రోడ్డుపై వెళ్తున్న బైక్‌ను వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, మరొక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.
దేవరకొండ (నల్లగొండ) : రోడ్డుపై వెళ్తున్న బైక్‌ను వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, మరొక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన గురువారం సాయంత్రం నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం ఇద్దంపల్లి గ్రామం సమీపంలో జరిగింది. వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా వంగూరు మండలానికి చెందిన ధరావత్ దీపక్, లలిత దంపతులు బైక్‌పై నల్లగొండ జిల్లా పీఎ పల్లి మండలం బాలాజీనగర్ తండాకు వెళ్తున్నారు.
కాగా మార్గ మధ్యంలో వీరు ప్రయాణిస్తున్న బైక్‌ను లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో లలిత(22) అక్కడికక్కడే మృతి చెందగా, దీపక్ కాలు విరిగింది. గాయపడిన దీపక్‌ను 108లో దేవరకొండ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.