
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ రెండేళ్ల క్రితం గ్రామ రెవెన్యూ అసిస్టెంట్ (వీఆర్‌ఏ)లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సీపీఐ తెలంగాణ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు శనివారం చాడ లేఖ రాశారు. ధరణిలో దొర్లిన తప్పులను సరిచేయడానికి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న వీఆర్‌ఏల అవసరం ఎంతైనా ఉందని ప్రభుత్వం గ్రహిస్తే మంచిదని ఆయన పేర్కొన్నారు.
వీఆర్‌ఏల సమస్యను ప్రత్యేక దృష్టితో చూసి సీఎం అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీ ప్రకారం పేస్కేల్, పదోన్నతులు, వారసత్వ ఉద్యోగాలు, ఇతర సమస్యలను వెంటనే పరిష్కరించాలని లేఖలో చాడ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment