4 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్
జహీరాబాద్, నల్లగొండ, మహబూబాబాద్, మహబూబ్‌నగర్‌కు ఎంపిక
సురేశ్ షెటా్కర్, రఘువీర్‌రెడ్డి, బలరాం నాయక్, వంశీచంద్‌రెడ్డికి టికెట్లు
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న 39 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను కాంగ్రెస్ హైకమాండ్ విడుదల చేసింది. ఇందులో భాగంగా తెలంగాణ నుంచి పోటీ చేసే నలుగురు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. జహీరాబాద్, నల్లగొండ, మహబూబాబాద్, మహబూబ్‌నగర్ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శుక్రవారం వెల్లడించారు.
తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలు ఉన్న సంగతి తెలిసిందే. కాగా మహబూబ్‌నగర్ నుంచి వంశీచంద్‌రెడ్డి, జహీరాబాద్ నుంచి సురేశ్ షెట్కార్, నల్లగొండ నుంచి మాజీ మంత్రి జానారెడ్డి కుమారుడు కుందూరు రఘువీర్ రెడ్డి, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్ పోటీ చేయనున్నారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో లోక్‌సభ స్థానాలు కేటాయిస్తామంటూ ఇచ్చిన మాటకు కట్టుబడి కాంగ్రెస్ అధిష్టానం.. ప్రస్తుతం ప్రకటించిన నలుగురు అభ్యర్థులకు తొలి జాబితాలోనే చోటు కల్పించింది.
Comments
Please login to add a commentAdd a comment