
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థులు, అలాగే ఇప్పటివరకు ప్రకటించకుండా మిగిలిన అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల జాబితాను సోమవారం రాత్రి ఒంటిగంట దాటిన తర్వాత విడుదల చేశారు. తొలి జాబితాలో 126 మంది అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించగా, మలి జాబితాలో 15 మందిని ప్రకటించారు. తాజాగా 36 మంది అభ్యర్థులను ఖరారు చేశారు. అయితే తొలిజాబితాలోని నెల్లూరు అభ్యర్థి ఆదాల ప్రభాకర్‌రెడ్డి టీడీపీకి రాజీనామా చేసి వైఎస్సార్‌సీపీలో చేరడంతో ఆయన స్థానంలో అజీన్‌ను ఎంపిక చేశారు. తొలిజాబితాలో గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గానికి శ్రీరాం మాల్యాద్రిని ఎంపిక చేయగా, తాజాగా ఆయన్ను బాపట్ల పార్లమెంటు అభ్యర్థిగా మార్చారు. ఆయన స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌కు టిక్కెటిచ్చారు. కాగా భీమిలి అసెంబ్లీ సీటును పార్టీలోకి చేరకుండానే సబ్బం హరికి కేటాయించారు.
అసెంబ్లీ అభ్యర్థులు: విజయనగరం జిల్లా: నెల్లిమర్ల – పతివాడ నారాయణస్వామి నాయుడు, విజయనగరం– అదితి గజపతిరాజు, విశాఖ జిల్లా: భీమిలి–సబ్బం హరి, గాజువాక– పల్లా శ్రీనివాసరావు, చోడవరం– కలిదిండి సూర్యనాగ సన్యాసిరాజు, మాడుగుల– గవిరెడ్డి రామానాయుడు, పెందుర్తి– బండారు సత్యనారాయణమూర్తి, తూర్పుగోదావరి జిల్లా: అమలాపురం– అయితాబత్తుల ఆనందరావు, పశ్చిమగోదావరి జిల్లా: నిడదవోలు– బూరుగుపల్లి శేషారావు, నర్సాపురం– బండారు మాధవనాయుడు, పోలవరం– బొరగం శ్రీనివాసరావు, గుంటూరు జిల్లా: తాడికొండ– తెనాలి శ్రావణ్‌కుమార్, బాపట్ల– అన్నం సతీష్ ప్రభాకర్, నరసరావుపేట– డాక్టర్ అరవిందబాబు, మాచర్ల – అంజిరెడ్డి, ప్రకాశం జిల్లా: దర్శి– కదిరి బాబూరావు, కనిగిరి–ముక్కు ఉగ్రనర్సింహారెడ్డి, నెల్లూరు జిల్లా: కావలి– విష్ణువర్ధన్‌రెడ్డి, నెల్లూరు రూరల్– అబ్దుల్ అజీజ్, వెంకటగిరి– కె.రామకృష్ణ, ఉదయగిరి– బొల్లినేని రామారావు, వైఎస్సార్ జిల్లా: కడప– అమీర్ బాబు, కోడూరు– నర్సింహప్రసాద్, ప్రొద్దుటూరు– లింగారెడ్డి, కర్నూలు జిల్లా: కర్నూలు– టీజీ భరత్, నంద్యాల– భూమా బ్రహ్మానందరెడ్డి, కోడుమూరు– బి.రామాంజనేయులు, అనంతపురం జిల్లా: గుంతకల్లు– ఆర్.జితేంద్రగౌడ్, సింగనమల– బండారు శ్రావణి, అనంతపురం అర్బన్– ప్రభాకర్ చౌదరి, కల్యాణదుర్గం– ఉమామహేశ్వర్‌నాయుడు, కదిరి– కందికుంట వెంకట ప్రసాద్, చిత్తూరు జిల్లా: తంబళ్ల పల్లె– శంకరయాదవ్, సత్యవేడు– జేడీ రాజశేఖర్, గంగాధర నెల్లూరు– హరికృష్ణ, పూతలపట్టు– తెర్లం పూర్ణం
ఎంపీ అభ్యర్థులు:
శ్రీకాకుళం – కింజారపు రామ్మోహన్నాయుడు, విజయనగరం – అశోక్ గజపతి రాజు, విశాఖపట్నం – ఎం.భరత్, అనకాపల్లి – ఎ.ఆనంద్, అరకు – కిశోర్ చంద్రదేవ్, కాకినాడ – చలమలశెట్టి సునీల్, అమలాపురం – గంటి హరీష్, రాజమండ్రి – మాగంటి రూప, నరసాపురం – వి.శివరామరాజు, ఏలూరు – మాగంటి బాబు, మచిలీపట్నం – కొనకళ్ల నారాయణ, విజయవాడ – కేశినేని వెంకటేశ్వర్లు(నాని), గుంటూరు – గల్లా జయదేవ్, నరసరావుపేట – రాయపాటి సాంబశివరావు, బాపట్ల – శ్రీరాం మాల్యాద్రి, ఒంగోలు – శిద్ధా రాఘవరావు, నెల్లూరు – బీద మస్తాన్‌రావు, కడప – ఆదినారాయణ రెడ్డి, రాజంపేట – డి.సత్యప్రభ, నంద్యాల – శివానందరెడ్డి, కర్నూలు – కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, అనంతపురం – జేసీ పవన్ రెడ్డి, హిందూపురం – నిమ్మల కిష్టప్ప, తిరుపతి – పనబాక లక్ష్మి, చిత్తూరు – శివప్రసాద్
Comments
Please login to add a commentAdd a comment