తెలంగాణలోని ఆరు స్థానాలకు పచ్చజెండా!
సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్‌లో సిట్టింగ్‌లకే చాన్స్
బూర, కొండా, పోతుగంటిలకు లైన్ క్లియర్!
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదల కా నుంది. కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోదముద్ర పడడంతో మార్చి 3న తొ లి జాబితాను బీజేపీ కేంద్ర కార్యాలయం అధికారికంగా విడుదల చే యనుంది. గురువారం రాత్రి 10:50 గంటలకు ప్రారంభమైన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం సుమారు నాలుగు గంటల పాటు జరిగింది. తెలంగాణ సహా ఇతర రాష్ట్ర నాయకత్వాలు తయారు చేసిన అభ్యర్థుల జాబితాలపై ఆయా రాష్ట్రాల కోర్ కమిటీ సభ్యులతో విడి విడిగా భేటీ అయి కూలంకషంగా చర్చించింది.
అందులో భాగంగా తె లంగాణకు సంబంధించి ఆరు స్థానాలకు అభ్యర్థులపై సీఈసీ ఏక గ్రీ వంగా ఆమోదముద్ర వేసిందని సమాచారం. సిట్టింగ్ స్థానాల్లో సికింద్రాబాద్ నుంచి జి.కిషన్‌రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజా మాబాద్ నుంచి ధర్మపురి అర్వింద్‌లు మరోసారి బరిలో దిగేందుకు గ్రీ న్ సిగ్నల్ ఇచ్చారు. ఇక భువనగిరి నుంచి బూర నర్సయ్య గౌడ్, చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, నాగర్‌కర్నూల్ నుంచి పోతుగంటి భరత్‌ల అభ్యర్థిత్వాలపై కూడా సీఈసీ ఆమోదముద్ర వేసిందని సమాచారం.
ఆచితూచి నిర్ణయం
బీఆర్‌ఎస్‌కు చెందిన సిట్టింగ్ ఎంపీలు బీజేపీలో చేరుతున్నందున వివిధ స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక విషయంలో పార్టీ అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తోంది. మరో సిట్టింగ్ స్థానమైన ఆదిలాబాద్ నుంచి సోయం బాపూరావ్ అభ్యర్థిత్వాన్ని ప్రస్తుతానికి పెండింగ్‌లో పెట్టారని తెలిసింది. అయితే జహీరాబాద్ బీఆర్‌ఎస్ ఎంపీ బీబీ పాటిల్ శుక్రవారం ఢిల్లీలో కాషాయ కండువా కప్పుకోవడంతో.. ఆ స్థానంలో బీజేపీ ఎంపీగా ఆయనే బరిలోకి దిగే అవకాశాలున్నాయి. ఇక ఎక్కువ అభ్యర్థులు పోటీ పడుతున్న మల్కాజిగిరి, మహబూబ్‌నగర్, మెదక్, నల్లగొండ సహా ఇతర స్థానాలపై మరోసారి చర్చించిన తర్వాతే బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకోనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
కారు దిగనున్న మరో ఎంపీ!
ఖమ్మం నుంచి బరిలో దిగేందుకు మరో బీఆర్‌ఎస్ ఎంపీ కాషాయ కండువా కప్పుకొనే అవకాశం ఉందని, ఆయనతో పాటు మరో ఇద్దరు బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యేలు సైతం బీజేపీలో చేరేందుకు సిద్ధమౌతున్నారని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment