న్యూఢిల్లీ: హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు 62 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను బీజేపీ బుధవారం విడుదల చేసింది. కేబినెట్ మంత్రి మహేంద్రసింగ్‌తో పాటు 11 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మొండిచేయి చూపింది. అయితే మహేంద్రసింగ్ కుమారునికి టికెట్ దక్కింది. ఇద్దరు మంత్రుల స్థానాలు మార్చింది.
ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇతర అత్యున్నత నేతలతో కూడిన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సోమవారం జాబితాను ఖరారు చేసింది. రాష్ట్రంలో మొత్తం 68 అసెంబ్లీ స్థానాలున్నాయి. సీఎం జైరాం ఠాకూర్ మళ్లీ సెరాజ్ అసెంబ్లీ స్థానం నుంచే బరిలో దిగుతున్నారు. మాజీ సీఎం, సీనియర్ నేత ప్రేమ్‌కుమార్ ధుమాల్ (78)కు టికెట్ దక్కలేదు.
Comments
Please login to add a commentAdd a comment