న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఇంకా వెలువడలేదు. అయినా బీజేపీ ఈ రాష్ట్రాలకు సంబంధించి తమ అభ్యర్థుల తొలి జాబితాలను గురువారం విడుదల చేసింది. ఛత్తీస్‌గఢ్‌లో 21 మంది, మధ్యప్రదేశ్‌లో 39 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. ఒక్కో రాష్ట్రంలో ఐదుగురు చొప్పున మహిళలకు అవకాశం కల్పించింది.
ఛత్తీస్‌గఢ్‌లోని పఠాన్ శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నేత, ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్‌పై పోటీగా తమ పార్టీ ఎంపీ, సీనియర్ నేత విజయ్ బఘేల్‌ను బరిలోకి దించుతోంది. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరుగనున్నాయి. అంతకంటే ముందు ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, తెలంగాణ, మిజోరం అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్, మధ్యప్రదేశ్‌లో బీజేపీ అధికారంలో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment