Balu Naik
-
నియోజకవర్గ అభివృద్ధికి కృషి : బాలూ నాయక్
సాక్షి, చింతపల్లి : దేవరకొండ నియోజకవర్గ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని ప్రజాకూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నేనావత్ బాలునాయక్ పేర్కొన్నారు. మండల పరిధిలోని మదనాపురం, చాకలిశేరిపల్లి, తక్కెళ్లపల్లి, రోటిగడ్డతండా, చౌళ్లతండా, ఉమ్మాపురం, లక్ష్మణ్‌నాయక్, లచ్చిరాంతండా, దేన్యతండా, నెల్వలపల్లి, రాయినిగూడెం, ప్రశాంతపురి, గొల్లపల్లి తదితర గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవరకొండ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధే తన ధ్యేయమన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసేందుకు మరోమారు కుట్రపన్నుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు, ఎంపీపీ రవినాయక్, జెడ్పీటీసీ హరినాయక్, సీపీఐ మండల కార్యదర్శి యుగేందర్‌రావు, టీడీపీ మండల కార్యదర్శి ఆర్ఎన్.ప్రసాద్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దాసరి శ్రీనివాస్‌యాదవ్, వెంకటయ్యగౌడ్, నాగభూషణ్, నర్సిరెడ్డి, పురుషోత్తంరెడ్డి, సంజీవరెడ్డి, జంగిటి నర్సింహ తదితరులు పాల్గొన్నారు. మరిన్ని వార్తాలు... -
కాంగ్రెస్‌లో చేరనున్న బాలూనాయక్
-
టీఆర్ఎస్లో చేదు అనుభవం.. సొంతగూటికి కీలక నేత!
టీఆర్ఎస్లో ఎదురైన చేదు అనుభవం నుంచి తేరుకుని.. తిరిగి తన సొంత గూటికి చేరుకునేందుకు జెడ్పీ చైర్మన్ బాలునాయక్ ఏర్పాట్లు చేసుకుంటున్నారా..? ఈ ఎన్నికల్లో దేవరకొండనుంచే మరోసారి కాంగ్రెస్ తరఫున అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నాల్లో ఉన్నారా..? అంటే, ఆయన దగ్గరి అనుచరులు, కాంగ్రెస్ వర్గాలనుంచి అవుననే సమాధానం వస్తోంది. హస్తం పార్టీలోఆయన చేరిక దాదాపుగా ఖాయమని తెలుస్తోంది. ఈ నెల 26న ముహూర్తం పెట్టుకున్నట్లు సమాచారం. సాక్షిప్రతినిధి, నల్లగొండ : జెడ్పీచైర్మన్ బాలునాయక్ ‘హస్తం’ గూటికి చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. 2009 ఎన్నికల్లో దేవరకొండ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందిన బాలునాయక్, ఎమ్మెల్యేగా ఆ పదవిలో ఉండగానే గత స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున జెడ్పీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. కానీ, కొన్నాళ్లకే రాష్ట్రంలో అధికారం చేతులు మారి టీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో ఆయన గులాబీ గూటికి చేరారు. 2019 ఎన్నికల్లో దేవరకొండ నియోజకవర్గం టికెట్ ఆశించే ఆయన పార్టీ మారారన్న అభిప్రాయం బలంగా ఉంది. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో గత ఎన్నికల్లో సీపీఐ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రవీంద్రకుమార్ కూడా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో అప్పటిదాకా దేవరకొండ నియోజకవర్గ ఇన్చార్జ్గా పనిచేసిన బాలు ప్రాధాన్యం పార్టీలో తగ్గిందన్న అభిప్రాయం ఉంది. రవీంద్ర కుమార్ చేరికతో దేవరకొండలో రెండు అధికార కేంద్రాలు తయారయ్యాయి. ఈ ఇద్దరు నాయకులు ఏనాడూ కలిసి పనిచేయలేదు. పార్టీ తరఫున కానీ, ప్రభుత్వం తరఫున కానీ ఏ కార్యక్రమం జరిగినా ఇద్దరు వేర్వేరుగానే కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో ఇక్కడ రెండు గ్రూపులు పోటాపోటీగా పనిచేశాయి. కానీ, టీఆర్ఎస్ అధినాయకత్వం సిట్టింగ్ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్‌కే అభ్యర్థిత్వం ఖరారు చేయడంతో బాలునాయక్‌కు అవకాశం దక్కకుండా పోయింది. కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు మూడేళ్ల కిందట వదిలి వచ్చిన తన సొంత పార్టీ కాంగ్రెస్‌లోకి వెళ్లడానికి రెండు వారాలుగా బాలునాయక్ ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. సీనియర్ నేత జానారెడ్డికి దగ్గరి అనుచరుడిగా ఉండిన ఆయన టీఆర్ఎస్లో చేరడంతో జానాకు దూరమయ్యారు. ఇప్పుడు ఆ దూరాన్ని తగ్గిం చుకుని అటు జానాతో, ఇటు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డితో టచ్‌లోకి వెళ్లారని చెబుతున్నారు. కానీ, ఇక్కడా ఆయనకు కొంత ప్రతికూలత వ్యక్తమైనట్లు ప్రచా రం జరుగుతోంది. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన అప్పటి నల్లగొండ టీడీపీ అధ్యక్షుడు బిల్యానాయక్ కాంగ్రెస్‌లో చేరారు. ఏడా ది కిందట ఆయన టికెట్ హామీపైనే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారన్న అభిప్రాయంఉంది. ఇప్పుడు బాలునాయక్ ఇదే స్థానం నుంచి టికెట్ ఆశిస్తూ.. కాంగ్రెస్‌లోకి వెళ్లాలని చేస్తున్న ప్రయత్నాలకు ఇది అడ్డంకిగా మారిందని చెబుతున్నారు. మరోవైపు మహాకూటమిలో భాగంగా పొత్తులు ఖరారు అయితే, సీపీఐ దేవరకొండను కోరనుండడం కూ డా బాలుకు ప్రతికూల అంశంగా పేర్కొంటున్నారు. గత ఎన్ని కల్లో కాంగ్రెస్ సిట్టింగ్ స్థానంగా ఉన్నా, పొత్తులో భాగంగా సీపీఐకి దేవరకొండను వదిలేశారు. కానీ, ఆ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యే పార్టీ మారడంతో, ఇప్పుడు సీపీఐలో రాష్ట్ర నాయకత్వం స్థాయిలో పనిచేస్తున్న ఓ నాయకుడిని బరిలోకి దింపేందుకు దేవరకొండను మళ్లీ అడుగుతోందని తెలుస్తోంది. పార్టీ నాయకత్వంతో తనకు గతంలో ఉన్న పరిచయాలను వాడుకుంటూ కాంగ్రెస్ గూటికి చేరే ము హూర్తం కూడా పెట్టుకున్నారని తెలిసింది. ఈనెల 26వ తేదీన ఆయన కాంగ్రెస్‌లో చేరే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయంగా తెలిసింది. గెలుపు గుర్రాల వేటలో ఉన్న కాంగ్రెస్ నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. -
కారెక్కనున్న కాంగ్రెస్ జడ్పి ఛైర్మన్!
-
నిర్లక్ష్యాన్ని ఉపేక్షించం
నీలగిరి :జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాలకు, స్థాయీ సంఘ సమావేశాలకు గైర్హాజరవుతున్న సంబంధిత శాఖల అధికారులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని జిల్లా పరిషత్ చైర్మన్ నేనావత్ బాలునాయక్, వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి హెచ్చరించారు. సోమవారం జెడ్పీ కార్యాలయంలో 3వ వ్యవసాయ స్థాయీ సంఘ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహిం చారు. ఈ సమావేశానికి 14 శాఖల అధికారులు హాజరు కావాల్సి ఉంది. కానీ సమావేశంలో ప్రధాన ఎజెండా అంశాలైన డ్వామా, మార్కెటింగ్, అటవీ శాఖ వన్యప్రాణి విభాగం అధికారులు గైర్హాజరయ్యారు. డ్వామా పీడీ సెలవులో ఉన్నందున ఆమె స్థానంలో ఏపీడీ హాజరుకావాల్సి ఉండగా సూపరింటెండెంట్ వచ్చారు. అదేవిధంగా అటవీ శాఖ వన్యప్రాణి విభాగం అధికారికి బదులు కిందిస్థాయి ఉద్యోగి హాజరయ్యారు. ఇక మార్కెటింగ్ శాఖ అధికారులు ఎవరూ కూడా సమావేశానికి రాలేదు. దీంతో ఉద్యోగులతో సమీక్షలు చేయడం సాధ్యం కాదని.. జెడ్పీ సమావేశాలకు తప్పని సరిగా అధికారులు హాజరుకావాల్సిందేనని చైర్మన్, వైస్ చైర్మన్లు స్పష్టం చేశారు. ముందస్తు అనుమతి లేకుండా అధికారులు సమీక్షలకు గైర్హాజరవడం పట్ల వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మరో సారి ఆ శాఖల అధికారులను రప్పించి కలెక్టర్ సమక్షంలో సమావేశాలు ఏర్పాటు చేయాలని సీఈఓను ఆదేశించారు. వన్యప్రాణి విభాగం పై ఫైర్... నాగార్జునసాగర్ అటవీ శాఖ వన్యప్రాణి విభాగం అధికారి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని చైర్మన్, వైస్‌చైర్మన్ మండిపడ్డారు. మారుమూల తండాల్లో కంకర రోడ్లు పూర్తయినా వాటిపై బీటీ వేయకుండా సం బంధింత అధికారి లేనిపోని కొర్రీలు పెడుతున్నారని వాపోయారు. సాగర్‌లో మెయిన్‌రోడ్డుకు సమీపంలో నిర్మించిన దేవస్థానం గోపుర శిఖరం అటవీ శాఖ నిబంధనలకు అడ్డుగా ఉం దన్న కారణంతో దానిని సంబంధిత అధికారి తీసుకెళ్లారని వైస్ చైర్మన్ తెలి పారు. హాలియా - పెద్దవూర కూడలి వద్ద ఏర్పాటు చేసిన సమ్మక్క-సారక్క దేవస్థానం లైట్లు పులులకు ఇబ్బందికరంగా మారాయని వాటిని తొలగించారన్నారు. ఈ విషయాలన్నీ చర్చించాల్సిన సమావేశానికి అధికారి గైర్హాజరుకావడం పట్ల వారు మండిపడ్డారు. అడ్డగోలు అక్రమాలు.. కిరోసిన్ డీలర్లు లబ్ధిదారులకు పంపిణీ చేయకుండా కిరోసిన్‌ను బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తున్నారని స్థాయీ సంఘం సభ్యులు ఫిర్యాదు చేశారు. రెండు నెలల పేరు మీద ఒక్కసారి మాత్రమే కిరోసిన్ పంపిణీ చేసి మిగతా కోటాను బ్లాక్మార్కెట్లో అమ్ముకుంటున్నారని వైస్ చైర్మన్ అధికారులకు వివరించారు. నెలవారీ కోటాలో కోత పెడుతూ చివరకు వచ్చే సరికి ట్యాం కుల కొద్దీ కిరోసిన్ అక్రమంగా హోల్‌సేల్ డీలర్లు తరలిస్తున్నారని ఆరోపించారు. ఇక ఐకేపీ కేంద్రాలు కొనుగోలు చేసిన ధాన్యాన్ని రవాణా చేయడంలో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. సకాలంలో కాంట్రాక్టర్లు లారీలను పం పడం లేదని దీంతో రైతులే స్వయంగా డబ్బులు చెల్లించి ట్రాక్టర్లు ఏర్పాటు చేసుకుని ధాన్యం తరలిస్తున్నారని సభ్యులు వివరించారు. అలాకాకుండా వచ్చే సీజన్ నుంచి ధాన్యం రవాణా బాధ్యతలను సంఘాలకు అప్పగించాలని సభ్యులు సూచించారు. ఇక సూక్ష్మనీటి పారుదల శాఖ ఉద్యోగులు డ్రిప్ మంజూరు చేయకుండా లబ్ధిదారుల నుంచి సంతకాలు తీసుకుంటున్నారని.. వాటి పై ఎంపీపీ, జెడ్పీటీసీలను సంతకం చేయాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నారని వైస్ చైర్మన్ సంబంధిత అధికారులకు తెలిపారు. లబ్ధిదారుల పేరు మీద ఇతర జిల్లాలకు డ్రిప్ పరికరాలు తరలిస్తున్నారని, డ్రిప్ ఏజెన్సీలు అక్రమాలను ప్రోత్సహిస్తున్నాయని ఆయన తెలిపారు. క్షేత్రస్థాయిలో తనిఖీలు చేసిన తర్వాత డ్రిప్ బిల్లులు చెల్లించాలని, రైతుల నుంచి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత మంజూరు చేయాలని వైస్ చైర్మన్, సభ్యులు సూచించారు. యూరియా కోటా సహకార సంఘాలకు 60 శాతం, అధీకృత డీలర్లకు 40 శాతం ఇవ్వాలని సభ్యులు సమావేశంలో ప్రతిపాదించారు. ఈ సమావేశానికి జెడ్పీ సీఈఓ దామోదర్ రెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు రవి, సీహెచ్ కోటేశ్వరారవు, యాదగిరి, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధికి అంకితం
నల్లగొండ :‘‘జిల్లా సమగ్రాభివృద్ధికి అందరి సహకారంతో ముందుకు సాగుతా. ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాల్లో తాగునీటి కొరత తీర్చేందుకు ప్రాధాన్యతాక్రమంలో ప్రాజెక్టులు పూర్తి చేయిస్తా. పాలన సాఫీగా సాగేందుకు అనుభవజ్ఞులైన పెద్దలతో ప్రత్యేక కమిటీ వేస్తా’’ అని జిల్లా పరిషత్ చైర్మన్ నేనావత్ బాలునాయక్ అన్నారు. గురువారం ఉదయం 11:05 గంటలకు ఆయన జెడ్పీ కార్యాలయంలో చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే.... కలిసి మెలిసి... మా పార్టీ అధికారంలో లేదు. అయినా అందరి సహకారంతో జిల్లా అభివృద్ధికి అవసరమయ్యే నిధులు రాబట్టేందుకు కృషి చేస్తా. ప్రతిపక్ష పార్టీ చెం దిన వ్యక్తిననే భావన లేకుండా జిల్లా మంత్రి జగదీష్‌రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్, ఎంపీలు, ఎమ్మెల్యేల సహకారాలతో అభివృద్ధికి అంకితమవుతా. అభివృద్ధిలో అధికార, ప్రతిపక్షం అన్న వ్య త్యా సం లేకుండా ప్రజాప్రతినిధులు, ఎంపీపీ, జెడ్పీటీ సీలు, అధికార యంత్రాంగాన్ని భాగస్వాముల్ని చేస్తా. ఫ్లోరైడ్పై ప్రత్యేక దృష్టి జిల్లాలో నెలకొన్న ప్రధాన సమస్యలను ప్రధానాంశంగా తీసుకుని వాటిని పరిష్కరించేందుకు ప్రాధాన్యతక్రమంలో ముందుకు వెళ్తా. సీఎం కేసీఆర్ ఎన్నికల హామీలో భాగంగా జిల్లాలో ఫ్లోరైడ్, తాగు, సాగునీటి సమస్యలను పరిష్కరిస్తానని చెప్పారు. ఫ్లోరైడ్ పీడిత గ్రామాలకు జానారెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు రూ.1400 కోట్లు కేటాయించారు. ఇందులో దేవరకొండకే రూ.100 కోట్లున్నాయి. వీటితోపాటుగా సీఎం ఇచ్చిన హామీ మేరకు భారీస్థాయిలో నిధులు మంజూరు చేయించి పెండింగ్‌లో ఉన్న తాగు, సాగు నీటి ప్రాజెక్టులను పూర్తి చేయిస్తా. చందంపేటలో ఐటీడీఏ ఉమ్మడి రాష్ట్రంలో తలెత్తిన కొన్ని కారణాల వల్ల జిల్లాకు ఐటీడీఏ ప్రాజెక్టు రాకుండా పోయింది. తెలంగాణ రాష్ట్రంలో గిరిజన జనాభా ఎక్కువగా ఉన్న జిల్లాల్లో మన జిల్లా కూడా ఒకటి. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ జిల్లాలో ఐటీడీఏ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తామన్నారు. ఇదే విషయమై ప్రభుత్వ పెద్దలతో చర్చిస్తా. విద్య, వైద్యపరంగా కూడా గిరిజన ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తా. పెద్దలతో ప్రత్యేక కమిటీ జిల్లా పరిషత్‌కు సంబంధించిన అన్ని విషయాల్లో అనుభవజ్ఞులైన వారితో ప్రత్యేకంగా ఓ కమిటీ ఏర్పా టు చేస్తా. ఈ కమిటీ పాలకవర్గ సభ్యులకు, పాలనాయంత్రాంగానికి మధ్య సమన్వయకర్తగా వ్యవహరి స్తుంది. జిల్లాపరిషత్ పాలనకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సాఫీగా సాగేందుకు ఈ కమిటీ అన్ని రకాలుగా తోడ్పాటు అందిస్తుంది. పార్టీని వీడే ప్రసక్తి లేదు కాంగ్రెస్ పార్టీ నా రాజకీయ భవిష్యత్‌కు పునాదులు వేసింది. ఎన్నో పదవులు కట్టబెట్టింది. పార్టీని వీడి బ యటకు వెళ్లేది లేనేలేదు. ఎలాంటి గ్రూపులులేవు. అం దరిని కలుపుకుపోయే వ్యక్తిని కాబట్టే, అందరి సహకారంతో చైర్మన్ పదవికి ఏక గ్రీవంగా ఎన్నికయ్యా. -
ఆ.. నాలుగు అంశాలనే నమ్ముకున్నా
దేవరకొండ :నా ఎదుగుదలను అడ్డుకోవడానికి ఎవరు అడ్డుపడినా..నేను మాత్రం ఆ దేవుడిని, నా గురువు జానారెడ్డిని, కష్టపడిన పనిచేసే నా నైజాన్ని, ప్రజ లను మాత్రమే నమ్ముకున్నానని, అవే నా ఎదుగుదలకు కారణమని జిల్లా పరిషత్ చైర్మన్ నేనావత్ బాలునాయక్ అన్నారు. జెడ్పీ చైర్మన్‌గా ఎన్నికైన అనంతరం తొలిసారిగా సోమవారం ఆయన సొంత నియోజకవర్గం దేవరకొండకు వచ్చారు. ఈ సందర్భంగా కొండమల్లేపల్లి నుంచి దేవరకొండ వరకు కార్యకర్తలు భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బాలునాయక్ మాట్లాడుతూ జిల్లా పరిషత్ చైర్మన్‌గా జిల్లాసమగ్రాభివృద్ధికి కృషి చేయడంతోపాటు నా సొంత నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేస్తానని హామీనిచ్చారు. 2019 నాటికి ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చి, జానారెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు అందరూ కష్టపడాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభాపక్ష నేత జానారెడ్డిల సహకారం, జెడ్పీ సభ్యుల తోడ్పాటుతో అభివృద్ధిలో జిల్లాను ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ఎంపీపీలు, జెడ్పీటీసీలను ఆయన అభినందించారు. జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీ..ఇక్కడి ప్రజల చిరకాల ఆకాం క్షను గుర్తించి తెలంగాణ ఇచ్చారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అనైతికంగా కుట్రలు పన్ని జిల్లా పరిషత్‌ను సొంతం చేసుకునేందుకు చూసిందని, అయినా వారి కుట్రలు పనిచేయలేదన్నారు. తెలంగాణలో నల్లగొండకు ఎంతో చరిత్ర ఉందని, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే..ఇక్కడినుంచే బీజం వేయాలన్నారు. భారీ వర్షంలోనే ర్యాలీ సాగింది. కార్యక్రమంలో జెడ్పీటీసీ ఆలంపల్లి నర్సింహ, దేవరకొండ ఎంపీపీ మేకల శ్రీనివాస్‌యాదవ్, నాయకులు గోవింద్, సిరాజ్‌ఖాన్, వెంకటేశ్వర్లు, భాస్కర్, రవి, ఇద్రిస్, యూ నిస్, సైదులు, కొండల్‌రెడ్డి పాల్గొన్నారు. ఫ్లోరైడ్ నివారణకు కృషి జిల్లాలో ఫ్లోరోసిస్ నివారణ కోసం రూ.1400 కోట్లతో చేపట్టిన పథకం పనులు వేగవంతం చేయడానికి కృషి చేస్తానని జెడ్పీ చైర్మన్ బాలునాయక్ తెలిపారు. దేవరకొండలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. డిండి ఎత్తిపోతల పథకాన్ని పక్కకు పెట్టే ఆలోచన ప్రభుత్వానికి ఉంటే దానిని మానుకోవాలన్నారు. గ్రామాల్లో మౌలిక వసతులు సమకూర్చేందుకు పాటుపడతానన్నారు. ఆయన వెంట ఎంపీపీ మేకల శ్రీనివాస్, పలువురు నాయకులు ఉన్నారు. -
నేడు జెడ్పీ చైర్మన్ ఎన్నిక
చైర్మన్‌గా బాలూనాయక్ ఎన్నిక లాంఛనమే - వైస్ చైర్మన్‌గా కర్నాటి లింగారెడ్డి? - విప్ అధికారం ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డికి అప్పగించిన అధిష్టానం సాక్షిప్రతినిధి, నల్లగొండ : జిల్లా పరిషత్ చైర్మన్ పీఠం కాంగ్రెస్ వశం కావడం లాంఛనమే. దేవరకొండ మాజీ ఎమ్మెల్యే బాలూనాయక్‌ను తమ చైర్మన్ అభ్యర్థిగా కాంగ్రెస్ ఖరారు చేసింది. ఈ మేరకు ఆయన పేరునే బీ-ఫారం కూడా సిద్ధమైనట్లు పార్టీ వర్గాల సమాచారం. అధిష్టానం విప్ జారీచేసే అధికారాన్ని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డికి అప్పగించింది. జిల్లాలోని 59జెడ్పీటీసీ స్థానాల్లో అత్యధికంగా 43 స్థానాల్లో గెలుపొంది కాంగ్రెస్ తిరుగులేని మెజారిటీ సాధించింది. పాలక వర్గాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ 30 మంది సభ్యులు. కానీ కాంగ్రెస్‌కు మరో 13 స్థానాలు అధికంగా ఉన్నాయి. దీంతో జిల్లాపరిషత్ చైర్మన్,వైస్‌చైర్మన్ పదవులు కాంగ్రెస్ ఖాతాలోకి వెళతాయి. ఇక, అధికార టీఆర్ఎస్ పార్టీ 13 జెడ్పీటీసీ స్థానాలతో ద్వితీయ స్థానంలో నిలిచింది. తిరుగులేని మెజారిటీ ఉన్న కాంగ్రెస్‌లో పెద్దఎత్తున చీలిక తెస్తే మినహా పరిస్థితి తారుమారయ్యే అవకాశమే లేదు. మొదట్లో అక్కడక్కడా ప్రచారం జరిగినా, తీరా ఇప్పుడు ఆ ఊసే ఎవరూ ఎత్తడం లేదు. అదేమాదిరిగా, కాంగ్రెస్‌లోనే మరో ఇద్దరు కూడా చైర్మన్ పీఠాన్ని ఆశిస్తున్నట్లు జోరుగానే ప్రచారం జరిగింది. అయినా, ముఖ్య నాయకులు ఎవరూ గ్రూపులను ప్రోత్సహించని కారణంగా అధిష్టానం ముంద అనుకున్న విధంగానే బాలూనాయక్‌కే బి-ఫారం ఇచ్చిందని పార్టీ వర్గాలు తెలిపాయి. గిరిజనులకు తొలిసారి రిజర్వు అయిన జెడ్పీ పీఠం కోసం ఇతర పార్టీలు ఆశించే పరిస్థితే లేకుండా అయ్యింది. మొత్తంగా రిజర్వుడు స్థానాల నుంచి ఏడుగురు, జనరల్ స్థానాల నుంచి మరో నలుగురు మొత్తంగా 11 మంది ఎస్టీలు జెడ్పీటీసీ సభ్యులుగా గెలిచారు. దీంతో చైర్మన్ పదవికి పోటీ పడే వారి సంఖ్య పెరుగుతుందని భావించినా, పెట్టుబడికి సంబంధించిన వ్యవహారం కావడంతో అంతా వెనకడుగు వేసినట్లే చెబుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బాలూనాయక్‌ను సీపీఐ కోసం పక్కన పెట్టారు. టికెట్ త్యాగం చేసినందుకుగాను జెడ్పీ చైర్మన్ పదవిని ఇస్తామని ఏఐసీసీ నేత దిగ్విజయ్ సింగ్ సమక్షంలో హామీ ఇచ్చినట్లు పేర్కొంటున్నారు. ఈ హామీలో భాగంగానే బాలూనాయక్ జెడ్పీ పీఠాన్ని అధిష్టించనున్నారు. వైస్ చైర్మన్... ఎవరు ? సార్వత్రిక ఎన్నికల్లో కేవలం ఐదు స్థానాలకే పరిమితం అయిన కాంగ్రెస్ భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లనూ కోల్పోయింది. ఈ ప్రాంతంలో పార్టీని బలోపేతం చేయడానికి వైస్ చైర్మన్ పదవిని కోరే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ముందు నుంచీ కాంగ్రెస్‌లో పెద్దవూర జెడ్పీటీసీ సభ్యుడు కర్నాటి లింగారెడ్డి ప్రచారంలో ఉంది. అయితే, వివిధ రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఆయనను ఎంత వరకు వైస్‌చైర్మన్ పదవికి ఎన్నుకుంటారన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. పార్టీ సీనియర్ నేతలు చెబుతున్న విశ్వసనీయ సమచారం మేరకు లింగారెడ్డి పేరునే ఖరారు చేసినట్లు తెలుస్తోం ది. ఏదైనా జరగరాని, అనూహ్యమైన సంఘటన జరిగితే మినహా నల్లగొండ జిల్లా పరిషత్ కాంగ్రెస్‌నుంచి చేజారే పరిస్థితి లేనే లేదు.