
సాక్షి, హైదరాబాద్: దేవరకొండను జిల్లాగా ఏర్పాటు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డికి జిల్లా సాధనకు పోరాడుతున్న వివిధ సంఘాలు, పార్టీలు విన్నవించాయి. హైదరాబాద్ లోని ముఖ్దూంభవన్‌లో ఆదివారం ఆయా సంఘా లు, పార్టీల నేతలు సీపీఐ నేతలను కలిశారు. వెనుకబడిన గిరిజన ప్రాంతమైన దేవరకొండను జిల్లాగా ఏర్పాటు చేసేలా సీఎం కేసీఆర్‌పై ఒత్తిడి తీసుకోవాలని కోరారు. వారిని కలిసిన వారిలో జిల్లా సాధన సమితి కన్వీనర్ కేతావత్ లాలూ నాయక్, గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమావత్ అంజయ్యనాయక్, బీజేపీ నేత నక్క వెంకటేశ్వర్లు, ఏఐబీఎస్ కార్యదర్శి కేతావత్ హేమ్లానాయక్, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అ«ధ్యక్షుడు తాటిశెట్టి నర్సింహ, బీజేపీ కార్యదర్శి వనం పుష్పలత ఉన్నారు. దేవరకొండను జిల్లాగా ఏర్పాటు చేయాలని దేవరకొండ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు లాలూ నాయక్, మాజీ మంత్రి రవీంద్ర నాయక్ ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment