బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న 80 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను ఆమ్ ఆద్మీ పార్టీ సోమవారం విడుదల చేసింది. మేలో జరగనున్న ఎన్నికల్లో మొత్తం 224 స్థానాల్లోనూ పోటీ చేస్తామని ఆప్ రాష్ట్ర చీఫ్ పృథ్వీ రెడ్డి చెప్పారు.
మొదటి జాబితాలోని అందరూ ఉన్నత విద్యావంతులే. వీరిలో 13 మంది లాయర్లు, ముగ్గురు డాక్టర్లు, నలుగురు ఐటీ నిపుణులు ఉన్నారు. అభ్యర్థుల్లో సగం కంటే ఎక్కువ మంది 45 ఏళ్లలోపు వారేనని, వీరందరినీ సర్వే ద్వారా ఎంపిక చేసినట్లు పృథ్వీ రెడ్డి వెల్లడించారు. మొదటి జాబితాలో సుప్రీంకోర్టు లాయర్ బ్రిజేశ్ కాలప్ప, బృహత్ బెంగళూరు మహానగర పాలికె(బీబీఎంపీ)మాజీ అధికారి కె.మత్తయి, బీటీ నాగన్న, మోహన్ దాసరి, శంతల దామ్లే, అజయ్ గౌడ తదితరులున్నారని పృథ్వీ రెడ్డి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment