దేవరకొండ: ఇసుక గుంతల వద్ద ఆడుకుంటూ ఇద్దరు బాలురు ప్రాణాలు కోల్పోయారు. నల్లగొండ జిల్లా దేవరకొండ పట్టణంలో మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. పట్టణ శివారులో నివాసం ఉండే ఇస్లావత్ సిద్ధు(7), ఇస్లావత్ మోహన్(7) తమ ఇళ్లకు సమీపంలోనే ఉన్న మైనంపల్లి వాగులో ఆడుకునేందుకు వెళ్లారు. అక్కడ ఇసుక కోసం తవ్విన గుంతలోకి దిగిన వారిద్దరిపై ఒడ్డు విరిగిపడింది. కొద్దిసేపటి తర్వాత వారి కోసం వెదికిన కుటుంబసభ్యులు గుంతలో ఇసుక కింద కూరుకుపోయినట్లు గుర్తించి వెంటనే బయటకు తీశారు. దేవరకొండ ఆస్పత్రికి తరలించగా వారు అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.