సిద్ధూ సర్కార్‌కు కౌంట్‌డౌన్‌ : యడ్యూరప్ప | Karnataka Assembly Elections 2018: Yeddyurappa SAYS People Are Fed Up With The Siddaramaiah Government | Sakshi
Sakshi News home page

సిద్ధూ సర్కార్‌కు కౌంట్‌డౌన్‌ : యడ్యూరప్ప

Published Sat, May 12 2018 9:28 AM | Last Updated on Sat, May 12 2018 1:45 PM

Karnataka Assembly Elections Yeddyurappa SAYS People Are Fed Up With The Siddaramaiah Government - Sakshi

బీజేపీ సీఎం అభ్యర్థి బీఎస్‌ యడ్యూరప్ప

సాక్షి, బెంగళూర్‌ : సిద్ధరామయ్య నేతృత్వంలోని పాలక కాంగ్రెస్‌ ప్రభుత్వంతో ప్రజలు విసిగిపోయారని బీజేపీ సీఎం అభ్యర్థి బీఎస్‌ యడ్యూరప్ప అన్నారు. ప్రజలంతా పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చి బీజేపీకి అనుకూలంగా ఓటు వేయాలని ఆయన కోరారు. తాను సుపరిపాలన అందచేస్తానని కర్ణాటక ప్రజలకు హామీ ఇస్తున్నానన్నారు. షికార్పూర్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం యడ్యూరప్ప మీడియాతో మాట్లాడారు.

కాగా సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని, అందుకే పోలింగ్‌ శాతం పెరుగుతోందని బీజేపీ సీనియర్‌ నేత సదానందగౌడ అన్నారు. ప్రజలు పెద్దసంఖ్యలో పోలింగ్‌ కేంద్రాలకు తరలివస్తున్నారన్నారు. యడ్యూరప్ప నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. మే 15న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement