
బెంగళూరు: కర్ణాటకలో శాసనసభ ఎన్నికలు దగ్గరికొస్తున్న తరుణంలో ఇటీవలే ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన అనేక మందికి ఆ పార్టీ టికెట్లు కేటాయించింది. కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలుండగా 72 మంది అభ్యర్థుల జాబితాను తొలి విడతగా బీజేపీ ఆదివారం విడుదలచేయడం తెల్సిందే. వీరిలో 11 మంది ఇతర పార్టీల నుంచి ఇటీవల బీజేపీలోకొచ్చినవారే.
వీరిలో చాలా మంది శాసనసభ సభ్యులే. కొంత మంది గతంలో మంత్రులుగా చేశారు. బీజేపీ తొలి విడత అభ్యర్థుల జాబితాలో పేర్లున్నవారిలో దాదాపు అందరూ ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్న వారే. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి బీఎస్ యడ్యూరప్ప షికారిపుర నుంచి పోటీ చేయనున్నారు. 72 మంది అభ్యర్థుల్లో మహిళలు ముగ్గురే ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment