Published
Sun, Jul 31 2016 10:20 PM
| Last Updated on Mon, Sep 4 2017 7:13 AM
ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి
దేవరకొండ : గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ కోరారు. ఆదివారం పట్టణంలోని బాలికల ప్రభుత్వ పాఠశాలలో ఆంకోటెలిగెంట్, నీలగిరి ఫౌండేషన్, యశోద క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరం ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. క్యాన్సర్ బాధితులకు ప్రభుత్వం తరుపున సహాయం అందించేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో దేవరకొండ ఎంపీపీ మేకల శ్రీనివాస్‌యాదవ్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మారుపాకుల సురేష్‌గౌడ్, ఆసిఫ్, పొన్నెబోయిన సైదులు, ముచ్చర్ల ఏడుకొండల్, మధునాయక్, రాజుపేట శ్రీను, కొర్ర రాంసింగ్‌నాయక్, పీపీఆర్, బాబురాంనాయక్, పాండునాయక్, రేపాల హరి, తేలుకుంట్ల జయశ్రీ, సుజాత స్టీఫెన్, రఘు, విజయ్‌కాంత్, రాంబాబు, శ్రీకాంత్‌రెడ్డి తదితరులున్నారు.