
మదనాపురంలో మాట్లాడుతున్న నేనావత్ బాలునాయక్
సాక్షి, చింతపల్లి : దేవరకొండ నియోజకవర్గ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని ప్రజాకూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నేనావత్ బాలునాయక్ పేర్కొన్నారు. మండల పరిధిలోని మదనాపురం, చాకలిశేరిపల్లి, తక్కెళ్లపల్లి, రోటిగడ్డతండా, చౌళ్లతండా, ఉమ్మాపురం, లక్ష్మణ్‌నాయక్, లచ్చిరాంతండా, దేన్యతండా, నెల్వలపల్లి, రాయినిగూడెం, ప్రశాంతపురి, గొల్లపల్లి తదితర గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవరకొండ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధే తన ధ్యేయమన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసేందుకు మరోమారు కుట్రపన్నుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు, ఎంపీపీ రవినాయక్, జెడ్పీటీసీ హరినాయక్, సీపీఐ మండల కార్యదర్శి యుగేందర్‌రావు, టీడీపీ మండల కార్యదర్శి ఆర్‌ఎన్.ప్రసాద్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దాసరి శ్రీనివాస్‌యాదవ్, వెంకటయ్యగౌడ్, నాగభూషణ్, నర్సిరెడ్డి, పురుషోత్తంరెడ్డి, సంజీవరెడ్డి, జంగిటి నర్సింహ తదితరులు పాల్గొన్నారు.