌ నమోదైంది

ఆంధ్రప్రదేశ్‌- 23.10 శాతం

తెలంగాణ- 24.31 శాతం

బిహార్‌- 22.54 శాతం

జమ్మూ కశ్మీర్‌- 14.94 శాతం

జర్ఖండ్‌- 27. 40 శాతం

మధ్యప్రదేశ్‌- 32.38 శాతం

మహారాష్ట్ర- 17.51 శాతం

ఒడిశా- 23.28 శాతం

ఉత్తరప్రదేశ్‌- 27.12 శాతం

పశ్చిమ బెంగాల్‌- 32.78 శాతం

జార్ఖండ్‌:

  • జార్ఖండ్‌ సీఎం చంపయ్‌ సోరెన్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
  • జిలింగోరా పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు.

      
     పశ్చిమ బెంగాల్‌:

  • దుర్గాపూర్‌:  బెంగాల్‌ ఘర్షణ చోటుచేసుకుంది.
  • బీజేపీ, టీఎంసీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
  • అక్కడే ఉన్న పోలీసులు ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు.

      

ఢిల్లీ:

  • నాలుగో విడత పోలింగ్‌ కొనసాగుతోంది
  • ఓటువేయడానికి భారిగా ప్రజలు తరలివస్తున్నారు
  • ఉదయం 9 గంటల వరకు మొత్తం 10. 35 శాతం పోలింగ్‌ నమోదైంది
  • ఆంధ్రప్రదేశ్‌- 9.05 శాతం
  • తెలంగాణ- 9.51 శాతం
  • బిహార్‌- 10.18 శాతం
  • జమ్మూ కశ్మీర్‌- 5.07 శాతం
  • జర్ఖండ్‌- 11. 78 శాతం
  • మధ్యప్రదేశ్‌- 14. 97 శాతం
  • మహారాష్ట్ర- 6.45 శాతం
  • ఒడిశా- 9. 23 శాతం
  • ఉత్తరప్రదేశ్‌- 11. 67 శాతం
  • పశ్చిమ బెంగాల్‌- 15. 24 శాతం

     

ఉత్తర ప్రదేశ్‌:

  • యూపీ మంత్రి జితిన్‌ ప్రసాదా ఓటు హక్కు వినియోగించకున్నారు.
  • షహజాన్‌పూర్‌ పోలింగ్‌ కేంద్రంలో ఓటు చేశారు.

జమ్మూ కశ్మీర్‌:

శ్రీనగర్‌: జమ్మూ కశ్మీర్‌ నేషనల్‌ కాన్ఫరెన్స్‌ చీఫ్‌ ఫరూఖ్‌ అబ్దుల్లా,  వైఎస్‌ ప్రెసిడెంట్‌ ఒమర్‌ అబ్దుల్లా ఓటు హక్కు వినియోగించుకున్నారు.

 

యూపీ:

  • ఉన్నావ్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి సాక్షి మహారాజ్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

జమ్మూ కశ్మీర్‌:

శ్రీనగర్‌లో నాలుగో విడత పోలింగ్‌ కొనసాగుతోంది

పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రజలు క్యూలైన్లలో నిల్చున్నారు

తెలంగాణ

  • ఓటు హక్కు వినియోగించుకున్న కేంద్రమంత్రి  కిషన్‌రెడ్డి
  • బర్కత్‌పూరా పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు.
  • నాలుగోవిడత పోలింగ్‌ కొనసాగుతోంది

 

మధ్యప్రదేశ్‌

  • మధ్యప్రదేశ్‌ సీఎం మోహన్‌ యాదవ్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
  • ఉజ్జయినిలోని పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు.

      

ఢిల్లీ:

  • కొనసాగుతున్న నాలుగో విడత లోక్ సభ ఎన్నికల పోలింగ్
  • దేశవ్యాప్తంగా సాధారణ వాతావరణ పరిస్థితులు, హీట్ వేవ్ లేదని వెల్లడించిన ఐఎండి
  • పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్న ఓటర్లు
  • పది రాష్ట్రాల్లో  96 ఎంపీ సీట్లకు ఎన్నికలు
  • ఎన్నికల బరిలో 1717 మంది అభ్యర్థులు
  • ప్రతి పార్లమెంటులో సగటున 18 మంది అభ్యర్థులు
  • 1.92 లక్షల పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్న 17.7 కోట్ల మంది ఓటర్లు
  • 85 ఏళ్లు దాటిన ఓటర్లు12.49 లక్షల మంది, 19.99 లక్షల మంది దివ్యాంగ ఓటర్లు
  • ఏపీలో 175 అసెంబ్లీ సీట్లు, ఒడిశాలో 25 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు
  • తెలంగాణలో పోలింగ్ సమయం పెంపు; ఉదయం ఏడు నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్
  • పోలింగ్ ప్రక్రియలో పాల్గొంటున్న 19లక్షల మంది సిబ్బంది
  • ఎన్నికల ప్రక్రియలో 364 మంది అబ్జర్వర్లు
  • 1016  అంతర్రాష్ట్ర సరిహద్దులు, 121 అంతర్జాతీయ సరిహద్దులలో నిఘా
  • పోలింగ్ కేంద్రాల వద్ద నీళ్లు, షెడ్, టాయిలెట్స్, ర్యాంప్స్ ఏర్పాటు

 

 

తెలంగాణ

  • ఓటు హక్కు వినియోగించుకున్న ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ

 

తెలంగాణ

  • కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై సీఈఓ వికాస్ రాజ్‌కు ఫిర్యాధు చేసిన కాంగ్రెస్
  • ఓటు వేసి మీడియాతో మాట్లాడుతూ మోడీ పేరును ప్రస్తావించినందుకు ఫిర్యాధు
  • పోలింగ్ రోజు వ్యక్తుల పేర్లు ప్రస్తావించడం కోడ్ ఉల్లంఘన కిందికి వస్తుందన్న కాంగ్రెస్
  • కిషన్ రెడ్డి పై కోడ్ ఉల్లంఘన కేసు నమోదు చేయాలని ECని కోరిన కాంగ్రెస్

 

మహారాష్ట్ర:

  • కేంద్ర మంత్రి రావుసాహెబ్ పాటిల్ దాన్వే ఓటు హక్కు వినియోగించుకున్నారు.
  • జాల్నా పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు.

 

జమ్మూ కశ్మీర్‌:

  • పుల్వామా పోలింగ్‌ కేంద్రంలో బారులు తీరిన ఓటర్లు

 

తెలంగాణ:

  • త్రిపురా గవర్నర్‌ ఎన్‌ ఇంద్రసేనా రెడ్డి ఓటు వేశారు.
  • హైదరాబాద్‌ సలీంనగర్‌ పోలింగ్‌ కేంద్రంలో పోలింగ్‌ కొనసాగుతోంది

 

తెలంగాణ:

  • ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దంపతులు
  • హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఓటు వేశారు.
  • నాలుగో విడత పోలింగ్‌ కొనసాగుతోంది

 

 

ఢిల్లీ:

 

 

తెలంగాణ: 

  • హైదరాబాద్‌ బీజేపీ అభ్యర్థి మాధవీ లత ఓటు హక్కు వినియోగించుకున్నారు.

 

 

బిహార్‌:

  • కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
  • లఖిసారి పోలింగ్‌ కేంద్రంలో ఓటు చేశారు.
  • పోలింగ్‌  కేంద్రానికి ఓటర్లు తరలి వస్తున్నారు.

 

యూపీ:

  • ఉత్తరప్రదేశ్‌ మంత్రి సురేష్‌ ఖన్నా ఓటు హక్కు వినియోగించుకున్నారు.
  • షహజాన్‌పూర్‌లో పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. 
  • ఓటు వేయడానికి ప్రజలు తరలి వస్తున్నారు.
  • ఓటర్లు  క్యూలైన్‌లో నిల్చుంటున్నారు. 

     

 

 

ఒడిశా:

  • నాబారంగాపూర్‌లో ఎకో ఫ్రెండ్లీ పోలింగ్ స్టేషన్‌ ఏర్పాటు.

      

 

  • ప్రారంభమైన నాలుగో విడత పోలింగ్‌
  • పది రాష్ట్రాల్లో 96 ఎంపీ సీట్లకు పోలింగ్‌ ప్రారంభమైంది.
  • క్యూలైన్‌లో నిల్చున్న ఓటర్లు

 

తెలంగాణ

  • తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదలైన మాక్ పోలింగ్
  • రాష్ట్ర వ్యాప్తంగా 17 లోక్ సభ
  • 17 పార్లమెంటు స్థానాలకు బరిలో నిలిచిన 525 మంది అభ్యర్థులు
  • ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్
  • మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన 13 అసెంబ్లీ స్థానాల్లో సాయంత్రం 4 గంటలకే ముగియనున్న పోలింగ్
  • పోలింగ్ పెంచేందుకు రాష్ట్రవ్యాప్తంగా సెలవు ప్రకటించిన ప్రభుత్వం
  • తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 525 మంది అభ్యర్థులు, 475మంది పురుషులు, 50 మంది మహిళా అభ్యర్థులు
  • ఎన్నికల విధుల్లో 2లక్షల 80వేల మంది సిబ్బంది విధుల నిర్వహణ
  • 160 కేంద్ర కంపెనీల CAPF బలగాలతో బందోబస్తు
  • ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణ రాష్ట్రానికి 20వేల మంది పోలీస్ బలగాలు
  • రాష్ట్ర వ్యాప్తంగా 3కోట్ల 32లక్షల 32వేల మంది ఓటర్లు
  • పురుష ఓటర్లు - 1కోటి 65లక్షల 28వేలు, 1కోటి 67లక్షల మహిళా ఓటర్లు
  • 18-19 ఏళ్ల వయసు కలిగిన యువ ఓటర్లు 9లక్షల 20వేలు, వికలాంగులు 5లక్షల 27వేలు
  • తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 35వేల 808 పోలింగ్ కేంద్రాలు
  • అత్యధికంగా మల్కాజ్గిరిలో 3226 పోలింగ్ కేంద్రాలు
  • 1లక్ష 9వేల 941 బ్యాలెట్ యూనిట్లు, 44906 కంట్రోల్ యూనిట్లు
  • తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 9900 ఉన్నట్లు గుర్తించిన ఈసీ
  • జూన్ 4వ తేదిన రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ఫలితాలు

 

  • లోక్‌సభ ఎన్నికల్లో కీలక ఘట్టమైన నాలుగో విడత పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. 

  • పది రాష్ట్రాల్లో 96 ఎంపీ సీట్లకు ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. 

  • 1717 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. 

  • ప్రతి పార్లమెంటులో సగటున 18 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 

  • 1.92 లక్షల పోలింగ్ కేంద్రాల్లో 17.7 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

  •  85 ఏళ్లు దాటిన ఓటర్లు12.49 లక్షలు ఉండగా, 19.99 లక్షల మంది దివ్యాంగ ఓటర్లు ఉన్నారు. 

  • ఏపీలో 175 అసెంబ్లీ సీట్లు, ఒడిశాలో 25 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి.

  • తెలంగాణలో పోలింగ్ సమయం పెంచడంతో ఉదయం ఏడు నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ జరగనుంది. 

  • పోలింగ్ ప్రక్రియలో 19 లక్షల మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. 

  • ఎన్నికల ప్రక్రియలో 364 మంది అబ్జర్వర్లను నియమించారు. 1016  అంతర్రాష్ట్ర సరిహద్దులు, 121 అంతర్జాతీయ సరిహద్దులలో ఈసీ నిఘా ఏర్పాటు చేసింది. 

  • పోలింగ్ కేంద్రాల వద్ద నీళ్లు, షెడ్, టాయిలెట్స్, ర్యాంప్స్ ఏర్పాటు చేశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement