సాక్షి, ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల కోసం కాంగగ్రెస్ తొలి జాబితాకు ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ క్లియరెన్స్ ఇచ్చింది. దీంతో శుక్రవారం సాయంత్రం 36 మందితో కూడిన తొలి జాబితాను అధికారికంగా రిలీజ్ చేయనుంది. ఇందులో తెలంగాణలో నాలుగు స్థానాలకు అభ్యర్థుల పేర్లు ఉన్నాయి.
శుక్రవారం సాయంత్రం ఢిల్లీ నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లిస్ట్‌లో .. జహీరాబాద్ సురేష్ కుమార్ షెట్కార్, నల్లగొండ కందూరు రఘువీర్‌రెడ్డి, చేవెళ్ల సునీతా మహేందర్‌రెడ్డి, మహాబూబాద్ నుంచి బలరాం నాయక్ పేర్లు ఉన్నాయి. ఇక కాంగ్రెస్ తొలి జాబితాలో హోల్డ్‌లో ఉంచిన స్థానాల్లో మహబూబ్ నగర్ పార్లమెంటరీ స్థానం కూడా ఉంది. మహబూబ్ నగర్ నుంచి అభ్యర్థిగా వంశీ చంద్ రెడ్డి పేరును టీపీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. అయినప్పటికీ వంశీ పేరును ఏఐసీసీ హోల్డ్‌లో ఉంచడం గమనార్హం.
మరోవైపు ఆ పార్టీ కీలక నేత, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వయనాడ్ నుంచే పోటీ చేయబోతున్నారు. అలాగే కన్నడ హీరో శివరాజ్ కుమార్ భార్య గీతకు శివమొగ్గ టికెట్‌ను కేటాయించింది ఏఐసీసీ. కిందటి ఏడాదే ఆమె కాంగ్రెస్‌లో చేరారు. ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేష్ బాఘేల్‌ను.. రాజ్‌నంద్‌గావ్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయించబోతోంది కాంగ్రెస్. కేసీ వేణుగోపాల్ మరికాసేపట్లో ప్రెస్ మీట్ నిర్వహించి తొలి జాబితాను అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉంది.
Comments
Please login to add a commentAdd a comment